Significance of Diyas: హిందూధర్మంలో దీపానికి అత్యంత ప్రాముఖ్యత అందుకే పుట్టినరోజున దీపం ఆర్పితే పెద్దలు తిడతారు.. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దల ఉవాచ.. దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అంధకారాన్ని పోగొట్టి కాంతులను నింపేది దీపం. ఇక మనిషి జీవితంలో చీకటి వెలుగు సర్వసాధాణం అని అంటారు.. అంటే కష్టసుఖాలు, అజ్ఞానం, విజ్ఞానాలు అనే భావం వాటిని పోగొట్టి తన వెలుగులో జీవితానికి దారి చూపిస్తుంది.. చీకటిని తరిమికొట్టి సుఖం అనే వీలుగునిస్తుంది దీపమని హిందువులు భావిస్తారు.. కనుక ప్రతి రోజూ దేవుడి ముందు దీపాన్ని వెలిగించి చెడు తొలగి మంచి జరగాలని కోరుకుంటారు.
ఇక నూనెతో వెలిగించిన దీపం వెలుగులో ఎరుపు, నీలం, తెలుపు రంగులు కనిపిస్తాయి. ఆ మూడు రంగులు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు , మహేశ్వరులు ప్రతీకలని హిందూ ధర్మం చెబుతుంది. దీపాలు సంపదకు గుర్తు.. చీకటి అంధకారాన్ని పోగొట్టి దారి చూపించడమే కాదు నువ్వుల నూనెతో పెట్టె దీపం ప్రకృతికి ఎంతో మేలు చేస్తుంది. శాస్త్ర ప్రకారం దేవాలయంలో, ఇంట్లో దీపాన్ని రెండు పూటలా వెలిగించాలి. ఆ సమయంలో ఒక స్తోత్రం లేదా సహస్త్రాన్ని పఠించాలి. ఇలా చేస్తే కుటుంబంలో ఉన్న వారికి చాలా మంచిది.
ఇక ప్రతి రోజు ఉదయాన్నే .. మళ్ళీ సాయంత్రం సంధ్యా సమయం అంటే ఆరు గంటలకు దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే భగవంతుని అనుగ్రహం పొందవచ్చు. అందుకే హిందువులు దీపాన్ని భక్తితో ఆరాధిస్తారు. దీపం వెలుగు మనిషిలోని సత్వ, రజ, తమో గుణాలను పోగొడుతుందని నమ్ముతారు. అందుకే దీపం లో మూడు వత్తులు వేసి ఒక వత్తుగా చేసి వెలిగిస్తారు. ఇక దీపాన్ని లక్ష్మి స్వరూపం భావించి నిత్యం కొలుస్తారు.. ఏ ఇంటిలో దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని ఋగ్వేదం చెపుతోంది.
Also Read: