Vivaha Panchami: శుభ ముహర్తాలు ఉన్నా.. వివాహ పంచమి రోజున తల్లిదండ్రులు తమ కుమార్తెకు ఎందుకు పెళ్లి చేయరో తెలుసా..

|

Nov 20, 2024 | 8:21 PM

పురాణ మత గ్రంధాల ప్రకారం త్రేతా యుగంలో మాఘ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజు పంచమి తిధిన శ్రీ రాముడు, సీతదేవిల వివాహం జరిగింది. అందుకే ఈ తిధిని వివాహ పంచమి అంటారు. అయితే ఈ రోజు పెళ్లి చేసుకోవడం శ్రేయస్కరం కాదని చెబుతారు.

Vivaha Panchami: శుభ ముహర్తాలు ఉన్నా.. వివాహ పంచమి రోజున తల్లిదండ్రులు తమ కుమార్తెకు ఎందుకు పెళ్లి చేయరో తెలుసా..
Vivaha Panchami 2024
Follow us on

హిందూ మతంలో వివాహ పంచమికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం సీతా రాముల వివాహం మాఘ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజు పంచమిన అంటే ఆగహన మాసంలో జరిగింది. అందువల్ల ఈ తిధి మతపరమైన దృక్కోణంలో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం సీతా రాముల వివాహ వార్షికోత్సవంగా మాఘ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం వివాహ పంచమి 6 డిసెంబర్ 2024 న జరుపుకోనున్నారు.

వివాహ పంచమి రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ఈ రోజున వివాహాలు చేయడం నిషేధించబడ్డాయి. వివాహ పంచమి రోజున పెళ్లి చేసుకోవడం సరికాదని నమ్మకం. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో వివాహ పంచమి రోజున వివాహాలు జరపరు. ఇలా ఎందుకు అని మీరు ఆశ్చర్యపోతున్నారా.. వివాహ పంచమి రోజున వివాహం ఎందుకు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

వివాహ పంచమి రోజున పెళ్లి చేసుకోవడం మంచిదా?

వివాహ పంచమి రోజు చాలా పవిత్రమైనది. ఈ రోజున చాలా శుభ ముహూర్తాలు ఉంటాయి. అయితే ఏ తల్లిదండ్రులు తమ కుమార్తెలకు ఈ రోజున వివాహం చేయరు. వివాహ పంచమి రోజు వివాహం చేయడం అశుభంగా భావించడం వల్ల గ్రహాలు, నక్షత్రాల స్థానం బాగున్నప్పటికీ ఈ రోజున శుభ సమయం ఉన్నప్పటికీ వివాహం చేయడానికి ఇష్టపడరు.

ఇవి కూడా చదవండి

వివాహ పంచమి రోజున ఎందుకు వివాహం చేసుకోకూడదు?

హిందూ మత విశ్వాసాల ప్రకారం మాఘ శుక్ల పంచమి తిథి రోజున వివాహం చేసుకున్న తరువాత సీతారాముల జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అందులో వీరు 14 సంవత్సరాల వనవాసానికి వెళ్ళారు. అంతేకాదు వనవాసం పూర్తయిన తర్వాత కూడా సీతదేవి అడవిలో నివసించవలసి వచ్చింది. వనవాసం చివరి సంవత్సరంలో సీతాదేవిని రావణుడు అపహరించాడు. దీంతో సీతారాములు బాధను అనుభవించవలసి వచ్చింది.

దీని తరువాత సీతాదేవి అగ్నిపరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయోధ్యకు తిరిగి వచ్చిన కొద్దికాలానికే శ్రీరాముడు సీతదేవిని విడిచిపెట్టాడు. ఈ విధంగా యువరాణి సీతదేవి.. రాణిగా మారినా తన జీవితంలో సుఖ సంతోషాలను పొందలేదు. ఈ కారణంగా ప్రజలు వివాహ పంచమి తిధిన తల్లిదండ్రులు తమ కుమార్తెలకు వివాహం చేయడం శుభప్రదంగా భావించరు. అయితే పురాణ గ్రంథాలలో ఎటువంటి ప్రస్తావన లేదు.

 

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.