Vastu Tips: పగిలిన అద్దం, పాత్రలు ఇంట్లో పెట్టుకుంటే కలిగే ప్రభావాలు తెలిస్తే వెంటనే బయటకు విసిరేస్తారు.. సుమా

వాస్తు శాస్త్రం అతిపురాతన శాస్త్రం.. ఇది ఇంటి నిర్మాణం తో పాటు ఇంట్లో పెట్టుకునే వస్తువుకి కూడా కొన్ని నియమాలు ఉన్నాయని తెలుపుతుంది. ఇంట్లో శుభం అశుభం కలగడానికి కారణాలను, నివారణలను కూడా సూచిస్తుంది. ఇంట్లో విరిగిన పాత్రలు, అద్దాలు ఇంటి అందాన్ని పాడు చేయడమే కాకుండా వాస్తు దోషాలను కూడా కలిగిస్తాయి. ఇవి ప్రతికూల శక్తిని కలిగిస్తాయి.

Vastu Tips: పగిలిన అద్దం, పాత్రలు ఇంట్లో పెట్టుకుంటే కలిగే ప్రభావాలు తెలిస్తే వెంటనే బయటకు విసిరేస్తారు.. సుమా
Vastu Tips

Updated on: Aug 20, 2025 | 11:34 AM

మనిషి జీవితంలో వాస్తు శాస్త్రం విశేషమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. మనం సంతోషంగా, సంపన్నంగా జీవించాలనుకుంటే వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నియమాలను పాటించాలని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి వాతావరణం అందులో నివసించే వ్యక్తుల జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. చిన్న విషయాలు కూడా ఆనందం, శాంతి, పురోగతిని ప్రభావితం చేస్తాయి. వాస్తు శాస్త్రాన్ని విశ్వసించిన వారు ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువుకు దాని సొంత శక్తి ఉంటుందని విశ్వసిస్తారు. ఈ శక్తి సానుకూలంగా ఉంటే ఇంట్లో ఆనందం నెలకొంటుంది. అయితే ప్రతికూల శక్తి ఉంటే సమస్యలు పెరుగుతాయి. విరిగిన పాత్రలు, అద్దాలు కూడా ఇంట్లో ఉంచడం అశుభమని భావిస్తారు. ఈ రోజు ఇంట్లో విరిగిన పాత్రలు, అద్దాలను ఎందుకు ఉంచకూడదో తెలుసుకుందాం.

విరిగిన పాత్రలు ప్రతికూలతను ఎందుకు తెస్తాయంటే
వాస్తు శాస్త్రంలో విరిగిన పాత్రలను అశుభం, ప్రతికూల శక్తికి సంకేతంగా భావిస్తారు. విరిగిన పాత్రలు ఇంట్లో ఆర్థిక సమస్యలను, విభేదాలను ప్రోత్సహిస్తాయని నమ్ముతారు. చాలా సార్లు ప్రజలు కొద్దిగా విరిగిన పాత్రను కూడా ఉపయోగించవచ్చని అనుకుంటారు. అయితే అలా చేయడం సరైనది కాదు. ఇది సంబంధాలలో చీలికకు, కుటుంబ సభ్యులలో మానసిక ఒత్తిడికి దారితీస్తుంది.

పగిలిన గాజు.. దాని ప్రభావాలు
నమ్మకాల ప్రకారం అద్దం చూడటానికి మాత్రమే కాదు..ఇంటి శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. పగిలిన అద్దం వాస్తు దోషానికి ప్రధాన కారణంగా పరిగణించబడుతుంది. దానిని ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. కుటుంబ సభ్యుల జీవితాల్లో అశాంతి ఏర్పడుతుంది. ఇది ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశాన్ని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యం.. మానసిక ప్రశాంతతపై ప్రభావం
వాస్తు శాస్త్రం ప్రకారం విరిగిన పాత్రలు, అద్దాలు ఇంట్లో విచారం, భారమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. వీటి కారణంగా ఇంటి వాతావరణం ఉద్రిక్తతతో నిండిపోతుంది. అలాంటి వాతావరణంలో నివసించడం మానసిక ప్రశాంతతను ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి చిరాకు లేదా ఇబ్బందికి గురవుతాడు.

సంపద, శ్రేయస్సుపై ప్రభావం
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం విరిగిన వస్తువులు ఇంట్లో సంపద శాశ్వతంగా ఉండకుండా అడ్డంకులు సృష్టిస్తాయి. విరిగిన పాత్రలు లేదా గాజులు ఇంట్లో ఉంచితే డబ్బు నష్టం, ఆర్థిక సంక్షోభం పెరిగే అవకాశం పెరుగుతుంది. అంతే కాదు విరిగిన వస్తువులు పురోగతి మార్గంలో అడ్డంకులను కూడా సృష్టిస్తాయి.

ఏమి చేయాలి?
వాస్తు శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో ఏదైనా పాత్ర లేదా గాజు పగిలిపోతే వెంటనే వాటిని ఇంటి నుంచి బయటకు విసిరేయండి. విరిగిన వస్తువును మళ్ళీ మరమ్మతు చేయడానికి లేదా ఉపయోగించడానికి ప్రయత్నించవద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని శుభ్రంగా, చక్కగా ఉంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.