Dehydration: చిన్నారుల్లో డీహైడ్రేషన్‌కు కారణం ఏంటి.? ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి.

శరీరం అధికంగా నీటిని కోల్పోవడం లేదా నీటిని తీసుకోవడం తగ్గినా ఇలా రెండు సందర్భాల్లోనూ ఇలాంటి పరిస్థితి వస్తుంది. శరీరం కోల్పోయే నీటిలో వివిధ సాంధ్రతలతో ఎలక్ట్రోలైట్‌లను సైతం కలిగి ఉంటాయి. కాబట్టి శరీరం కోల్పోయే ద్రవాల్లో ఎంతో కొంత ఎలక్ట్రోలైట్‌ నష్టం కూడా ఉంటుంది. శరీరంలోని వివిధ ప్రక్రియల నిర్వహణలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి శరీరంలో కీలక పాత్ర పోషించే వీటి నష్టం వల్ల శరీరానికి జరిగే నష్టం ఎక్కువగానే ఉంటుంది...

Dehydration: చిన్నారుల్లో డీహైడ్రేషన్‌కు కారణం ఏంటి.? ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి.
Dehydration
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 09, 2023 | 12:09 PM

శరీరం అసాధారణ స్థాయిలో నీటితో పాటు ఇతర ద్రవాలు కోల్పోవడాన్ని డీ హైడ్రేషన్‌ అంటారనే విషయం తెలిసిందే. శరీరానికి అవసరమైన నీటి శాతం తగ్గితే వెంటనే ఈ పరిస్థితి వస్తుంది. శరీరం అధికంగా నీటిని కోల్పోవడం లేదా నీటిని తీసుకోవడం తగ్గినా ఇలా రెండు సందర్భాల్లోనూ ఇలాంటి పరిస్థితి వస్తుంది. శరీరం కోల్పోయే నీటిలో వివిధ సాంధ్రతలతో ఎలక్ట్రోలైట్‌లను సైతం కలిగి ఉంటాయి. కాబట్టి శరీరం కోల్పోయే ద్రవాల్లో ఎంతో కొంత ఎలక్ట్రోలైట్‌ నష్టం కూడా ఉంటుంది. శరీరంలోని వివిధ ప్రక్రియల నిర్వహణలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి శరీరంలో కీలక పాత్ర పోషించే వీటి నష్టం వల్ల శరీరానికి జరిగే నష్టం ఎక్కువగానే ఉంటుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌, ద్రవ సమతుల్యతను కోల్పోవడం వల్ల నరాల పనితీరుతో పాటు కండరాల పనితీరులోనూ ఇబ్బందులు ఏర్పడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పిల్లల్లో డీ హైడ్రేషన్‌కు కారణం ఏంటి.?

చిన్నారులు అంటేనే ఇంటి పట్టున ఉండకుండా నిత్యం ఏదో ఒక ఆటలో మునిగితేలుతుంటారనే విషయం తెలిసిందే. పిల్లలు శారీరకంగా ఎప్పుడు చురుకుగా ఉంటారు. అయితే చిన్న పిల్లలు ఏదైనా అనారోగ్యానికి గురైన సమయంలో వారి శారీరక కార్యకలాపాలు కాస్త తగ్గినట్లు గమనిస్తాము. మాస్‌ ఇండెక్స్‌ కారణంగా పిల్లలు శారీరకంగా డీహైడ్రేషన్‌కు ఎక్కువగా గురవుతుంటారు. అధిక శ్వాసకోశ రేట్లు, అధిక నీరు, మూత్రం ద్వారా ఎలక్ట్రోలైట్ నష్టాలు ఎక్కువగా ఉండడం, అధిక జీవ క్రియ రేటు, జ్వరం, ఇన్ఫెక్షన్ల కారణంగా చిన్నారుల్లో లిక్విడ్స్‌, ఎలక్ట్రోలైట్స్‌తో పాటు ఎనర్జీనీ కోల్పోతారు. ఇది చిన్నారుల్లో డీహైడ్రేషన్‌కు ఎక్కువగా కారణంగా మారుతుంది. శరీరంలో ప్రతి డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరుగుదలతో నీటి శాతం కోల్పోవడం పెరుగుతుంది. అలాగే శక్తి ఖర్చు 11 శాతం పెరుగుతుంది. అంతేకాకుండా చిన్న పిల్లలు తరచుగా తమంతటతాము నీరు తాగడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. అలాగే అనారోగ్యానికి గురైనప్పుడు కూడా సరిగా ఆహారాన్ని తీసుకోరు. చిన్నారుల్లో లిక్విక్‌ ఎలక్ట్రోలైట్స్‌తో పాటు, ఎనర్జీ కోల్పోవడానికి ప్రధాన కారణాలు చెప్పొచ్చు.

పిల్లల్లో డీహైడ్రేషన్‌ను ఎలా అంచనా వేయాలి.?

చిన్నారుల్లో తక్కువ స్థాయిలో డీహైడ్రేషన్‌ను అంచనా వేయడం తల్లిదండ్రులకు కూడా కష్టమైన విషయమేనని చెప్పాలి. భౌతికంగా కనిపించే బరువు తగ్గడం, మూత్రం ముదురు రంగులోకి మారండం, నాలుక పొడిబారడం, మూత్ర విసర్జన క్రమంగా రాకపోవడం వంటి లక్షణాల ఆధారంగా చిన్నారులు డీహైడ్రేషన్‌ బారిన పడినట్లు తెలుసుకోవచ్చు. పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక చర్మం పరిస్థితి ఆధారంగా డీహైడ్రేషన్‌ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. పొత్తికడుపుపై చిన్నగా గిల్లాలి. ఇలా చేసిన కేవలం ఒకటి, రెండు సెకండ్స్‌లో మళ్లీ చర్మం యథా స్థితికి వస్తే ఎలాంటి సమస్యలేదని భావించాలి. అదే డ్రై స్కిన్‌ అయితే ఎక్కువ సమయం పడుతుందని డాక్టర్‌ సురేష్‌ కుమారు చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

చిన్నారుల్లో డీ హైడ్రేషన్‌ సమస్య కనిపిచంగానే సాధారణంగా రకరకాల ద్రవాలను ఇస్తుంటారు. అయితే ఈ విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా రీహైడ్రేషన్‌ పండ్ల రసాల్లో ఎక్కువగా చక్కెర, తక్కువ ఎలక్ట్రోలైట్‌లు ఉంటాయి. పేరెంట్స్‌ తమ పిల్లలకు లిక్విడ్స్‌ ఇస్తున్నప్పుడు అందులో ఎనర్జీ స్థాయిలను కూడా మరిచిపోకూడదు. అనారోగ్యం బారిన పడిన చిన్నారులు నోటికి రుచిగా లేని ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఆసక్తి చూపించరు.

చిన్నారుల్లో డీహైడ్రేషన్ సమస్యకు అతిసార వ్యాధి ప్రధానమైంది. ఇలాంటి సమయాల్లో పిల్లలు నీటితో పాటు ఎలక్ట్రోలైట్స్‌ కోల్పోతారు. అలాంటి సందర్భాల్లో ఓఆర్‌ఎస్‌లు అందించాలని నిపుణులు చెబుతున్నారు. ఓఆర్‌ఎస్‌ పౌడర్‌లో నీటిని కలిపి ఇవ్వడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక వేళ డీహైడ్రేషన్‌ అనేది.. వైరల్‌ ఫీవర్‌, మలేరియా, డెంగ్యూ వంటి కారణాల వల్ల ఏర్పడితే.. రడీ టూ సర్వ్‌గా ఉండే ఎలక్ట్రోలైట్ ఫ్లూయిడ్స్‌ను అందించాలని సూచిస్తున్నారు. ఇక ఇంట్లో అందుబాటులో ఉండే కొబ్బరి నీరు వంటివి ఎలక్ట్రోలైట్‌ ఎనర్జీ లోటును తీర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ