ఇంటికి సంబంధించిన నిర్మాణంలో మాత్రమే కాదు.. వస్తువులు పెట్టె విషయంలో కూడా వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు నియమాలను పాటించడం ద్వారా జీవితంలో, ఇంట్లో ఆనందం వస్తుంది. అయితే కొన్నిసార్లు తెలిసి లేదా తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. తర్వాత ఆ పొరపాట్లకు చింతిస్తూ ఉంటారు. ఉదాహరణకు కొంతమంది ఇంటి శుభ్రతపై చాలా శ్రద్ధ చూపుతారు. ఎంతగా అంటే సూర్యాస్తమయం తర్వాత కూడా ఇంటిని శుభ్రపరచడం ప్రారంభిస్తారు. ఇదే విధంగా కొనరు తెలిసీతెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. కనుక వాస్తు ప్రకారం సాయంత్రం వేళ కొన్ని పనులు చేయకూడాదు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
ఎవరైనా సాయంత్రం వేళ డబ్బులు అప్పుగా ఇవ్వమని అడిగితే వారికి డబ్బులు ఇవ్వరాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రాదని అంటారు. ఈ సమయంలో ఇచ్చిన రుణాలు తిరిగి రావు. అదే సమయంలో ఈ సమయంలో తీసుకున్న రుణ భారం కూడా ఎప్పటికీ తగ్గదు.
సూర్యాస్తమయం సమయంలో తులసి ఆకులను ఎప్పుడూతెంపకూడదు. ఎందుకంటే తులసిలో లక్ష్మి దేవి నివసిస్తుంది. సాయంత్రం వేళ తులసి ఆకులను తెంపితే శ్రీ మహా విష్ణువు కోపానికి గురవుతాడని విశ్వాసం. సాయంత్రం వేళ తులసి ఆకులను తెంపడం వలన రోగాలు, ఆర్థిక సమస్యలు చుట్టుముడుతాయని వాస్తులో ఒక నమ్మకం.
ఇంట్లో పరిశుభ్రత కోసం సాయంత్రం వేళల్లో ఇంటిని తుడుచుకునే పనిని చాలా మంది పదే పదే చేస్తుంటారు. అయితే సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చివేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అంతేకాదు ఆర్ధిక పరిస్థితిని ప్రభావితం చేస్తుందని వాస్తు చెబుతోంది. కొన్ని కారణాల వల్ల మీరు ఇంటిని ఊడ్చవలసి వస్తే ఇంట్లోని సేకరించిన చెత్తను ఇంటి నుండి బయటకు విసిరేయకండి. ఒకవైపు దానిని సేకరించి.. మర్నాడు సూర్యోదయం తర్వాత మాత్రమే ఇంటి నుండి బయట వేయండి.
సాయంత్రం ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరగకూడదు. దీని కారణంగా లక్ష్మీదేవికి కోపం వస్తుంది . ఆ ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది. ఎవరైనా ఆకలి అంటూ సాయంత్రం వేళ మీ ఇంటి దగ్గరకు వస్తే.. అతడిని ఎప్పుడూ ఖాళీ చేతులతో తిరిగి వెళ్లనివ్వకండి.
చాలా మంది తమ ఇంటి మెయిన్ డోర్ మూసి ఉంచుతారు.. వాస్తు ప్రకారం.. సాయంత్రం కొంత సమయం ఇంటి ప్రధాన తలుపు తెరిచి ఉంచాలి. సూర్యాస్తమయం ఇంటి ప్రధాన తలుపు మూసి ఉంచకూడదని చెబుతారు. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇది. అందుకే సాయంత్రం పూట ఇంటి ప్రధాన ద్వారం మూస్తే లక్ష్మీదేవి లోపలికి రాకుండా పోతుందని కనుక ప్రధాన ద్వారం తెరచి ఉంచాలని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)