Country Delight: ఫార్మ్-టు-హోమ్ డెలివరీ.. మరింత వేగంగా దూసుకుపోతున్న కంట్రీ డిలైట్..

తాజా ఆహారం, ప్రధానమైన ఆహార పదార్థాల మార్కెట్‌ 2025 నాటికి 50 బిలియన్‌ డాలర్లను అధిగమిస్తుందని ప్లాన్ చేస్తోంది కంట్రీ డిలైట్‌. దాదాపు 60 శాతంకు పైగా ఫ్రెష్‌ ఫుడ్‌ మార్కెట్‌ అసంఘటిత రంగంలో పరిమిత కోల్డ్ స్టోరేజీ గిడ్డంగుల..

Country Delight: ఫార్మ్-టు-హోమ్ డెలివరీ.. మరింత వేగంగా దూసుకుపోతున్న కంట్రీ డిలైట్..
Country Delight
Follow us
Sanjay Kasula

| Edited By: Anil kumar poka

Updated on: Sep 16, 2022 | 3:20 PM

పాలు పితికిన కొద్ది గంటల్లోనే ఆవు, గేదె పాలను మీ ఇంటికి తీసుకువస్తుంది కంట్రీ డిలైట్ ఫామ్-ఫ్రెష్. డెయిరీ, పండ్లు, కూరగాయలు కంట్రీ డిలైట్ ద్వారా కస్టమర్ల ఇంటి వద్దకే డెలివరీ చేయబడతాయి. నేరుగా రైతుల నుంచి వినియోగదారుల వద్దకు తీసుకొస్తుంది. ఈ వ్యాపారం మొత్తం సమీకృత సరఫరా గొలుసు సిస్టం ద్వారా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది కంట్రీ డిలైట్. సాధ్యమైన 24-36 గంటలలోపు తాజా ఫార్మ్-టు-హోమ్ డెలివరీని చేస్తుంది. కంట్రీ డిలైట్ అనేది ఫార్మ్-టు-హోమ్ డెలివరీ కన్స్యూమర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. ఇది సహజమైన ఆహార పదార్థాలను నేరుగా రైతు నుంచి వినియోగదారు ఇంటి వద్దకే డెలివరీ చేస్తుంది. CD తాజా పాలను ఇంటికి అందిస్తుంది. దేశంలోని 11 రాష్ట్రాలలో ఈ చైన్ వ్యవస్థ ఉంది. మొత్తం ఈ చైన్ బిజినెస్‌తో 15 నగరాల్లో నెలకు 8 మిలియన్ లీటర్లను  డెలివరీలను చేస్తుంది. గత 3 సంవత్సరాల్లోనే కంట్రీ డిలైట్ స్కేల్‌లో 10 రెట్లు పెరిగింది. ప్రస్తుతం రూ. 900 కోట్ల వద్దకు చేరుకుంది.

వ్యవస్థాపకులు: కంట్రీ డిలైట్ 2013లో చక్రధర్ గాడే (CEO& కో-ఫౌండర్), నితిన్ కౌశల్ (COO & కో-ఫౌండర్) ద్వారా ప్రారంభించారు. వారు IIM ఇండోర్ 2005-07 నుంచి బ్యాచ్‌మేట్‌లు, 2017 వరకు కంట్రీ డిలైట్‌ను బూట్‌స్ట్రాప్ చేయడానికి ముందు వరుసగా ఇన్వెస్టింగ్ & బ్యాంకింగ్‌లో పని చేసారు. కస్టమర్ ఫస్ట్ థింకింగ్, టెక్-డ్రైవెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఓనర్‌షిప్ ఆధారిత టీమ్ బిల్డింగ్ అనేవి కంట్రీ డిలైట్ నిర్మించబడిన కీలక విలువలు.

ఐడియా అండ్ రీసెర్చ్ : భారతదేశపు తాజా ఆహారం, ప్రధానమైన ఆహార పదార్థాల మార్కెట్‌ 2025 నాటికి 50 బిలియన్‌ డాలర్లను అధిగమిస్తుందని అంచనా. నేడు, దాదాపు 60%కు పైగా ఫ్రెష్‌ ఫుడ్‌ మార్కెట్‌ అసంఘటిత రంగంలో పరిమిత శీతల గిడ్డంగుల సదుపాయాలతో, సరైన రవాణా సదుపాయాలు మరియు తగినంత విజిబిలిటీ, సరఫరా చైన్‌ లేకుండా లభిస్తున్నాయి. కంట్రీ డిలైట్‌ సాంకేతికాధారిత సరఫరా చైన్‌ ద్వారా ఈ సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది.

సాంకేతికాధారిత డైరెక్ట్‌ టు హోమ్‌ కన్స్యూమర్‌ బ్రాండ్‌ కంట్రీ డిలైట్‌. వినియోగదారుల జీవితాలను మెరుగుపరిచే ఉత్పత్తులను అందించేందుకు ఇది సహాయపడుతుంది. కంట్రీ డిలైట్‌ ఉత్పత్తి డీఎన్‌ఏలో అత్యంత కీలకంగా నేచురల్‌ వెల్‌నెస్‌ ఉంటుంది. సరఫరా చేసే ప్రతి ఉత్పత్తీ సహజసిద్ధమైనది.టెక్ ఎనేబుల్డ్ సప్లై చైన్‌తో ఈ సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ముందుకు దూసుకుపోతోంది.

కంట్రీ డిలైట్ దశాబ్దాల నాటి భారతీయ ఆహార అవసరాలకు అందించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. మరో వైపు మన దేశంలో అసంఘటిత రంగం ఉంది. భారత దేశంలో నాణ్యతకు పేరుంది. నాణ్యతను పెంచేందుకు కంట్రీ డిలైట్‌ సాంకేతికతతో  వినియోగదారుల వద్దకు తీసుకొచ్చింది.కేంద్రీకృత విధానాన్ని కూడా పరిచయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల నుంచి నేరుగా సేకరించడం.. సహజమైన.. ప్రాసెస్ చేయబడిన ఆహార-వస్తువులను పంపిణీ చేయడం. ప్రతిరోజూ వినియోగదారుల ఇంటి వద్దకే పంపిణీ చేయడం ఈ సంస్థ ప్రత్యేకత.

వ్యాపార నమూనా: కంట్రీ డిలైట్ భారతదేశంలోని ప్రముఖ D2C (Direct-to-consumer, or Direct2Consumer) తాజా ఆహార నిత్యావసరాల బ్రాండ్‌గా పాడి, పండ్లు, కూరగాయలను వినియోగదారుల ఇంటి వద్దకే అందజేస్తుంది. ఈ కంపెనీ వ్యాపార నమూనా 24-36 గంటల్లో తాజా డెలివరీలను అందించడం. ఇది పూర్తిగా సమీకృత జస్ట్-ఇన్-టైమ్ సప్లై చైన్ మోడల్ ద్వారా వ్యవస్థను చాలా సింపుల్‌గా మార్చేసింది.

ప్రభావం : కంట్రీ డిలైట్ దాని వ్యాపారంలో 3 రెట్లు ప్రభావం చూపుతుంది

కస్టమర్: కస్టమర్ స్థాయిలో, కంట్రీ డిలైట్ కుటుంబాలకు సహజమైన అధిక నాణ్యత ఉత్పత్తులను అందిస్తుంది, ఇది అందించే ఆహార అవసరాల నాణ్యత ద్వారా CD తన కస్టమర్ల జీవితాలను మెరుగుపరుస్తుందని నిర్ధారిస్తుంది.

రైతు: మధ్యవర్తులను తొలిగించి నేరుగా రైతు వద్ద నుంచి వినియోగదారులకు అనుసంధానించే వ్యాపారాన్ని నిర్మించడమే CD  ప్రధానాంశం. దేశంలోని 11 రాష్ట్రాలలోని రైతుల నుంచి నేరుగా దేశం ఆనందాన్ని పొందుతుంది. మేము పని చేస్తున్న రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం ద్వారా అక్కడి రైతులకు ఆదాయ వృద్ధి, ఉత్పాదకత పెరుగుదల, స్థిరత్వంలో సహాయపడుతుంది. CD రైతులు దేశం ఆనందంతో పని చేస్తూ 50-60% అధిక ఆదాయాన్ని పొందడం కనిపించింది.

మార్నింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్: CD దేశవ్యాప్తంగా 8000 మార్నింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో సన్నిహితంగా పనిచేస్తుంది. ప్రతి ఉదయం 4-7 AM మధ్య డెలివరీ చేస్తోంది. CDతో పని చేయడం వల్ల ఈ వ్యవస్థాపకులు తమ నెలవారీ ఆదాయాన్ని 35-40% పెంచుకుంటారు. ప్రారంభం నుంచి కూడా సరఫరా పరంగా కంట్రీడిలైట్‌, అతి తక్కువ వాటాదారులతో కలిసి పనిచేయాలనే సిద్ధాంతంగా పెట్టుకుంది. ఇక్కడ మీరు అత్యధిక పరిమాణంలో క్వాంటిటీలను పొందడంతో పాటుగా అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులనూ పొందవచ్చు. ఇది రెండు లేదా మూడు ఫార్మాట్‌లలో వస్తుందని కంట్రీడిలైట్‌ కో-ఫౌండర్‌ చక్రధర్‌ గాదె తెలిపారు.

కంట్రీడిలైట్‌ వీటికోసం స్థానిక రైతులతో భాగస్వామ్యం చేసుకుంది. అలాగే తెలంగాణాలోని పాల ఉత్పత్తిదారులతోనూ భాగస్వామ్యం చేసుకుంది. కంట్రీడిలైట్‌ ప్రస్తుతం తెలంగాణా మార్కెట్‌పై దృష్టిసారించింది. హైదరాబాద్‌, వరంగల్‌ మరియు రాష్ట్రంలోని  ఇతర ప్రధాన నగరాలలో తమ వ్యాపారం బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా చేసుకుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!