Vastu Shastra: వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి భూమిని ఎంచుకోవాలి..! లోపాలుంటే ఏం చేయాలి..?

|

Sep 12, 2021 | 4:26 PM

Vastu Shastra: మనదేశంలో వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. దిశను బట్టే దశ ఉందని భావిస్తారు. అందుకే ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్ర సలహాలను తీసుకుంటారు.

Vastu Shastra: వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి భూమిని ఎంచుకోవాలి..! లోపాలుంటే ఏం చేయాలి..?
Home
Follow us on

Vastu Shastra: మనదేశంలో వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. దిశను బట్టే దశ ఉందని భావిస్తారు. అందుకే ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్ర సలహాలను తీసుకుంటారు. అలాగే ఒక వ్యక్తి జీవితంలో బాగుండాలంటే కొన్ని నియమాలు అవసరం. వాస్తు దోషం ఉన్న భూమిలో ఇల్లు కట్టుకుంటే చాలా సమస్యలు ఏర్పడుతాయి. మీరు ఇంటి కోసం భూమిని కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి.

భూమి వాస్తు దోషం ఎలా తెలుస్తుంది..

1. వాస్తు శాస్త్రం ప్రకారం.. చాలాకాలం ఎవ్వరు ఉపయోగించని భూమి, ప్రజలు చెత్త కోసం వాడిన భూమి, లేదా చనిపోయిన జంతువులను పాతిపెట్టిన భూములకు భయంకరమైన వాస్తు దోశాలు ఉంటాయి. అలాంటి భూమిపై ఇంటి నిర్మాణం చేయకూడదు.

2. మీరు ఏదైనా భూమిపై ఇల్లు నిర్మించాలని ఆలోచిస్తుంటే ముందుగా ఆ భూమిపై ఒక చేయి పొడవు, వెడల్పు ఉన్న గొయ్యిని తవ్వాలి. సాయంత్రం దానిని నీటితో నింపాలి. మీరు రెండో రోజు వెళ్లి చూస్తే ఆ గొయ్యిలో నీరు కనిపిస్తే ఆ భూమి పవిత్రమైనదిగా గుర్తిస్తారు. బురద కనిపించినా, భూమి పొడిగా ఉన్నట్లు కనిపించినా, అందులో పగుళ్లు కనిపించినా అశుభంగా పరిగణిస్తారు. అక్కడ ఇంటి నిర్మాణం చేయాలనే ఆలోచనను వదిలిపెట్టాలి.

3. వాస్తు దోషాలను తొలగించడానికి పరిహారం
మీ భూమిలో వాస్తు దోషం ఉందని మీకు అనిపిస్తే ఆవు కోసం ఆ స్థలాన్ని కేటాయించండి. ప్రతిరోజూ ఆవుకు సేవ చేయండి. ఈ పరిహారం చేయడం ద్వారా ఆ ప్రదేశంలో వాస్తు దోషాలు తొలగిపోతాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఆవును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఈ పరిహారం చేయడం ద్వారా వాస్తు దోషం తొలగిపోవడమే కాకుండా మీ ఇల్లు ఎల్లప్పుడూ సిరిసంపదలతో నిండి ఉంటుంది.

4. ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి మాత్రమే ఉంటుందని గ్రహించండి.

Afghanistan Crisis: అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుకోకూడదు.. ఇస్లామిక్ దుస్తులు ధరించడం తప్పనిసరి..

Viral Video: 2 గంటలు చిన్నారి మెడను చుట్టిన నాగుపాము.. కానీ చివరకు మాత్రం

Black Pepper Tea: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నల్ల మిరియాల టీతో ఎన్నో ప్రయోజనాలు.. ఎంటో తెలుసా..