సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంట్లో వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల పద్దతులు పాటిస్తే.. శుభం జరుగుతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని రకాల మొక్కలను ఇంట్లో నాటితో అదృష్టం కలిసి వస్తుందట. అయితే ఈ మొక్కలను నాటడానికి కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ చెట్లు ఇంట్లో ఉంటే సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంటికి సరైన దిశలో మొక్కలు, చెట్లు నాటితే మనిషి జీవితంలో చాలా సమస్యలను తగ్గించుకోవచ్చని అంటారు. మరి ఇంట్లో ఎలాంటి చెట్లు, మొక్కలు నాటితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
ఎవరి ఇంట్లో అయినా తులసి మొక్క ఉంటో ఎంతో మంచిది. తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మొక్కలో లక్ష్మీ దేవి నివసిస్తుందని చాలా మంది నమ్మిక. మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలి అనుకుంటే మీ ఇంటికి ఈశాన్య దిశలో మొక్కను పెడితే చాలా మంచిది. అంతే కాకుండా తులసి మొక్క ఉన్న చోట అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. తులసి మొక్క కార్బన్ డయాక్సైడ్ ని పీల్చుకుంటుంది. అంతే కాకుండా తులసి మొక్క ఆకులతో పలు రోగాలకు కూడా చెక్ పెట్టవచ్చు.
వాస్తు శాస్త్రంలో పారిజాత మొక్కకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. పారిజాత పుష్పం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కరంగా చెబుతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో పారిజాత మొక్క ఉంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది.
హిందూ ధర్మంలో జమ్మి చెట్టును కూడా ఎంతో పవిత్రంగా కొలుస్తారు. వీటికి పూజలు చేస్తూ ఉంటారు. దసర పండుగకు జమ్మి జట్టుకు ఎంతో విశిష్టతగా కొలుస్తారు. ఇంట్లో జమ్మి చెట్టును పెట్టుకోవడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని.. శనీశ్వరుడు సంతోషిస్తాడని చెబుతారు. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుందని ఓ నమ్మకం ఉంది.
వేప చెట్టుకు కూడా ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత ఉంది. వేప చెట్టులోని ప్రతీ భాగం వివిధ అనారోగ్య సమస్యలు నివారించడానికి ఉపయోగ పడుతుంది. ఆయుర్వేదంలో కూడా వేప చెట్టును ఔషధంగా ఉపయోగిస్తారు. అదే విధంగా సనాతన ధర్మంలో వేప చెట్టును కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అమ్మవారుగా కొలుస్తారు. పండుగల సమయంలో మరింత ప్రత్యేకంగా ప్రార్థిస్తారు.