హిందూమతంలో వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఒకొక్క రోజు ఒకొక్క దేవుడిని పూజిస్తారు. ఈ నేపద్యంలో బుధవారం గణపతి దేవుడికి అంకితం చేయబడింది. ఈ రోజు గణపతి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే కొంతమంది గణపతితో పాటు లక్ష్మీదేవిని పూజించాలని హిందువులు నమ్ముతారు. లక్ష్మి, గణేశుడిని కలిసి పూజిస్తే జీవితంలోని అన్ని సమస్యలు, సంక్షోభాల నుండి ఉపశమనం లభిస్తుంది. వారంలో బుధవారం రోజు గజాననునికి అంకితం చేయబడింది. గణపతి పూజ విజయాన్ని తెస్తుంది. మరోవైపు లక్ష్మీ పూజ ఆర్థిక కొరత లేదా సమస్యలను తొలగిస్తుంది.
మత విశ్వాసాల ప్రకారం ఏదైనా శుభ కార్యం చేసే ముందు ముందుగా గణేశుడిని స్మరించుకుంటారు. శాస్త్రాల ప్రకారం వినాయకుడు జ్ఞాన సంపదకు ప్రతీకగా చెప్పబడింది. మరోవైపు లక్ష్మి సంపదకు దేవత. గణేశుడిని పూజిస్తే భక్తులు తమ బాధల నుండి విముక్తి పొందుతారని హిందువులు నమ్ముతారు. మనసులోని అన్ని కోరికలు నెరవేరుతాయని కూడా నమ్ముతారు. బుధవారం రోజున నియమాల ప్రకారం లక్ష్మీ-గణేశుడిని కలిసి పూజిస్తే శీఘ్ర ఫలితాలు పొందుతారు.
హిందూ మత విశ్వాసాల ప్రకారం లక్ష్మి దేవి సంపద, అదృష్టానికి దేవత. లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రజలందరూ సంపదలు పొందుతారు. లక్ష్మీదేవి సముద్రం నుంచి జన్మించిందని చెబుతారు. కనుక లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండదు. నీటిలా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే నిర్మలమైన మనసుతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లోనే ఉంటుంది. సాధారణంగా వ్యాపారస్తులు తమ షాప్ తెరచిన వెంటనే మొదట లక్ష్మి,గణేశుని కలిసి పూజిస్తారు. చాలా ఇళ్లలో గణపతి, లక్ష్మిదేవిని కలిపి పూజిస్తారు. పురాణం ప్రకారం ఎవరివద్ద అయినా అధికంగా సంపద ఉన్న సమయంలో తానే గొప్పవాడిని అనే భ్రమ ఏర్పడుతుంది. అయితే సంపద జ్ఞానం ఉన్న చోటు మాత్రమే ఉంటుంది..కనుక లక్ష్మీదేవితో కూడిన గణేశుడిని పూజించడం తప్పనిసరి.
హిందూమతంలో లక్ష్మీదేవి భక్తులందరికీ సిరి సంపదలను అనుగ్రహిస్తుందని నమ్ముతారు. బుధవారం శుభ చిహ్నం. లక్ష్మీదేవిని గణేశుడిని పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని హిందువులు నమ్ముతారు. ఇంట్లో సంపద పెరుగుతుంది. లక్ష్మీదేవితో పాటు వినాయకుడిని పూజించడం ఆచారం. పురాణాల ప్రకారం గణపతి లక్ష్మీ దేవి దత్తపుత్రుడిగా నమ్ముతారు. గణపతి లేని లక్ష్మీ పూజ అసంపూర్ణం. అందుకే లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి గణేష్ లక్ష్మీ స్తోత్రం అత్యంత ప్రయోజనకరంగా.. ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. బుధవారం వంటి శుభ దినాలలో గణేశ లక్ష్మీ స్తోత్రాన్ని భక్తితో పఠించడం ద్వారా ఆర్ధికంగా బలపడతారు. లక్ష్మీదేవి గణపతి పూజ చేసే ఇంట్లో లక్ష్మి ఇంట్లోకి ప్రవేశించడంతో ఆనందం, శాంతి నెలకొంటుంది.. ఆర్థిక సంక్షోభం, సమస్యలు ఉండవు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి