The Jehadi General: మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల (Mumbai Bomb Blasts) ఘటన ఇప్పటికీ ఉలిక్కిపడేలా చేస్తుంటుంది. భారత్‌పై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇదే. ఈ ఘటన 1993 మార్చి 12న జరిగింది. ఈ వరుస బాంబు పేలుళ్లలో 257 మందికిపైగా సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే. అసలు 1993 ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన సూత్రధారి ఎవరు? అనే సారాంశంతో వరల్డ్ ఎక్స్‌క్లూజివ్‌లో భాగంగా న్యూస్9 ప్లస్ ముంబై 1993 దాడుల సూత్రధారిపై, వెబ్ సిరీస్ ప్రసారం చేస్తోంది. ది జిహాదీ జనరల్(The Jehadi General) పేరుతో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ సిరీస్ కోసం న్యూస్9 ప్లస్ ప్రముఖ డొమైన్ నిపుణులతో మాట్లాడి 1993 పేలుళ్ల వెనుక కుట్రను మరింత లోతుగా అధ్యయనం చేసింది. వీరిలో మాజీ రా చీఫ్ విక్రమ్ సూద్, మాజీ యూఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారి & ఐఎస్ఐ పుస్తక రచయిత ప్రొఫెసర్ ఓవెన్ ఎల్ సిర్ర్స్, మాజీ ముంబై పోలీస్ కమీషనర్ ఎంఎన్ సింగ్, పాకిస్తాన్‌లోని భారత మాజీ హైకమిషనర్ జి పార్థసారథి, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లోని సెంటర్ ఫర్ సెక్యూరిటీ స్టడీస్‌లో సీనియర్ పరిశోధకుడు డాక్టర్ ప్రేమ్ మహదేవన్ లాంటి వారు ఉన్నారు.
ముప్పై సంవత్సరాల క్రితం మార్చి 12, 1993న డజను బాంబు పేలుళ్లు బొంబాయి(ఇప్పటి ముంబై) నగరాన్ని కకావికలం చేశాయి. ఈ పేలుళ్లలో 257 మంది ముంబైవాసులు మరణించారు. 1,400 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులను దావూద్ ఇబ్రహీం, అతని బ్యాచ్ నిర్వహించారు.
పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పేరు ప్రతి ఛార్జ్ షీట్‌లోకి ఎక్కించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం దాడులలో ISI ఘోరమైన నేరాన్ని సక్రమంగా విచారించలేదు. బాధ్యలైన అధికారులపై చర్యలు తీసుకోలేదు. అలాగే దాడులపై శ్వేతపత్రం కూడా విడుదల చేయలేదు. ముంబైపై ఈ సైనిక-శైలి దాడులు ‘నాన్-స్టేట్ యాక్టర్స్’ అని పిలిచే వారి చేత అమలు చేయించారు.
“1993 ముంబై బాంబు దాడులకు దావూద్ ఇబ్రహీం ముఠా ఆదేశించింది. లెఫ్టినెంట్ జనరల్ జావేద్ నసీర్ అనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు” అని యూఎస్ఎలోని మోంటానా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న ఓవెన్ ఎల్. సిర్ర్స్ తెలిపారు. సర్ర్స్, మాజీ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారిగా పనిచేశారు. అలాగే 2017లో పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ టాకింగ్ పాయింట్స్: కోవర్ట్ యాక్షన్ అండ్ ఇంటర్నల్ ఆపరేషన్స్ అనే పుస్తకాన్ని కూడా రచించారు. “ఈ ఆపరేషన్ ఆ సమయంలో ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు తెలిసే జరిగిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే షరీఫ్ అతనిని ISI డైరెక్టర్ జనరల్‌గా ఎంపిక చేశారు” అంటూ చెప్పుకొచ్చాడు.
రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ హెడ్ విక్రమ్ సూద్ మాట్లాడుతూ.. 1993 బాంబే పేలుళ్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయని చెప్పారు. “1993 నాటి ముంబై వరుస పేలుళ్లు భారతదేశానికి భారీ నష్టం కలిగించింది. ఇది దేశానికి మొదటి అనుభవం. మేం ఇంతకు ముందు ఇలాంటివి చూడలేదు. ఇందులో స్పష్టంగా పాకిస్తాన్ వేలిముద్రలు ఉన్నాయి” అంటూ ఆయన తెలిపారు.
“వారు పాకిస్తాన్‌లో శిక్షణ పొందారని మేం అరెస్టు చేసిన వ్యక్తుల నుంచి తెలుసుకున్నాం, ముంబై నుంచి దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌లో ఇస్లామాబాద్ చేరుకున్నారు. వీరికి పాకిస్థాన్ ఆర్మీకి చెందిన వారు శిక్షణ ఇచ్చారు. వారు ఆయుధాలను కూడా సరఫరా చేశారు. వారే శిక్షణతోపాటు ఆశ్రయం కల్పించారు” అని ముంబై మాజీ పోలీస్ కమిషనర్ ఎంఎన్ సింగ్ పేర్కొన్నారు.
కాగా, ఈ వరుస పేలుళ్ల మోస్ట్ వాంటెడ్ నిందితుడు, దావూద్ గ్యాంగ్ సభ్యుడు, ఛోటా షకీల్‌కు అత్యంత సన్నిహితుడు సలీం ఘాజీ (Salim Ghazi) జనవరి 14న పాకిస్తాన్‌లోని కరాచీలో మరణించాడని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి. సలీం ఘాజీ అధిక రక్తపోటు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నాడంట. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శనివారం(జనవరి 14న) గుండెపోటుతో మృతి చెందాడు. 1993లో ముంబైలో దాడి తర్వాత దావూద్ ఇబ్రహీం ఇతర సహచరులతో కలిసి పారిపోయాడు. ఈ ముంబై పేలుళ్లలో ఘాజీ కీలక నేరస్థుడు. ఈ ఘటన అనంతరం తన ఆచూకీ లభించకుండా.. నిరంతరం తన ఉనికి మార్చుకుంటూ వచ్చాడు. దుబాయ్‌లో, ఆపై పాకిస్థాన్‌లో ఛోటా షకీల్ అక్రమ కార్యకలాపాలకు సైతం ఘాజీ సహకరించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
The Jehadi General వెబ్ సిరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..