IIHM: హాస్పిటాలిటీ రంగంలో దూసుకుపోతున్న ఇండియన్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్

ఇండియన్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (IIHM), హైదరాబాద్.. ప్రపంచ హాస్పిటాలిటీ రంగానికి IIHM HYDERABAD ముందంజలో కొనసాగుతోంది. ఈ రోజుల్లో హాస్పిటాలిటీ రంగం వేగంగా మారుతోంది. ఈ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా, భవిష్యత్‌కు సిద్ధంగా ఉండే హోటల్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌ను తయారు చేస్తోంది IIHM...

IIHM: హాస్పిటాలిటీ రంగంలో దూసుకుపోతున్న ఇండియన్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్

Edited By:

Updated on: Jul 11, 2025 | 8:52 PM

ఇండియన్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (IIHM), హైదరాబాద్.. ప్రపంచ హాస్పిటాలిటీ రంగానికి IIHM HYDERABAD ముందంజలో కొనసాగుతోంది. ఈ రోజుల్లో హాస్పిటాలిటీ రంగం వేగంగా మారుతోంది. ఈ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా, భవిష్యత్‌కు సిద్ధంగా ఉండే హోటల్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌ను తయారు చేస్తోంది IIHM… IIHM వ్యవస్థాపకులు మరియు చీఫ్ మెంటార్ డా. సుబోర్నో బోస్ గారు చెబుతున్నట్టు: “భవిష్యత్ హాస్పిటాలిటీ కేవలం AI వాడడంపై కాకుండా, AI ఎలా ఆలోచిస్తుందో అర్థం చేసుకోవడంపైనే ఆధారపడుతుంది.”

ఈ భవిష్యత్ దృష్టిని కలిగి ఉండటమే IIHM ప్రత్యేకత.

భవిష్యత్ పనులకు సిద్ధంగా – ప్రపంచ స్థాయి విద్య

IIHM అందించే విద్య ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. కేవలం హోటల్ నిర్వహణనే కాకుండా, మేనేజ్‌మెంట్ ప్రిన్సిపల్స్, HR, డిజిటల్ మార్కెటింగ్, హాస్పిటాలిటీ టెక్నాలజీ వంటి విభాగాల్లో కూడా విద్యార్థులను ట్రెయిన్ చేస్తోంది. తద్వారా, వారు కేవలం ఉద్యోగాలకు కాదు, నాయకత్వానికి కూడా సిద్ధమవుతున్నారు.

IIHM మొదటి హాస్పిటాలిటీ ఇన్స్టిట్యూషన్‌గా AIను విద్యా విధానంలో, ట్రైనింగ్‌లో ప్రవేశపెట్టిన గౌరవం పొందింది.

ఎక్కడైనా విద్య – డిజిటల్ లెర్నింగ్ ద్వారా విద్య..

IIHM విద్య భారతదేశంతో పాటు ప్రపంచంలో ఎన్నో దేశాలకు విస్తరించింది. ఫ్రాన్స్, మారిషస్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో గల ఇంటర్నేషనల్ టై-అప్స్ ద్వారా, BSc (Hons) in International Hospitality Management డిజిటల్ లెర్నింగ్ ద్వారా ప్రపంచ నిపుణులను తరగతుల్లోకి తీసుకురావడమే లక్ష్యం.

IIHM ఎందుకు? – విశిష్ట కారణాలు

  1. ప్రపంచంలోని అత్యుత్తమ హోటల్ స్కూళ్ళలో ఒకటి – 60 దేశాల నుండి గుర్తింపు.
  2. ఆసియా ఖండంలో అతిపెద్ద హోటల్ స్కూల్ నెట్‌వర్క్ – దేశ వ్యాప్తంగా క్యాంపసులు.
  3. యంగ్ చెఫ్ ఒలింపియాడ్ – ప్రపంచంలోని అతిపెద్ద కుకింగ్ కాంపిటీషన్, 50+ దేశాల విద్యార్థులతో.
  4. 60+ ఇంటర్నేషనల్ కులీనరీ సంస్థలతో MoUs – టాప్ చెఫ్‌లతో అనుబంధం.
  5. యుఎస్ఎ నుండి చైనా వరకు ఇంటర్నేషనల్ ప్లేస్‌మెంట్ & ఇంటర్న్‌షిప్‌లు.
  6. 10,000+ ఆలుమ్ని – ప్రపంచంలోని ప్రముఖ హోటల్ బ్రాండ్‌లలో పనిచేస్తున్నారు.
  7. ఫోర్బ్స్, ఎకనామిక్ టైమ్స్ వంటి టాప్ మీడియా సంస్థల ర్యాంకింగ్‌లు.
  8. అంతర్జాతీయ హాస్పిటాలిటీ డే (ఏప్రిల్ 24) సృష్టికర్త – హాస్పిటాలిటీ రంగానికి ప్రత్యేక గౌరవం.
  9. ఇండస్ట్రీలో పేరుగాంచిన ఫాకల్టీ – ప్రసిద్ధ చెఫ్‌లు, లీడర్లు.
  10. దేశవ్యాప్తంగా స్కూల్ లెవెల్ హాస్పిటాలిటీ కాంపిటీషన్లు – భవిష్యత్ హీరోలకు ప్రోత్సాహం.
  11. ప్రపంచవ్యాప్తంగా 200+ హాస్పిటాలిటీ ఐకాన్లు IIHM యొక్క Distinguished Fellowsగా గుర్తింపు పొందారు.

కులీనరీ నైపుణ్యం & AI నూతనతకు మార్గదర్శకుడు IIHM

ప్రతి సంవత్సరం జరిగే Young Chef Olympiad (YCO) ద్వారా IIHM యొక్క అంతర్జాతీయ స్థాయి టాలెంట్ చాటుతుంది. పద్మశ్రీ చెఫ్ సంజీవ్ కపూర్ గారు చెప్పినట్టు: “మేము చదువుతున్నప్పుడు ఇలాంటివి ఉండేవని కూడా తెలియదు. ఇప్పుడు విద్యార్థులకు అలాంటి అవకాశం ఉందంటే ఎంతో ఆనందంగా ఉంది.”

YCO ద్వారా భారతదేశం ప్రపంచ కులీనరీ రంగంలో ఒక ముఖ్య స్థానం సంపాదించింది.

AI – దృష్టి నుండి వాస్తవానికి

IIHM AIని ఉపయోగించి గ్లోబల్ హాస్పిటాలిటీ రంగంలో మార్గదర్శకంగా మారింది.

50 దేశాలతో కలిసి Global AI Knowledge Sharing Declaration

IIHM GPT, NamAIste – HospitalityGPT అనే ప్రపంచంలోని తొలి హాస్పిటాలిటీ Generative AI టూల్‌ను ప్రారంభించడం

ఇది అంతర్జాతీయ హాస్పిటాలిటీ డే 2025 సందర్భంగా ప్రారంభమైంది.

మార్గనిర్దేశకుడు – డా. సుబోర్నో బోస్..

“భారత హాస్పిటాలిటీ రంగానికి అవిభాజ్య నేత”గా పేరుగాంచిన డా. బోస్ గారు, ఈ రంగాన్ని మార్చడానికి ఎన్నో పథకాలు ప్రారంభించారు. “ఇప్పటి విద్యార్థులు మల్టీ టాస్కింగ్‌లో ఎక్స్‌పర్ట్స్ కావాలి – వంట చేసే చెఫ్ కుడా సేల్స్ కాల్ చేయగలగాలి, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ బ్యాక్ ఆఫీస్ బాధ్యతలు తీసుకోవాలి” అని డా. సుబోర్నో బోస్ అభిప్రాయపడుతున్నారు.

AI ఇంటిగ్రేషన్, స్టార్ట్‌అప్ ఫండింగ్ వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు డా. బోస్ నేతృత్వంలో కొనసాగుతున్నాయి.

అవార్డులు & గుర్తింపు

ఎకనామిక్ టైమ్స్ నుండి 8 ఏళ్లుగా “Best Hospitality Education Brand” అవార్డు

Forbes, Zee, PwC, ASSOCHAM వంటి ప్రముఖ సంస్థల నుండి ప్రశంసలు

IIHM Hyderabad కేవలం ఒక విద్యాసంస్థ కాదు – ఇది ఒక ప్రపంచ స్థాయి హాస్పిటాలిటీ కెరీర్‌కు పునాది.

నాయకత్వ లక్షణాలు, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ, కల్చరల్ ఎక్స్‌పోజర్, గ్లోబల్ ఇంటర్న్‌షిప్స్ – ఇవన్నీ కలిపి IIHMను ప్రత్యేకమైనదిగా మార్చుతున్నాయి.

ఇది భవిష్యత్‌ను నిర్మించడానికి, మరింత ముందుగా ఆలోచించడానికి విద్యార్థులను ప్రేరేపిస్తుంది.