Garuda Puranam: మనిషి చనిపోయిన తర్వాత ఇంట్లో గరుడ పురాణం ఎందుకు చదువుతారో తెలుసా.. ప్రాముఖ్యత వివరాలు..
సనాతన ధర్మంలో గరుడ పురాణాన్ని మాహాపురాణంగా భావిస్తారు. ఈ గరుడ పురాణంలో విష్ణువు, గరుడ పక్షి మధ్య మానవ జీవితం.. మరణం.. మరణం తర్వాత పరిస్థితుల గురించి మాట్లాడుకున్నట్లుగా ఉంటుంది. విష్ణువు వాహనం గరుడ పక్షి. మానవ జీవితార్థం.. మరణం తర్వాత ఆత్మ దారి.. పాప పుణ్య ఫలితాలకు సంబంధించిన వివరాలు మొత్తంగా క్షుణ్ణంగా ఉంటాయి. అలాగే.. అన్ని నియమాలు.. శ్లోకాలు.. ధర్మం.. యజ్ఞం, తపస్సు గురించిన రహస్యాలు ప్రస్తావించారు. మనిషి శరీరాన్ని వదిలి.. ఆత్మ స్వర్గాన్ని చేరేవరకు ఎదురయ్యే సంఘటనల గురించి విష్ణువు.. గరుడ పక్షి వివరించారు. అయితే మనిషి చనిపోయిన తర్వాత గరుడ పురాణం ఇంట్లో చదువుతారో తెలుసుకుందాం.
1. కొంతమంది ఆత్మలు మరణించిన వెంటనే మరో శరీరాన్ని పొందుతాయని.. మరికొన్ని ఆత్మలు.. మూడు రోజుల నుంచి 10, 13 రోజుల సమయం తీసుకుంటాయని గరుడ పురాణంలో చెప్పబడింది. ఆకస్మాత్తుగా మరణించినవారు మళ్లీ పునర్జన్మ పొందడానికి దాదాపు ఒక సంవత్సర కాలం పడుతుందట. మరణించిన వారి ఆత్మ దాదాపు 13 రోజుల పాటు తమ ఆత్మీయుల చుట్టు ఉంటుందని గరుడ పురాణంలో చెప్పబడింది.
2. గరడ పురాణం విన్న తర్వాత వారి ఆత్మీయులకు కార్యక్రమాలలో తప్పులు జరగవు. అలాగే మెక్షాన్ని పొందే చర్యలను చేయడం ద్వారా ఈ విధంగా గరుడ పురాణం.. ప్రజలకు మార్గనిర్ధేశం చేస్తుంది.
3. గరుడ పురాణం పారాయణం చేస్తే… మరణించిన ఆత్మకు శాంతి లభిస్తుందని.. దెయ్యంగా మారరు అంటారు. అలాగే దుఃఖాలను మరచిపోయి.. ఆత్మ సులభంగా దేవుడికి వెళ్తుంది.
4. గరుడ పురాణంలో మొత్తం 19 వేల శ్లోకాలు ఉన్నాయి, వాటిలో 7 వేల శ్లోకాలు జ్ఞానం, మతం, విధానం, రహస్యం, ఆచరణాత్మక జీవితం, స్వీయ, స్వర్గం, నరకం, ఇతర ప్రపంచాలలో పేర్కొనబడ్డాయి. విశ్వ, గ్రహాంతర పరిస్థితులు వివరించబడ్డాయి. ఈ విషయాలు తెలుసుకోవడం సాధారణ ప్రజలకు వారి ప్రవర్తనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ విధంగా గరుడ పురాణం ధర్మ మార్గాన్ని అనుసరించడానికి ప్రజలను ప్రేరేపిస్తుంది.
Read More:
శ్రీశైల దేవస్థానం దర్శన వేళల్లో మార్పులు.. సాయంత్రం 3గంటల వరకు భక్తులకు అనుమతి..
కరోనా నుంచి పోరాడేందుకు యోగాను సురక్షా కవచంగా మార్చుకోండి : M-Yoga app రిలీజ్ చేసిన ప్రధాని
ఈరాశుల వారికి నూతన ఉద్యోగావకాశాలు ఉంటాయి.. ఈరోజు రాశిఫలాలు..