Holy Tree Puja: చెట్లను పూజించడం వలన కూడా కోరికలు నెరవేరతాయి.. ఏ రోజు ఏ చెట్టును పూజించాలంటే..

|

Jul 01, 2023 | 11:54 AM

కొన్ని రకాల చెట్లను మాత్రమే కాదు.. వాటి పువ్వులు, పండ్లు కూడా పూజనీయంగా భావించి పూజిస్తారు. అయితే కొన్ని రకాల మొక్కలు పూజలను అందుకోవడమే కాదు.. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాలను కూడా అందిస్తాయని విశ్వాసం. ఈ రోజు కోరిన కోర్కెలు తీర్చే చెట్లు, మొక్కల గురించి పూజా విధానం గురించి తెలుసుకుందాం.

Holy Tree Puja: చెట్లను పూజించడం వలన కూడా కోరికలు నెరవేరతాయి.. ఏ రోజు ఏ చెట్టును పూజించాలంటే..
Holy Tree Puja
Follow us on

సనాతన ధర్మంలో ప్రకృతిని దైవంగా భావించి పూజిస్తారు. మొక్కలు, జంతువులను దేవతలుగా భావించి పూజిస్తారు. చెట్లు దైవానికి ప్రతిరూపంగా భావించి హిందువులు పూజిస్తారు.కొన్ని రకాల చెట్లను ఆరాధించడంవలన జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని.. వ్యాధుల బారినుంచి రక్షణ దొరుకుతుందని విశ్వాసం. కొన్ని రకాల చెట్లను మాత్రమే కాదు.. వాటి పువ్వులు, పండ్లు కూడా పూజనీయంగా భావించి పూజిస్తారు. అయితే కొన్ని రకాల మొక్కలు పూజలను అందుకోవడమే కాదు.. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాలను కూడా అందిస్తాయని విశ్వాసం. ఈ రోజు కోరిన కోర్కెలు తీర్చే చెట్లు, మొక్కల గురించి పూజా విధానం గురించి తెలుసుకుందాం.

ఉసిరి చెట్టుకి పూజ 

సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందని విశ్వాసం. ఉసిరి చెట్టును పూజించే సాధకుడికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయని నమ్మకం. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు.

ఇవి కూడా చదవండి

కుటుంబంలో సంతోషం కోసం అరటి చెట్టుకు పూజ 

హిందూ మత విశ్వాసాల ప్రకారం అరటి చెట్టు విష్ణువు స్వరూపం అని.. అరటి చెట్టుపై విష్ణువు కొలువై ఉంటాడని విశ్వాసం. విష్ణువు అనుగ్రహం కోసం గురువారం నారాయణుని పూజించిన తరువాత, అరటి చెట్టును పూజిస్తారు. ఇలా చేయడం ద్వారా విష్ణువు సంతోషించి సాధకుడిని అనుగ్రహిస్తాడని.. కోరిన  కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వాసం

మామిడి చెట్టు పూజకు ప్రాధాన్యత 

పురాణ గ్రంథాల్లో మామిడి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. ఈ చెట్టు ఆకులు, చెక్క, పండ్లు అన్నీ పూజకు ఉపయోగపడతాయి. అంతేకాదు హనుమంతుడికి మామిడిపండ్లు అంటే ఇష్టమని హిందువుల విశ్వాసం. మామిడిని పూజించడం వల్ల బాధలు, కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి.

తులసికి పూజ

తులసికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. తులసి దళం లేని దేవుని పూజ అసంపూర్ణంగా పరిగణిస్తారు.  తులసి మొక్క లక్ష్మీదేవి నివాసం. కనుక తులసి చెట్టును పూజించే ప్రదేశాలలో, ఎల్లప్పుడూ ఆనందం,  శ్రేయస్సు ఉంటుంది. తులసిని విష్ణుప్రియ అని కూడా అంటారు. తులసిని నియమ నిష్టలతో పూజించే వ్యక్తి శ్రీ హరి అనుగ్రహంతో సంపదలతో నిండిఉంటుంది.

జమ్మి చెట్టుకు పూజ 

శమీ వృక్షానికి మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యత కూడా ఉందని హిందువుల నమ్మకం. శమీ మొక్క ఉన్న ఇంట్లో శనీశ్వరుడు శుభదృష్టిని కలిగి ఉంటాడని.. ఆ ఇంట్లోని సభ్యులకు హాని చేయడ అని నమ్మకం. అంతేకాదు శమీ వేర్లను ధరించేవారికి శనికి సంబంధించిన దోషాల నుండి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం.

రావి చెట్టుకి పూజ 

రావి చెట్టు త్రిమూర్తుల నివాసం. విష్ణువు, శివుడు రావి చెట్టు మూలాలు, కాండాలలో నివసిస్తారని మత విశ్వాసం. రావి చెట్టును పూజించడం వల్ల సాధకుడి జీవితానికి సంబంధించిన అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. ఎవరికైనా ఆర్థిక సమస్యలు పరిష్కారం కాకపోతే రావి చెట్టును పూజించడం వల్ల ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాదు ఆనందం, అదృష్టం కూడా లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).