Rahul Dravid: ఆ విషయంలో మరింత మెరుగుపడాలి.. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Oct 05, 2022 | 10:22 PM

టీ20 ప్రపంచకప్ కు గడువు సమీపిస్తోంది. దీంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ లను గెల్చుకున్న భారత్.. విజయానందంతో టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాపై అడుగుపెట్టబోతుంది. ఈ సమయంమలో భారతజట్టు ఏయే విషయాలను మెరుగుపర్చుకోవాలనేదానిపై..

Rahul Dravid: ఆ విషయంలో మరింత మెరుగుపడాలి.. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Rahul Dravid, Rohit Sharma
Follow us on

టీ20 ప్రపంచకప్ కు గడువు సమీపిస్తోంది. దీంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ లను గెల్చుకున్న భారత్.. విజయానందంతో టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాపై అడుగుపెట్టబోతుంది. ఈ సమయంమలో భారతజట్టు ఏయే విషయాలను మెరుగుపర్చు కోవాలనేదానిపై కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ.. గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఈ నెలలో జరిగే ప్రపంచకప్‌కు దూరమయ్యాడని, ఇది జట్టుకు నష్టం కలిగించే అంశమన్నారు. అయితే టీ20 ఫార్మట్ లో భారత బౌలర్లు డెత్ ఓవర్లలో తమ ఆట తీరును మెరుగుపర్చుకోవల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ఇండోర్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో చివరి 5 ఓవర్లలో 73 పరుగులు ఇవ్వడమే జట్టు ఓటమికి కారణమని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ విశ్లేషిచారు. టీ20 ప్రపంచకప్ నాటికి జట్టులోని లోపాలను సరిదిద్దుకుని ఎంత మెరుగ్గా మెగా టోర్నమెంట్ లో రాణిస్తామనేది చాలా ముఖ్యమన్నారు. జట్టులో లోపాలను సరిదిద్దుకోవడానికి అవసరమైన ప్రయత్నాలు చేస్తామన్నారు.

అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నమెంట్ కు వెన్ను గాయం కారణంగా బూమ్రా దూరమయ్యాడు. ఇది జట్టుకు దెబ్బగానే భావించాలని ద్రవిడ్ చెప్పారు. అతడి స్థానంలో ఎవరితో భర్తీ చేయాలనేదానిపై తొందర పడటంలేదన్నారు. బూమ్రా నిజంగా గొప్ప ఆటగాడని, అయితే తన నైపుణ్యాన్ని రుజువు చేసుకోవడానికి మరో ఆటగాడికి అవకాశంగా కూడా దీనిని భావించాల్సి ఉంటుందన్నాడు. మహ్మద్ షమి కూడా బాగా బౌలింగ్ చేయగలడన్నారు. అతడు కోవిడ్ నుంచి కోలుకున్నాడా లేదా అనే దానిపై వైద్య నివేదికలు రావాల్సి ఉందన్నారు.

వైద్య నివేదికల ఆదారంగా షమి ఆడటంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా.. టీమిండియా టీ20 ప్రపంచ కప్ కోసం అక్టోబర్ 6వ తేదీన ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. అక్టోబర్ 23న మెల్ బోర్న్ లో పాకిస్తాన్ తో మొదటి మ్యాచ్ ఆడనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..