Ramatheertham : జనవరి నాటికి రామతీర్థం కొండపై శ్రీరాముల వారి ఆలయం నిర్మిస్తాం : దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి

|

Jun 09, 2021 | 3:27 PM

వచ్చే ఏడాది జనవరి నాటికి విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపై శ్రీరాముల వారి ఆలయం నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి..

Ramatheertham : జనవరి నాటికి రామతీర్థం కొండపై శ్రీరాముల వారి ఆలయం నిర్మిస్తాం : దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి
Ramateertham Temple
Follow us on

Ramatheertham Sri Ram temple : వచ్చే ఏడాది జనవరి నాటికి విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపై శ్రీరాముల వారి ఆలయం నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ చెప్పారు. కొండపైన ఆలయ నిర్మాణానికి అవసరమైన వసతులు సమకూర్చి అనుకున్న సమయానికి ఆలయం పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఆగమ శాస్త్ర ప్రకారం పలువురు పండితులు, స్వామీజీలను సంప్రదించి వారి సూచనలు, సలహాలు మేరకు శాస్త్రోక్తంగా రూ. 3 కోట్ల వ్యయంతో ఆలయాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పునర్నిర్మాణం చేస్తున్నామని మంత్రి తెలిపారు.

రామతీర్థం కొండ‌పై కొలువుదీరిన‌ శ్రీరాముడి ఆలయాన్ని మంత్రి వెల్లంపల్లి ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా రామతీర్థం ఆలయ నమూనా చిత్రాన్ని విడుదల చేశారు. అనంతరం అధికారుల‌తో క‌లిసి ఆలయ ప్రాంగణాన్ని, పరిసర ప్రాంతాలను మంత్రి పరిశీలించారు.

గుడి సందర్శనలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు, అధికారులు పాల్గొన్నారు. కాగా, పురాతన రామతీర్థం కొండపై ఉన్న శ్రీరాముల వారి విగ్రహాల్ని దుండగులు ధ్వసం చేయడం ఇది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద పొలిటికల్ రచ్చకు దారితీయడం తెలిసిందే.

Read also : YS Sharmila: వైయస్ షర్మిల పొలిటికల్ పార్టీ పై మరింత క్లారిటీ… పూర్తి వివరాలు