Visa God Temple: విమాన దేవాలయం.. ఆ ప్రసాదం సమర్పిస్తే వీసా కన్ఫామ్‌..!

|

Mar 07, 2021 | 9:29 PM

Visa God Temple: సాధారణంగా ఎవరైనా.. మంచిగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించుకుని, వీలైతే విదేశాల్లో..

Visa God Temple: విమాన దేవాలయం.. ఆ ప్రసాదం సమర్పిస్తే వీసా కన్ఫామ్‌..!
Follow us on

Visa God Temple: సాధారణంగా ఎవరైనా.. మంచిగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించుకుని, వీలైతే విదేశాల్లో సెటిల్ అయిపోదాం అని భావించడం సహజం. దాని కోసం కొందరు తీవ్రంగా శ్రమిస్తుంటారు కూడా. అదే సమయంలో దేవుడిపైనా భారం వేస్తారు. ఇలాంటి ఘటనలను మనం కోకొల్లలుగా చూసే ఉంటాం. మన తెలుగు రాష్ట్రాల వరకు చూసుకున్నట్లయితే విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఏ దేవుడిని పూజిస్తారంటే టక్కున చిలుకూరు బాలాజీ టెంపుల్ అని చెబుతారు. అంతగా ప్రాచూర్యం పొందింది కాబట్టే.. చిలుకూరు బాలాజీకి వీసా దేవుడు అని పేరు కూడా వచ్చింది. విదేశాలకు వెళ్లాలనుకునే వారు చిలుకూరు బాలాజీ టెంపుల్‌ను దర్శించుకుని పూజలు నిర్వహించి మొక్కులు చెల్లిస్తుంటారు.

ఇదిలాంటే.. ఇలాంటి వీసాదేవుడే పంజాబ్‌లోనూ ఉన్నాడు. ఆ స్వామిక ఏకంగా విమాన దేవాలయాన్ని నిర్మించారు భక్తులు. ఆ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. పంజాబ్‌లోని జలంధర్ తల్ హాన్ లో సిక్కుల దేవాలయం అయిన హవాయూ జహాజ్ గురుద్వారా ఉంది. ఒకప్పుడు ఈ గురుద్వారాని షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారాగా పిలిచేవారట. ఈ గురుద్వారాను స్థానిక జాట్ కమ్యూనిటీ, దళిత వర్గాల ప్రజలు వందేళ్ల క్రితం నిర్మించారని సమాచారం. ఈ గురుద్వారాలో ప్రార్ధన చేస్తే వీసా ఆమోదం లభిస్తుందని భక్తుల బలంగా విశ్వసిస్తారు.

ఆ కారణంగా ఈ గురుద్వారాను దర్శించుకునే భక్తులు విమానం బొమ్మనే ప్రసాదంగా ఇస్తారు. ఇలా చేస్తే.. త్వరగా వీసా లభిస్తుందని వారి నమ్మకం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ గురుద్వారా విమాన దేవాలయంగా మార్చేశారు. అంతేకాందు.. ఆ దేవుడికి వీసా దేవుడని పేరు కూడా పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, విమానా దేవాలయం పరిసర షాపుల్లో పలు రకాల విమాన బొమ్మ నమూనాలు తయారు చేసి అమ్ముతారు. ఒక్కొక్కటి 50 రూపాయల నుంచి 500 వరకూ ఉంటాయి. ఇక్కడ రోజూ కొన్ని వందల బొమ్మలు అమ్ముడవుతాయట. ఈ గురుద్వారాకు వెళ్లాలంటే జలంధర్ నుంచి సుమారు 12 కి.మీ దూరంలో ఉన్న చిన్నన్ గ్రామం చేరుకోవాల్సి ఉంటుంది.

Also read:

India vs England: రిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ ఎఫెక్ట్.. కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది నిజంగా అవమానమే..

Telangana Eamcet 2021: విద్యార్థులు బీ అలెర్ట్.. ఎంసెట్ ప్రశ్నా పత్రంలో కీలక మార్పులు.. ఏం చదవాలో తెలుసా..