Money Facts: ఈ రాశి, నక్షత్రాల వారు అప్పు ఇస్తే తిరిగి రానట్టే.. ఈ రోజుల్లో మాత్రం అస్సలు ఇవ్వకండి.. కష్టాలు తప్పవు!

మనం తరచుగా వివిధ అవసరాల కోసం అప్పులు చేస్తుంటాం. లేదా అవసరమైన వారికి సాయంగా అప్పులు ఇస్తుంటాం. అయితే, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఇతరులకు డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. ఈ నియమాలు పాటించకపోతే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ధనపరమైన విషయాల్లో ప్రతిఒక్కరూ పాటించాల్సిన ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Money Facts: ఈ రాశి, నక్షత్రాల వారు అప్పు ఇస్తే తిరిగి రానట్టే.. ఈ రోజుల్లో మాత్రం అస్సలు ఇవ్వకండి.. కష్టాలు తప్పవు!
Money Lending Secrets In Astrology

Updated on: Jun 04, 2025 | 11:18 AM

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అమావాస్య రోజు ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు. అలాగే, ఇతరుల నుండి తీసుకోకూడదు. అలా చేస్తే ఇబ్బందులు తప్పవని చెబుతారు. రోజు ఆర్థిక లావాదేవీలు జరిపేవారు, డబ్బు రొటేషన్ చేసేవారు ఇతరులకు డబ్బు ఇచ్చేటప్పుడు పంచాంగంలో హోరా చక్రాన్ని అనుసరించడం మంచిది. దాన్ని దగ్గర పెట్టుకొని ప్రత్యేకమైన హోరల్లో డబ్బు ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్యులు అంటున్నారు.

ఒకసారి పంచాంగాన్ని పరిశీలిస్తే అందులో రవి, బుధ, శుక్ర అనే హోరలు ఉంటాయి. ఏ రోజు అయినా సరే ఈ మూడు హోరలు ఉన్న సమయాల్లో ఎదుటివారికి డబ్బు ఇవ్వడం మంచిది. అలా ఇస్తే మీకూ కలిసివస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అదే, శని, గురు ఈ రెండు హోరలు ఉన్న సమయంలో మాత్రం ఎదుటివాళ్లకు డబ్బు ఇవ్వకపోవడమే మంచిది.

డబ్బులు తీసుకోవడానికి మాత్రం గురు హోర చాలా ఉత్తమమైనది. అలాగే, హస్తా నక్షత్రం ఉన్నప్పుడూ ఎదుటివారి దగ్గర డబ్బు తీసుకుంటే మీకు అదృష్టం బాగా కలిసివస్తుంది. అందుకే, ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకోవాలన్నా లేదంటే ఎవరి వద్దనైనా డబ్బులు తీసుకొని కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా హస్తా నక్షత్రం ఉన్న రోజు తీసుకోవాలి. ఎందుకంటే ఈ నక్షత్రం ఉన్న నాడు డబ్బు, వస్తువులు తీసుకున్నారంటే అది మీకు బ్రహ్మాండంగా కలిసివస్తుందని అంటున్నారు.

ఈ సమయాల్లో అప్పు ఇవ్వొద్దు!

హస్తా నక్షత్రం ఉన్న సమయంలో ఎవరికైనా డబ్బు, వస్తువులు అప్పుగా ఇస్తే అది తిరిగి రావడం అసాధ్యమని చెబుతారు. హస్తా నక్షత్రం ఒకటే కాదు, మరికొన్ని నక్షత్రాలు ఉన్న టైమ్ లో డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి పొందడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, కొన్నిసార్లు అవి తిరిగి రాకపోవడం లేదా మొండి బాకీ కింద పడిపోవడం జరుగుతుందని చెబుతున్నారు. చాలా మందికి మొండి బాకీల సమస్యలు ఉండడానికి ఈ నక్షత్రాలు ఉన్న సమయంలో అప్పు ఇవ్వడమే కారణం కావచ్చు అంటున్నారు.

అలాంటి వాటిలో ఒకటి భరణి నక్షత్రం. ఇది ఉన్ననాడు అప్పు ఇవ్వకపోవడం మంచిది. మరో నక్షత్రం మఖ. ఈ రోజు డబ్బు ఇచ్చినా అతి కష్టంపై ఆ డబ్బును తిరిగిపొందుతారు. ఉత్తరాభాద్ర నక్షత్రం నాడు ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బుతో పాటు మీ అదృష్టం కూడా వెళ్లిపోతుందట. అలాగే, మూలా నక్షత్రం ఉన్న రోజు ఇతరులకు డబ్బు ఇవ్వకపోవడం మంచిది. ఈ ఐదు నక్షత్రాలు ఉన్న సమయాల్లో వీలైనంత వరకు అప్పు ఇవ్వడానికి దూరంగా ఉండడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు.