VHP : అయోధ్య శ్రీరామాలయానికి సమర్పించిన ప్రతి రూపాయికి ట్రస్టు జవాబుదారిగా ఉంటుంది : అలోక్ కుమార్

|

Jun 15, 2021 | 3:20 PM

శ్రీరామ మందిర నిర్మాణాన్ని ఇంతకాలం వ్యతిరేకించిన శక్తులు నేడు అయోధ్య ట్రస్టు విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నాయని విశ్వహిందూ పరిషత్ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్..

VHP : అయోధ్య శ్రీరామాలయానికి సమర్పించిన ప్రతి రూపాయికి ట్రస్టు జవాబుదారిగా ఉంటుంది : అలోక్ కుమార్
Ayodya Srirama Temple
Follow us on

Ram temple trust : శ్రీరామ మందిర నిర్మాణాన్ని ఇంతకాలం వ్యతిరేకించిన శక్తులు నేడు అయోధ్య ట్రస్టు విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నాయని విశ్వహిందూ పరిషత్ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ అన్నారు. ట్రస్టుపై అసత్య ఆరోపణలు చేసిన వ్యక్తులపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. భక్తుల సౌకర్యం కోసం మందిర ట్రస్టు కొన్న భూ లావాదేవీలు పూర్తి పారదర్శకంగా జరిగాయన్న ఆయన.. సజావుగా సాగుతున్న మందిర నిర్మాణాన్ని ఓర్వలేకనే ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ) , కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీలు అర్థం లేని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర నిర్మాణం కోసం ఉద్యమించిన VHP, మందిర ట్రస్టు పై దేశ ప్రజలు పూర్తి విశ్వసనీయతను చాటుతూ పెద్దఎత్తున మందిర నిర్మాణానికి విరాళాలు సమర్పించారని ఆయన స్పష్టం చేశారు.

దేశ వ్యాప్తంగా శ్రీరామ భక్తులు సమర్పించిన ప్రతి రూపాయికి ట్రస్టు జవాబుదారిగా ఉంటుందని అలోక్ కుమార్ తేల్చి చెప్పారు. ఆ విరాళాలతో అయోధ్యలో భవ్య మందిర నిర్మాణం జరుగుతుందని.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా శ్రీరామకార్యాన్ని ఎవరూ ఆపలేరని ఆయన చెప్పారు. రామ జన్మ భూమి ట్రస్ట్ ప్రజల సౌకర్యార్థం అత్యంత పారదర్శకంగా కొనుగోలు చేసిన భూమిని వివాదాస్పదం చేస్తున్న ఆమ్ ఆద్మీ , కాంగ్రెస్ పార్టీల ఆరోపణలు బేస్ లెస్ అంటూ ఆయన కొట్టిపారేశారు.

ఫేస్ టు ఫేస్ డెబిట్ లో ప్రూవ్ చేసుకోలేక ఆప్ నేత సంజయ్ సింగ్ పారిపోయాడని, అయోధ్య రాముని గుడి నిర్మాణాన్ని అడ్డుకోవడానికే ఈ డ్రామాలాడుతున్నారని వీహెచ్‌పీ అగ్రనేత మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడం మరోసారి బట్ట బయలు అయ్యిందన్న ఆయన.. హిందూ సమాజంలో నమ్మకాన్ని, భక్తి శ్రద్దల మీద విషం కక్కే పని చేస్తున్న ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీల మీద పరువు నష్టం దావా వేయడానికి యోచిస్తున్నామని అలోక్ తెలిపారు.

VHP Alok Kumar

Read also : Mobile Toilets : రాజధానికి వివిధ పనుల మీద వచ్చేవారికి, గ్రేటర్ హైదరాబాద్ వాసులకు పెద్ద శుభవార్త.!