Freedom app: దూసుకుపోతున్న ఫ్రీడమ్ యాప్.. కేవలం 33 నెలల్లో కోటికి చేరిన డౌన్‌లోడ్స్.
ఆన్‌లైన్‌లో జీవనోపాధి విద్యను అందిస్తూ, ఈ విభాగంలో నం.1 గా గుర్తింపు పొందిన ఫ్రీడమ్ యాప్ కోటి డౌన్‌లోడ్స్ మైలు రాయిని చేరుకుంది. యాప్ సేవలు ప్రారంభమైన 33 నెలల్లోనే ఈ ఘనత సాధించినట్లు వ్యవస్థాపక CEO సుధీర్ గారు శుక్రవారం విడుదల చేసిన మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘతన సాధించడానికి కృషి చేసిన...
ఆన్‌లైన్‌లో జీవనోపాధి విద్యను అందిస్తూ, ఈ విభాగంలో నం.1 గా గుర్తింపు పొందిన ఫ్రీడమ్ యాప్ కోటి డౌన్‌లోడ్స్ మైలు రాయిని చేరుకుంది. యాప్ సేవలు ప్రారంభమైన 33 నెలల్లోనే ఈ ఘనత సాధించినట్లు వ్యవస్థాపక CEO సుధీర్ గారు శుక్రవారం విడుదల చేసిన మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘతన సాధించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ఈ సందర్భంగా కృతజ్జతలు తెలిపారు. ఈ నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలతో పాటు భవిష్యత్ కార్యాచరణను కూడా సుధీర్ మీడియాతో పంచుకున్నారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే… ‘భారతదేశంలోని రైతులు మరియు చిన్న చిన్న వ్యాపారులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి సాధికారతనిచ్చే విప్లవాత్మక వేదిక ffreedom App. ఈ యాప్ Google Play Storeలో కోటి డౌన్‌లోడ్‌లను చేరుకోవడం ద్వారా ప్రధాన మైలురాయిని చేరుకుంది. ఈ విజయం భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరియు అభివృద్ధికి కీలకమైన వ్యక్తులకు జీవనోపాధి విద్యను అందించడంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న ffreedom App యొక్క స్థానాన్ని పటిష్టం చేయడానికి ఎంతో దోహదం చేస్తుంది. కాగా, ఫ్రీడం యాప్ లోని కనెక్ట్ అన్న ఫీచర్ తన వినియోగదారుల్లో సారూప్య ఆసక్తి (ఒకేరకమైన ఆసక్తి) ఉన్న ఇతరులతో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని అందిస్తోంది. దీని వల్ల వారు తయారు చేసిన వస్తువులను ఈ ఫ్లాట్‌ఫామ్ పై ప్రదర్శించి కావాల్సిన వారికి విక్రయించుకోవచ్చు. అయితే వస్తువు ధర ఎంత అన్నది దానిని తయారు చేసిన వ్యక్తి ఇష్టం పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం సంస్థ 18 యూట్యూబ్ ఛానెల్‌లను నిర్వహిస్తోంది. ఈ ఛానల్స్ 2.5 మిలియన్ల కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్స్‌ను కలిగి ఉన్నాయి. ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ వల్ల యువతను ఈ యాప్ ఆకర్షిస్తోంది. అంతేకాకుండా సమగ్ర పాఠ్యాంశాలతో, దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో ffreedom యాప్ గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది.” అని అన్నారు.
అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ…”33 నెలల క్రితం అంటే ffreedom App 2020 మార్చి 20న ప్రారంభించినప్పటి నుండి గణనీయమైన అభివృద్ధిని సాధించింది. మొదట ఫోన్ కాల్స్ ద్వారా ఆర్థిక విద్యను అందించే ప్లాట్‌ఫారమ్‌గా ఉండిన ఈ యాప్ నూతన ఫీచర్లతో అతి కొద్ది కాలంలోనే కోటిమందికి చేరువయ్యింది. కాగా, ఇందుకు ప్రధాన కారణం యాప్‌లోని కోర్సులు ఇంగ్లీషుతో పాటు హింది, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం వంటి ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉండటమే. ఈ యాప్ ప్రస్తుతం వ్యవసాయం, వ్యాపారం, వ్యక్తిగత ఫైనాన్స్ అనే మూడు విభాగాల్లో 960 కోర్సులను వినియోగదారులకు అందిస్తోంది. అంతేకాకుండా ffreedom App ప్రతి వారం, ప్రతి భాషలో కొత్త కోర్సులను విడుదల చేస్తోంది. యాప్ వినియోగదారులకు, ప్రతి నిత్యం 800 మంది మెంటార్స్ అందుబాటులో ఉంటున్నారు. వీరు తమ తమ రంగాల్లో, ఇప్పటికే విజయం అందుకున్నవారు. వీరు ffreedom App వినియోగదారుల సందేహాలు తీర్చడమే కాకుండా వ్యాపారంలో మార్గదర్శకులుగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ కోర్సులన్నీ సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న అన్ని కోర్సులకు యాక్సెస్ పొందవచ్చు. ఆర్గానిక్ గ్రోత్, నోటి మాటల ద్వారా పెద్ద యూజర్ బేస్‌ను నిర్మించడంలో ffreedom App విజయవంతమైంది. ఈ విధానం మార్కెటింగ్ కోసం తక్కువ ఖర్చుపెట్టేలా చేసింది. దీంతో ఉత్పత్తి, అభివృద్ధి మరియు విస్తరణపై దృష్టి పెట్టడానికి, కంపెనీకి అవకాశం ఏర్పడింది. కంపెనీ ప్రస్తుతం లాభాలబాటన నడుస్తోంది.” అని సుధీర్ గారు ఆనందం వ్యక్తం చేశారు.
కేవలం ప్రారంభం మాత్రమే… సాధించాల్సింది చాలా ఉంది!
కోటి డౌన్‌లోడ్స్ అన్నవి యాప్ విజయానికి సంబంధించి, ప్రారంభం మాత్రమేనని మున్ముందు సాధించాల్సింది చాలా ఉందని సుధీర్ అభిప్రాయపడ్డారు ఇంకా ఆయన మాట్లాడుతూ “ffreedom యాప్ విజయం భారతదేశంలో విద్య, నైపుణ్యాభివృద్ధిలో అంతరాన్ని పూడ్చడం, మిలియన్ల కొద్దీ సూక్ష్మ మరియు లఘు వ్యాపారవేత్తలను సృష్టించడంపై ఆధారపడి ఉంటుంది. భారతదేశ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పరిమాణం సుమారు 3.5 ట్రిలియన్ డాలర్లు. దీనిని 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది, ఈ యాప్ లక్ష్యం. పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీలతో పాటు, రైతులు, సూక్ష్మ, లఘు చిన్న వ్యాపారుల సహకారం ఉంటేనే, ఈ లక్ష్యాన్ని సాధ్యమైనంత త్వరగా సాధించవచ్చు. అయితే చిన్న, లఘు పారిశ్రామిక, వ్యాపారవేత్తలను సృష్టించడంలో, భారతదేశంలోని ప్రస్తుత విద్యా విధానం కొంత వెనుకబడి ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికే, వివిధ రంగాల్లో యువతను, ఔత్సాహికులను సూక్ష్మ, లఘు, చిన్న వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలుగా మారడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని ffreedom App అందిస్తోంది. తద్వారా భారత దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంలో ffreedom App తనవంతు సహకారాన్ని అందిస్తోంది.” అని సుధీర్ గారు పునరుద్ఘాటించారు.
960 కోర్సులకు అదనంగా 37 గోల్స్…
సంస్థ CEO సుధీర్ ffreedom App అందిస్తున్న మరిన్ని కోర్సుల గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ వివరాలు.. “ఈ యాప్ 960 కోర్సులకు అదనంగా 37 సమగ్రమైన లక్ష్యాలు (గోల్స్) కూడా వినియోగదారులకు అందిస్తోంది. ప్రతి గోల్., ఫౌండేషన్ కోర్స్, వర్క్‌షాప్, మరియు స్పెషలైజేషన్ అనే మూడు దశల కోర్సులను కలిగి ఉంటుంది. దాదాపు 100 నుంచి 150 గంటల నిడివితో రూపొందించిన ఈ డిప్లొమా కోర్సుల ప్రధాన ఉద్దేశం యువతను మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చడమే.” అని తెలిపారు. ఈ సందర్భంగా, సంస్థ భవిష్యత్ కార్యకలాపాలను కూడా సుధీర్ గారు మీడియాకు వివరించారు. “ఈ ఏడాదిలోనే బంగ్లాదేశ్ మరియు ఇతర దక్షిణాసియా దేశాల మార్కెట్లలో యాప్ కార్యకలాపాలను ప్రారంభించడం ద్వారా వచ్చే 18 నెలల్లో 100 మిలియన్ల వినియోగదారులను చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో పాటు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 6 ప్రాంతీయ భాషలతో పాటు, భారతదేశంలోని ఇతర ప్రాంతీయ భాషలలో కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నాం. అదేవిధంగా డాటాసైన్స్, కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – AI) వంటి అధునాతన సాంకేతికతతో, ప్రతి వినియోగదారుడి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించి, ఆర్థిక స్వాతంత్య్రం అందించే దిశగా ffreedom App అడుగులు వేస్తోంది.
ffreedom Appలో కనిపించే కొన్ని ఆసక్తికరమైన, వినూత్న కోర్సులు:
* ఎయిర్ పొటాటో ఫామింగ్ – సంవత్సరానికి ఎకరానికి రూ.7 లక్షలు సంపాదించవచ్చు.
* డ్రాగన్ ఫ్రూట్ ఫామింగ్ – ఎకరాకు ఏడాదికి రూ.6 లక్షలు సంపాదించవచ్చు.
* మోరింగా సాగు – నమ్మశక్యం కాని లాభాలు
* స్పిరులినా ఫార్మింగ్ కోర్సు – ఎకరాకు ఏడాదికి రూ.2 కోట్ల వరకూ సంపాదన
* జీరో వేస్ట్ జ్యూస్ షాప్ వ్యాపారం – తక్కువ పెట్టుబడి మూడు రెట్ల లాభం
* ఇంటి నుంచే కొవ్వొత్తుల వ్యాపారం – సంవత్సరానికి రూ.20 లక్షల ఆదాయం
* కిసాన్ క్రెడిట్ కార్డ్ పై ఒక కోర్సు
* ఫైనాన్సియల్ ఫ్రీడం కోర్స్ – సంపదను సృష్టించడానికి మరియు సురక్షితంగా ఉంచడానికి సమర్థవంతమైన మార్గాలను కనుగొనడం ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం పొందండి!