Fire Limbo Skating: పిట్ట కొంచెం కూత గనం అనే నానుడి ఈ చిన్నారికి సరిగ్గా సరిపోలుతుందనడం ఏమాత్రం సందేహం లేదు. వయసు చూస్తే ఐదేళ్లే అయినా.. తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు కు చెందిన ఐదేళ్ల చిన్నారి రిషిత ఫైర్ లింబో స్కేటింగ్‌లో సంచలనం సృష్టించింది. ఏకంగా ప్రపంచ రికార్డును నెలకొల్పింది. తణుకులోని స్కేటింగ్ కోర్టులో 8 అంగుళాల ఎత్తులో 20 మీటర్ల పొడవుగా హార్డిల్స్ ఏర్పాటు చేశారు. వాటికి మంటలు అంటించారు. అలా భగభగ మండుతున్న అగ్ని కీలల మధ్య చిన్నారి రిషిత స్కేటింగ్ చేసి ప్రపంచ రికార్డ్ నమోదు చేసింది. ఈ అసాధారణ సాహసంతో చిన్నారి రిషిత అందరి చేత శభాష్ అనిపించుకుంది. వజ్రా వరల్డ్ రికార్డ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ ఫీట్ సాధించిన చిన్నారి రిషితకు వజ్రా వరల్డ్ రికార్డ్ సంస్థ సీఈవో తిరుమలరావు అవార్డుతో పాటు ట్రోఫీ, మెడల్‌ను అందజేశారు. అనంతరం మాట్లాడిన ఆయన.. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా చేయలేని సాహసోపేతమైన ఫైర్ లింబో స్కేటింగ్‌లో ఐదేళ్ల చిన్నారి రిషిత అసాధారణ ప్రతిభ కనబరిచిందని ప్రశంసించారు. అంతేకాదు.. ఇప్పటి వరకు బాలుర విభాగంలోనే ఫైర్ లింబో చేశారు తప్ప.. బాలికల విభాగంలో ఈ రకం స్కేటింగ్ చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఇక ఫైర్ లింబోలో వరల్డ్ రికార్డ్ సాధించిన రిషిత రాష్ట్రానికే గర్వకారణం ప్రశంసించారు. ఇదిలాఉంటే.. రిషిత చిన్న నాటి నుంచే స్కెటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచేది. రిషిత తల్లిదండ్రులుకు తనను స్కేటింగ్‌లో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కాగా, లింబో స్కేటింగ్‌లో రిషితకు లావణ్య కోచింగ్ ఇస్తున్నారు.
Sports Authority of Andhra Pradesh Tweet:
#Rishita, a 5-year-old girl from Tanuku town in the West Godavari district of Andhra Pradesh, set a world record for longest limbo fire skating under the guidance of coach Lavanya.
Congratulations Rishita#Sports #SportsinAP #SAAP #Limboskating #FireSkating #Skating #Worldrecord pic.twitter.com/Q6BcgleNEH— Sports Authority of Andhra Pradesh (@SportsinAP) February 25, 2021
Also read: