అక్టోబరు 11 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు..10 రోజుల పాటు అమ్మవారి దివ్య రూపాల దర్శనం!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 2026 దసరా మహోత్సవాల షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 11న ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అక్టోబర్ 20న విజయదశమి వరకు 10 రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 16న మూలా నక్షత్రం పురస్కరించుకుని శ్రీ సరస్వతి దేవి అలంకారం, అక్టోబర్ 20న విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారు. విజయదశమి సాయంత్రం కృష్ణానదిలో నిర్వహించే హంసవాహనం తెప్పోత్సవంతో ఈ దసరా ఉత్సవాలు వైభవంగా ముగుస్తాయి.

అక్టోబరు 11 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు..10 రోజుల పాటు అమ్మవారి దివ్య రూపాల దర్శనం!
Vijayawada Dasara 2026

Edited By:

Updated on: Sep 03, 2026 | 12:14 PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 2026 సంవత్సరానికి సంబంధించిన దసరా నవరాత్రి మహోత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అధికారులు అధికారికంగా విడుదల చేశారు. అక్టోబర్ 11న ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ప్రారంభమై అక్టోబర్ 20న విజయదశమి వరకు పది రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల కాలంలో రోజుకో ప్రత్యేక అలంకారంలో అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు.

2026 దసరా నవరాత్రుల అమ్మవారి అలంకారాల పట్టిక

తేదీ తిథి అమ్మవారి అలంకారం
అక్టోబర్ 11 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ బాలా త్రిపురసుందరి దేవి
అక్టోబర్ 12 విదియ శ్రీ గాయత్రీ దేవి
అక్టోబర్ 13 తదియ శ్రీ అన్నపూర్ణా దేవి
అక్టోబర్ 14 చవితి శ్రీ మీనాక్షి దేవి
అక్టోబర్ 15 పంచమి శ్రీ లలితా త్రిపురసుందరి దేవి
అక్టోబర్ 16 షష్ఠి (మూలా నక్షత్రం) శ్రీ సరస్వతి దేవి
అక్టోబర్ 17 సప్తమి శ్రీ మహాలక్ష్మీ దేవి
అక్టోబర్ 18 అష్టమి (దుర్గాష్టమి) శ్రీ దుర్గాదేవి
అక్టోబర్ 19 నవమి (మహానవమి) శ్రీ మహిషాసురమర్ధిని దేవి
అక్టోబర్ 20 దశమి (విజయదశమి) శ్రీ రాజరాజేశ్వరి దేవి

ప్రత్యేక రోజులు, ఆకర్షణలు

అక్టోబర్ 16 (శ్రీ సరస్వతి దేవి అలంకారం): మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు చదువుల తల్లి సరస్వతి దేవిగా దర్శనమిస్తారు. ఈ రోజున విద్యార్థులు, భావి తరాల చదువుల కోసం తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు.

అక్టోబర్ 18, 19 (దుర్గాష్టమి, మహానవమి): అత్యంత శక్తివంతమైన దుర్గాదేవి, మహిషాసురమర్ధిని రూపాల్లో అమ్మవారు భక్తులకు అభయాన్ని అందిస్తారు.

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 20 (విజయదశమి, తెప్పోత్సవం): చివరి రోజైన విజయదశమి నాడు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తారు. అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో కన్నులపండువగా నిర్వహించే హంసవాహనం తెప్పోత్సవంతో దసరా ఉత్సవాలు మంగళకరంగా ముగుస్తాయి.

తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, భక్తుల దర్శనం, క్యూలైన్లు, లడ్డూ ప్రసాదాల విక్రయం, ఉచిత అన్నదానం, భద్రత, ట్రాఫిక్ నివారణకు దేవస్థానం, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us