
దేశ ఆర్ధికాభివృద్ధికి ఆన్‌లైన్ వాణిజ్యం ప్రధాన ఉత్ప్రేరకంగా మారింది. ప్రస్తుతం మారుమూల ప్రాంతాలకు కూడా ఆన్లైన్ వాణిజ్యం చేరుకుంది. డిజిటల్ రిటైల్ వేగవంతమైన విస్తరణ, విస్తృత పరిధి, పోటీ, సురక్షితమైన షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరోవైపు సాంకేతికత, నిధుల కొరత వల్ల గతంలొ వ్యాపారానికి అడ్డంకిగా ఉన్న పలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలు ఈ-కామర్స్ మార్గాల ద్వారా గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాలు రిటైల్ కార్యకలాపాలు, సరఫరా గొలుసు నిర్వహణ, కోల్డ్ చైన్లు, గిడ్డంగులు, సాంకేతిక సేవలు, డిజిటల్ మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్ సహా బహుళ పరిశ్రమలలో గణనీయమైన ఉద్యోగ నియామకాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ-కామర్స్ వేసిన పునాది ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ వంటి వేగవంతమైన డెలివరీ సేవల ఆవిర్భావానికి మార్గం సుగమం చేసింది. ఇవి మెట్రో నగరాల్లోనే కాకుండా టైర్ 2 పట్టణాల్లోనే వృద్ధిని సాధిస్తున్నాయి. ఈ-ప్లాట్ఫామ్లు కస్టమర్ సౌలభ్యాన్ని మకింత పెంచుతున్నాయి. అంతేకాకుండా విభిన్న ఉద్యోగాల సృష్టి ద్వారా చిన్న వ్యాపార వృద్ధికి దోహదం చేస్తుంది. తద్వారా స్థానిక ఆర్థిక అభివృద్ధి ఊపందుకుంది. ఇప్పటికే క్విక్ కామర్స్ దాదాపు 3.25 లక్షల మందికి డెలివరీ, వేర్‌హౌస్ ఉద్యోగులను నియమించుకుంటుంది.
వచ్చే ఏడాది మరో 5 లక్షల నుంచి 5.5 లక్షల ఉద్యోగాలను సృష్టించనున్నట్లు టీమ్లీజ్ నివేదిక వెల్లడించింది. డిజిటల్ కామర్స్ ప్రభావం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా వృద్ధి చెందింది. ఇది లాజిస్టిక్స్ రంగంలో అనేక ఉపాధి అవకాశాలను సృష్టించింది. వీటిలో డెలివరీ సిబ్బంది, వేర్హౌస్ సిబ్బంది కీలకంగా ఉంటున్నారు. వీటిలో చాలా వరకు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబలకు చెందినవారే ఉండటం గమనార్హం. ఉదాహరణకు ఫ్లిప్‌కార్ట్ దేశ వ్యాప్తంగా పెద్ద, చిన్న కేంద్రాలు, మదర్ హబ్లు, కిరాణా కేంద్రాలతో సహా అత్యాధునిక సరఫరా గొలుసు సౌకర్యాలను కలిగి ఉంది. దేశ వ్యాప్తంగా దాదాపు 1.8 మిలియన్లకు పైగా నిరుద్యోగులకు జీవనోపాధిని అందిస్తుంది. ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ ద్వారా స్థానిక చేతివృత్తులవారు, గ్రామీణ మహిళా వ్యవస్థాపకుల వృద్ధికి అవకాశాలను అందిస్తుంది. వీరికి మద్దతు అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
మారుమూల ప్రాంతాలలోని చిరు వ్యాపారులు కూడా దీర్ఘకాలిక సవాళ్లను అధిగమించడానికి ఇ-కామర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీల మద్దతుతో ఈ వ్యవస్థాపకులు రియల్-టైమ్ డాష్‌బోర్డు వంటి ఆచరణాత్మక సాధనాలను పొందుతున్నారు. ఈ దృశ్యమానత వారు వర్కింగ్ క్యాపిటల్ను ఆప్టిమైజ్ చేయడానికి, నియామక నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త యంత్రాలు, సాంకేతికతలో మరింత నమ్మకంగా పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పించింది.
ఇ-కామర్స్ దేశంలోని సుదూర ప్రాంతాలకు కూడా చేరుకుంటుంది. దీని ప్రభావాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి మారుమూల రాష్ట్రాలలో చూడవచ్చు. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో డిజిటల్ పరివర్తన స్పష్టంగా కనిపిస్తుంది. దేశంలోని వ్యాపార అనుకూల రాష్ట్రాలలో ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ముందువరుసలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు తమ హస్తకళలు, వస్త్రాలు, ఆహారం, రసాయనాలు, ఔషధాలను ఇ-కామర్స్ ద్వారా వినియోగదారులకు అందిస్తుంది. అంటే ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్ పామ్ ద్వారా అన్ని రకాల ప్రొడక్ట్స్ సరఫరా చేయగలుగుతున్నట్లు తేలతెల్లమవుతోంది. ప్రస్తుతం దేశంలో 6 కోట్లకు పైగా MSMEలు ఇందులో నమోదు చేసుకున్నాయి. 25 కోట్లకుపైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2024 చివరి నాటికి ప్రభుత్వ ఉద్యోగం పోర్టల్లో 50 లక్షలకు పైగా MSMEలు నమోదు చేసుకున్నాయి.
తన కుమార్తెను పెంచడానికి హైదరాబాద్లో ఉద్యోగాన్ని విడిచిపెట్టిన నీలిమా షా.. ఇంట్లో ఉంటూనే తనంతట తానుగా ఏదైనా చేయాలని అనుకుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రస్తుతం ఆమె ఇంటి నుంచే స్వతంత్ర వ్యాపారం చేస్తుంది. కృత్రిమ ఆభరణాలను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించవచ్చని తన భర్త ఇచ్చిన ఐడియాతో దూసుకుపోతుంది. దేశంలో ఆభరణాల వ్యాపారం పెరుగుతోంది. ఇది ఓ భారీ మార్కెట్ అని తెలుసుకున్న ఆమె 2018లో కేవలం రూ. 8 వేల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించింది. నేడు లక్షల వ్యాపారం చేస్తుంది. ఆమె ఆధునిక, సాంప్రదాయ డిజైన్లను తన నీలుస్ కలెక్షన్ బ్రాండ్ పేరుతో అందిస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చేతివృత్తులవారి నుంచి వారు తయారు చేసిన ఉత్పత్తులను సేకరిస్తుంది. ఫ్లిప్‌కార్డ్‌లో జాతీయ స్థాయిలో తన కలను నెరవేర్చుకోవడానికి సహాయపడిందని ఆమె చెబుతోంది.
ఫ్లిప్‌కార్ట్‌లో వ్యవస్థాపకులను వారి వ్యాపార ప్రయాణంలో మార్గనిర్దేశం చేయడం, డిజిటల్ వాణిజ్యాన్ని ఆన్బోర్డింగ్ చేసే దశ నుంచి ప్రారంభించి ఆపై మొత్తం అమ్మకపు ప్రక్రియ ద్వారా మార్గనిర్దేశం చేయడం ఈ వ్యాపార సంస్థ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్లిప్‌కార్ట్ తన సమర్థ్ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత నేత సహకార సంఘంతో ఒప్పందం కుదుర్చుకుని, రాష్ట్ర చేనేత ఉత్పత్తులను ఈ-కామర్స్ రంగంలోకి తీసుకువస్తుంది. ఫ్లిప్కార్ట్ సమర్థ్ కార్యక్రమం చొరవ చిన్న వ్యాపారులు, రైతులు, ఎమ్ఎస్ఎమ్ఈలు ఈ-కామర్స్ సాధనాలను ఉపయోగించడానికి, మార్కెట్లతో కనెక్ట్ అవ్వడానికి, వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇది కేటలాగింగ్ మద్దతు, శిక్షణా సెషన్లు, ప్రకటనల క్రెడిట్లు అందిస్తుంది. తక్కువ సేవలందిస్తున్న వర్గాలకు ఏకీకరణ, ఈక్విటీని అందిస్తుంది.
తెలంగాణలో కూడా, ఫ్లిప్‌కార్ట్ సమర్థ్ కార్యక్రమం వేలాది మంది అట్టడుగు వ్యవస్థాపకులు, MSMEలకు ఉత్పత్తి జాబితా, కేటలాగ్ నిర్వహణ, కస్టమర్ నిర్వహణపై శిక్షణ ఇస్తుంది. ఇ-కామర్స్ దేశంలో షాపింగ్ చేసే విధానాన్ని మాత్రమే కాకుండా, భారతదేశం పనిచేసే విధానాన్ని, సంపాదిస్తున్న విధానాన్ని, అభివృద్ధి చెందుతున్న విధానాన్ని ఎలా పునర్నిర్మిస్తుందో చూపేందుకు ఇదొక నిదర్శనం.