Veerabhadra Swamy: కోరిక తీరాలంటే.. కోర మీసం వీరభద్రుడికి గుమ్మడికాయ సమర్పించాల్సిందే..

ఆ దేవుడికి గుమ్మడి కాయలే నైవేధ్యం.. అక్కడ గుమ్మడి కాయ సమర్పిస్తే మొక్కు తీరినట్లే.. కోరికలు నెరవేరిన ప్రతిఒక్కరూ నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకొని కోర మీసాల వీరభద్రుడి వద్దకు క్యూ కడతారు.. ఇంతకీ ఆ గుమ్మడకాయ మొక్కులెంటీ..? ఎక్కడుంది ఆ దేవాలయం..? ఎందుకు గుమ్మడికాయ మొక్కు చెల్లిస్తారు..? పూర్తిగా తెలుసుకోండి..

Veerabhadra Swamy: కోరిక తీరాలంటే.. కోర మీసం వీరభద్రుడికి గుమ్మడికాయ సమర్పించాల్సిందే..
Veerabhadra Swamy Temple In Kothakonda

Edited By:

Updated on: Jan 15, 2025 | 6:50 PM

దేవాలయానికి వెళ్లిన భక్తులు కొబ్బరికాయలు కొట్టడం.. పసుపు కుంకుమలు సమర్పించడం.. కొబ్బరి కాయలు ముడుపు కట్టడం చూస్తుంటాం.. సమ్మక్క సారక్క దేవతల కైతే బెల్లం మహా నైవేధ్యం సమర్పిస్తారు.. కానీ హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రుడికి మాత్రం గుమ్మడికాయలే మహా నైవేధ్యం.. కోటీశ్వరులైనా… కటిక పేద భక్తులైనా సరే ఈ దేవుణ్ణి దర్శించుకోవాలంటే నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకొని రావాలి.. నైవేధ్యం సమర్పించాలి..

కొత్తకొండ వీరభద్రస్వామికి మొక్కులు మొక్కుకున్న ప్రతిఒక్కరు ఆ కోరిక తీరిన వెంటనే నెత్తిన రాచ గుమ్మడికాయ ఎత్తుకొని కొత్తకొండకు క్యూ కడుతుంటారు.. వీర బద్రస్మామికి గుమ్మడికాయ మొక్కు చెల్లిస్తారు.

సామాన్య భక్తులేకాదు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా నెత్తిన గుమ్మడికాయ, చేతిలో కోర మీసాలతో తరలివచ్చి మల్లన్నకు మొక్కులు చెల్లించుకుంటారు.

భక్తులు గుమ్మడికాయ నెత్తిన ఎత్తుకొని కోర మీసాల వీరన్నకు రాచగుమ్మడికాయ సమర్పించడమే ఈ ఆలయంలో ఆనవాయితీ.. జాతర సందర్భంగా వేలాది గుమ్మడి కాయలు సమర్పిస్తారు.

వీడియో చూడండి..

పురాణాల చరిత్ర ప్రకారం..

ఇక్కడ పండితులు చెబుతున్న పురాణాల చరిత్ర ప్రకారం.. గుమ్మడికాయ మొక్కులకు చాలాపెద్ద చరిత్రే ఉంది. దక్షయజ్ఞంలో దక్షున్ని వీరభద్రుడు సంహరించినట్లు చరిత్ర చెపుతుంది. వీరభద్రుడు కోపాన్ని శాంతింప చేయాలంటే ఎన్నితలలు తెగినా అసాధ్యమే.. పరిహారంగా కూష్మాండం అంటే రాచగుమ్మడి కాయను సమర్పిస్తే వీరభద్రుడు శాంతించి అనుగ్రహిస్తాడనేది నమ్మకం..

ఆ నమ్మకంతోనే భక్తులు నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకొని తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జాతర సమయంలో కొత్తకొండ వీరభద్రస్వామి జాతరలో వేలాది రాచగుమ్మడికాయల వ్యాపారం జరుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..