Yadadri Temple: ఈ నెల 25 న యాదాద్రి ఆలయం మూసివేత.. అన్ని రకాల సేవలు రద్దు.. తిరిగి ఆ రోజునే ఓపెనింగ్..

తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రేపు (మంగళవారం) మూత పడనుంది. ఈ నెల 25 న సూర్య గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయం...

Yadadri Temple: ఈ నెల 25 న యాదాద్రి ఆలయం మూసివేత.. అన్ని రకాల సేవలు రద్దు.. తిరిగి ఆ రోజునే ఓపెనింగ్..
Yadagirigutta

Updated on: Oct 24, 2022 | 8:35 PM

తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రేపు (మంగళవారం) మూత పడనుంది. ఈ నెల 25 న సూర్య గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయం 8:50 గంటల నుంచి 26 ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. 26 న నిర్వహించే శత ఘటాభిషేకం, సహస్రనామార్చనను రద్దు చేశారు. బుధవారం సంప్రోక్షణ నిర్వహించి 10:30 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. ఆ తర్వాత స్వామి వారికి జరిగే నిత్య కైంకర్యాలు యథావిధిగా జరుగుతాయి. కాగా.. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఇదే. 27 ఏళ్ల తర్వాత దీపావళి రోజునే సూర్యగ్రహణం ఏర్పడడం విశేషం. పాక్షికంగా ఏర్పడనున్న ఈ గ్రహణం ఐరోపా దేశాలు, పశ్చిమ సైబీరియా, మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికా ప్రాంతాలతో పాటు మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఏర్పడనుంది.

మరోవైపు.. సూర్యగ్రహణం సందర్భంగా మంగళవారం 12 గంట‌ల పాటు తిరుమల తిరుపతి శ్రీ‌వారి ఆల‌యాన్ని మూసివేయనున్నారు. 25న ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యాన్ని మూసేస్తారు. అన్ని ర‌కాల ప్రత్యేక దర్శనాలు ర‌ద్దు చేశారు. లడ్డూ విక్రయాలు, అన్నప్రసాద వితరణ రద్దు చేశారు. గ్రహణం పూర్తయ్యాక ఆలయ శుద్ధి చేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కాగా గ్రహణం తర్వాత కూడా కేవలం స‌ర్వదర్శనం భ‌క్తుల‌కు మాత్రమే అనుమతి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి