Yadadri Temple : త్వరలోనే యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం..! నిత్యం పనులను సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్..

|

Apr 06, 2021 | 5:02 AM

Yadadri Temple : తెలంగాణకే తలమానికంగా నిర్మితమవుతున్న యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పనులను సీఎం కేసీఆర్

Yadadri Temple : త్వరలోనే యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం..! నిత్యం పనులను సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్..
Follow us on

Yadadri Temple : తెలంగాణకే తలమానికంగా నిర్మితమవుతున్న యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పనులను సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నట్లు తెలిసింది. వచ్చే నెల 14వ తేదీన అక్షయ తృతీయ సందర్భాన్ని పురస్కరించుకుని హోమాలు, యాగాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడంపై వేద పండితులతో సమాలోచనలు జరుపుతున్నట్లు వినికిడి. మంచి ముహూర్త బలం ఉన్న అక్షయ తృతీయ రోజున సుదర్శన హోమంతో మొదలయ్యే ప్రత్యేక పూజలు వరుసగా ఎనిమిది రోజుల పాటు నిర్వహించి తొమ్మిదో రోజున ఉత్సవ మూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపన చేయడానికి సంబంధించి చర్చించినట్లు తెలిసింది.

చిన జీయర్ తీసుకునే నిర్ణయం ఆధారంగా యాదాద్రి ఆలయానికి సంబంధించి సీఎం కేసీఆర్ తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని గర్భగుడి విషయంలో ఎలాంటి మార్పు లేదు. శివ, వైష్ణవ ఆలయాల్లో మూల విరాట్టులకు కూడా ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు. కానీ ఉత్సవమూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం మాత్రం మే 22వ తేదీ ఉండవచ్చని ప్రాథమిక సమాచారం.

పండితుల అభిప్రాయం. 1008 కుండాలతో పాటు అగ్నికుండాలను ఏర్పాటుచేసి సుదర్శన హోమం నిర్వహించాల్సి ఉంటుందని, పాంచరాత్ర ఆగమ విధానం ప్రకారం పూజాదికాలు ఉంటాయని పండితుడొకరు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆలయాన్ని సందర్శించి తుది దశలో ఉన్న పనులను సమీక్షించి కొన్ని సూచనలు కూడా చేశారు. మొత్తానికి త్వరలోనే ఆలయ ప్రారంభం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

AP Govt Declares Holiday : ఏపీలో ఆ రెండు రోజులు సెలవు.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌.. ఎందుకో తెలుసా..?

JC Prabhakar Reddy comments: అవును ఆయన స్పెషల్.. అవును ఆయన మాటలు మరీ స్పెషల్.. అడిగి బుక్కైన సిటిజన్

Earhquake: భారీ భూకంపం.. సిక్కిం-నేపాల్, అస్సాం, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కంపించిన భూమి..

Corona: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?