Anand Mahindra : ఆస్ట్రేలియా సిరీస్‌లో మెరిసిన యువ ఆటగాళ్లకు అదిరిపోయే గిఫ్ట్‌‌లను ఆఫర్ చేసిన ఆనంద్ మహేంద్ర..

ఆస్ట్రేలియా పై భారత్ సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే..ఈ విజయంపై దేశం మొత్తం టీమిండియా ఆటగాళ్లపై ప్రసంశల వర్షం కురిపించారు. కాగ ఆస్ట్రేలియా సిరీస్ ఆడిన ప్లేయర్లకు..

Anand Mahindra : ఆస్ట్రేలియా సిరీస్‌లో మెరిసిన యువ ఆటగాళ్లకు అదిరిపోయే గిఫ్ట్‌‌లను ఆఫర్ చేసిన ఆనంద్ మహేంద్ర..

Edited By:

Updated on: Jan 24, 2021 | 10:29 AM

Anand Mahindra : ఆస్ట్రేలియా పై భారత్ సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ విజయంపై దేశం మొత్తం టీమిండియా ఆటగాళ్లపై ప్రసంశల వర్షం కురిపించారు. కాగ ఆస్ట్రేలియా సిరీస్ ఆడిన ప్లేయర్లకు బహుమతులు ఇస్తానని ఆనంద్ మహేంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్ చేసారు. ఈ సిరిస్‌లో మెరిసిన యువ ఆటగాళ్లు మొహమ్మద్ సిరాజ్, శుబ్ మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్‌‌లకు ఎస్యూవీ కార్‌లను గిఫ్ట్ గా ఇవ్వనున్నారు ఆనంద్ మహేంద్ర. ఈ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆరుగురు క్రికెటర్లు తమ తొలిమ్యాచ్ ఆడారు. వారంతా రాబోయే జనరేషన్ల కలలు సాకారం చేసుకునేందుకు ప్రేరణగా నిలిచారు. జీవితంలో ప్రతి ఘట్టానికి ఇన్ స్పిరేషన్ అయ్యారు. సిరీస్ లో ఆడిన కొత్తవారికి న్యూ థార్ ఎస్యూవీని నా సొంత ఖర్చుతో గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నా. దీనికి కంపెనీకి ఎటువంటి సంబంధం అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి ..
‘టీమిండియా సింహంలా గర్జిస్తుంది’.. జర జాగ్రత్త ప్లేయర్స్.. స్వాన్ స్వీట్ వార్నింగ్..