డోపింగ్‌ టెస్టులో పట్టుబడ్డ గోమతి మరిముతు

|

May 22, 2019 | 1:39 PM

చెన్నై: గత నెల ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో 800 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణపతకం సాధించిన అథ్లెట్‌ గోమతి మరిముతు డోపింగ్‌ టెస్టులో పట్టుబడింది. దీంతో మంగళవారం ఆమెపై ప్రాథమిక సస్పెన్షన్‌ వేటు పడింది. శాంపిల్‌ ‘ఏ’ లో ఆమె నిషేధిత ఉత్ప్రేకం వాడినట్లు తేలడంతో ప్రస్తుతం ఆమెపై ప్రాథమిక నిషేధం విధించారు. ఒకవేళ శాంపిల్‌ ‘బి’లోనూ నిజమని తేలితే గరిష్టంగా నాలుగేళ్ల పాటు నిషేధం వర్తిచడంతో పాటు ఆసియా ఛాంపియన్‌షిప్‌లో గెలిచిన స్వర్ణ పతకాన్ని కూడా భారత్‌ […]

డోపింగ్‌ టెస్టులో పట్టుబడ్డ గోమతి మరిముతు
Follow us on

చెన్నై: గత నెల ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో 800 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణపతకం సాధించిన అథ్లెట్‌ గోమతి మరిముతు డోపింగ్‌ టెస్టులో పట్టుబడింది. దీంతో మంగళవారం ఆమెపై ప్రాథమిక సస్పెన్షన్‌ వేటు పడింది. శాంపిల్‌ ‘ఏ’ లో ఆమె నిషేధిత ఉత్ప్రేకం వాడినట్లు తేలడంతో ప్రస్తుతం ఆమెపై ప్రాథమిక నిషేధం విధించారు. ఒకవేళ శాంపిల్‌ ‘బి’లోనూ నిజమని తేలితే గరిష్టంగా నాలుగేళ్ల పాటు నిషేధం వర్తిచడంతో పాటు ఆసియా ఛాంపియన్‌షిప్‌లో గెలిచిన స్వర్ణ పతకాన్ని కూడా భారత్‌ కోల్పోవాల్సివస్తుంది. తమిళనాడుకు చెందిన గోమతి ఏప్రిల్‌ 22న ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తరఫున స్వర్ణ పతకం సాధించింది.