బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తమిళనాడుతో జరిగిన విజయ్ హాజారే ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక విజయం సాధించింది. ఫలితంగా విజయ్ హాజారే ట్రోఫీని కర్ణాటక 4వసారి కైవసం చేసుకుంది. తమిళనాడు నిర్దేశించిన 253 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కర్ణాటక ఇన్నింగ్స్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి కర్ణాటక 23 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది. అయితే, వీజేడీ పద్ధతి(వి జయవర్దనే) ద్వారా కర్ణాటక గెలిచినట్లు అంఫైర్లు ప్రకటించారు.
కాగా కర్ణాటక బౌలింగ్ చేసినప్పుడు చివరి ఓవర్లో అభిమన్యు వరుస మూడు బంతుల్లో షారుఖ్ ఖాన్, మహ్మద్, మురుగన్ అశ్విన్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. దీంతో విజయ్ హజారె ట్రోఫీలో హ్యాట్రిక్ సాధించిన తొలి కర్ణాటక బౌలర్‌గా రికార్డులకెక్కాడు. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ రెండింటిలోనూ హ్యాట్రిక్ సాధించిన రెండవ ఆటగాడిగా మిథున్ నిలిచాడు. మరోవైపు ఈ రోజు అభిమన్యు పుట్టినరోజు కావడం విశేషం.
A Hat-trick for Abhimanyu Mithun in the final over, becomes the first Karnataka bowler to take a hat-trick in #VijayHazare Trophy.
Tamil Nadu bowled out for 252 in 49.5 overs#KARvTN @paytm pic.twitter.com/A17K50jAxW— BCCI Domestic (@BCCIdomestic) October 25, 2019