మదుపరుల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. మారుతోన్న కాలానికి అనుగుణంగా తమ ఆలోచనలను సైతం మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆసక్తి తగ్గుతోంది. దీనికి కారణం పెరుగుతోన్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వడ్డీ రేట్లు పెరగకపోవడే. ఈ కారణమే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి సంప్రదాయ పెట్టుబడి విధానానికి ఆధరణ తగ్గుతుండడానికి కారణంగా కనిపిస్తోంది. వినియోగదారుల ధరల సూచిక (CPI) ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణం 7.4% కంటే ఎక్కువగా ఉండగా, ఎఫ్‌డీ 6 నుంచి 7 శాతం మధ్య ఉంటోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే మెరుగైన రాబడి పొందగలిగే ప్రత్యామ్నాయల వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగానే అధిక డివిడెండ్-దిగుబడిని ఇచ్చే స్టాక్‌లు మంచి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఇంతకీ డివిడెంట్ అంటే ఎంటో తెలుసుకుందాం..
కంపెనీ ఆదాయాలో కొంత భాగాన్ని కంపెనీ వాటాదారులకు పంపినీ చేయడాన్నే డివిడెండ్ అంటారు. సాధారణంగా డివిడెండ్‌లను నగదు చెల్లింపు, స్టాక్‌లు లేదా మరేదైనా రూపంలో జారీ చేయొచ్చు. చాలా కంపెనీలు సాధారణంగా డివిడెండ్లలో నగదు చెల్లింపును ఇస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వడ్డీని పొందినట్లుగానే, స్టాక్‌లలో పెట్టుబడిపై డివిడెండ్‌లను పొందుతారు. కంపెనీ డివిడెండ్ దాని డైరెక్టర్ల బోర్డులు నిర్ణయించారు. దీనికి కంపెనీ వాటాదారుల ఆమోదం అవసరం. అయితే, కంపెనీ డివిడెండ్ చెల్లించడం తప్పనిసరి కాదు. ఒక కంపెనీ సాధారణంగా ఆర్థిక ఫలితాలను వెల్లడించినప్పుడు డివిడెండ్‌ను ప్రకటిస్తుంది. ఒక కంపెనీ త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక లేదా అన్ని విరామాలలో కంపెనీ పనితీరును బట్టి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల విచక్షణ ప్రకారం డివిడెండ్‌ను ప్రకటించవచ్చు.
డివిడెండ్ దిగుబడి అంటే ఒక్కో షేరుకు మార్కెట్ విలువకు సంబంధించి వాటాదారులకు చెల్లించే చెల్లించే నగదు డివిడెండ్‌ల పరిమాణాన్ని కొలవడం. ఒక్కో షేరుకు డివిడెండ్‌ని ఒక్కో షేరుకు మార్కెట్ ధరతో భాగించి, ఫలితాన్ని 100తో గుణించడం ద్వారా దీనిని లెక్కిస్తారు. ఉదాహరణకు, ఒక కంపెనీ రూ.12 డివిడెండ్‌గా ప్రకటించి, దాని షేరు ధర రూ.120గా ఉంటే డివిడెండ్ రాబడిని ఇలా (10/120*100 = 10%) లెక్కిస్తారు. ఈ ఏడాది డివిడెండ్ చెల్లించడానికి షెడ్యూల్ చేసిన కంపెనీల గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి 5paisa.comలో చూడొచ్చు.
ఇది స్టాక్ హోల్డర్లకు కంపెనీ డివిడెండ్‌లను ప్రకటించే తేదీ. పత్రికా ప్రకటనలో డివిడెండ్ పంపిణీ తేదీ, డివిడెండ్ పరిమాణం, రికార్డ్ తేదీ, చెల్లింపు తేదీలను పేర్కొంటారు.
కంపెనీ స్టేక్ హోల్డర్స్ జాబితాలో మీ పేరును నమోదు చేసే రోజును రికార్డ్ డేట్ అంటారు. కంపెనీ రికార్డ్ బుక్‌లో రిజిస్టర్ కానీ స్టాక్‌హోల్డర్స్ డివిడెండ్‌ను పొందలేరు.
కంపెనీ రికార్డ్ డేట్ సెట్ చేసిన తర్వాత స్టాక్ ఎక్సేంజ్ డేట్‌ను సెట్ చేస్తుంది. సాధారణంగా ఎక్స్ డివిడెండ్ తేదీని రికార్డ్ తేదీ ప్రకటించే రెండు రోజుల ముందు ప్రకటిస్తారు. డివిడెండ్స్‌ను పొందాలంటే.. ఎక్స్ డివిడెండ్ తేదీ కంటే ముందు స్టాక్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీకు విడిడెండ్‌ను పొందలేరు.
ఈ పేమెంట్ డేట్‌ను కంపెనీ సెట్ చేస్తుంది. ఈ రోజున డివిడెండ్ డిపాజిట్లను స్టాక్ హోల్డర్స్‌కి చెల్లిస్తారు. ఎక్స్ డివిడెండ్ తేదీకి ముందు స్టాక్స్ కొనుగోలు చేసిన స్టాక్ హోల్డర్స్‌కి మాత్రమే డివిడెండ్‌లు పొందగలరు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..