Swastik Rules: ఇంట్లో స్వస్తిక్ చిహ్నాన్ని రూపొందించేందుకు నియమాలు .. ఏ స్థలంలో వేస్తే ఎటువంటి ఫలితాలు అంటే

|

Aug 19, 2024 | 1:10 PM

స్వస్తిక్ సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లో నెగటివ్ ఎనర్జీని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం స్వస్తిక సంపదకు దేవుడు కుబేరుతో సంబంధం కలిగి ఉంది. ఇంట్లో సరైన స్థలంలో స్వస్తిక్ ను వేయడం వల్ల ఇంట్లోకి డబ్బు ప్రవాహం పెరుగుతుంది. స్వస్తిక్ ఉన్న ఇంట్లో ఆనందం, శాంతి వాతావరణం నెలకొంటుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ, సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది.

Swastik Rules: ఇంట్లో స్వస్తిక్ చిహ్నాన్ని రూపొందించేందుకు నియమాలు .. ఏ స్థలంలో వేస్తే ఎటువంటి ఫలితాలు అంటే
Swastik Rules
Follow us on

స్వస్తిక్ హిందూ మతంలో ముఖ్యమైన, అత్యంత పవిత్రమైన చిహ్నంగా పరిగణించబడుతుంది. విఘ్నాలకధిపతి అయిన గణేశునికి ప్రతీక అయిన చిహ్నం కనుక దీన్ని శుభప్రదంగా భావిస్తారు. స్వస్తిక్ శతాబ్దాలుగా సానుకూల శక్తి, శుభాలను ఆకర్షించడానికి ఉపయోగించే పురాతన చిహ్నం. వాస్తు శాస్త్రంలో స్వస్తిక్ చాలా ప్రత్యేకమైన చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. ఇది సానుకూల శక్తిని సూచించడమే కాదు సంపద, శ్రేయస్సును కూడా ఆకర్షిస్తుంది. ప్రజలు తమ ఇంట్లోని వివిధ ప్రదేశాలలో స్వస్తిక చిహ్నాన్ని వేయడం తరచుగా చూసి ఉంటారు. అయితే స్వస్తిక్ ను వేయడంలో కొంతమంది తప్పులు చేస్తారు. అందుకే ఇంట్లో స్వస్తిక్ చిహ్నాన్ని ఎలా వేసుకోవాలి, ఇంట్లో స్వస్తికను ఏ ప్రదేశంలో తయారు చేయాలో కూడా అనే విషయం ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.. ఈ నియమాలను పాటిస్తూ ఇంట్లో స్వస్తిక్ ను వేసుకుని తద్వారా పూర్తి ప్రయోజనాలను పొందగలరు.

హిందూ మతంలో స్వస్తిక్ ప్రాముఖ్యత

స్వస్తిక్ సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లో నెగటివ్ ఎనర్జీని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం స్వస్తిక సంపదకు దేవుడు కుబేరుతో సంబంధం కలిగి ఉంది. ఇంట్లో సరైన స్థలంలో స్వస్తిక్ ను వేయడం వల్ల ఇంట్లోకి డబ్బు ప్రవాహం పెరుగుతుంది. స్వస్తిక్ ఉన్న ఇంట్లో ఆనందం, శాంతి వాతావరణం నెలకొంటుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ, సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది.

ఇవి కూడా చదవండి

మెయిన్ డోర్

ఇంట్లోకి ప్రవేశించదానికి మొదట అడుగు పెట్టే ప్రదేశం ఇంటి ప్రధాన ద్వారం. అందువల్ల ప్రధాన ద్వారంపై స్వస్తిక్ వేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది. ఇందుకోసం 9 అంగుళాల పొడవు, వెడల్పు గల స్వస్తిక చిహ్నాన్ని పసుపు, కుంకుమతో తలుపుపై వేయాలి.

పూజా గృహం

పూజా గృహం ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. పూజ గదిలో స్వస్తికను వేయడం మతపరమైన దృక్కోణంలో కూడా శుభప్రదం. ఇది పూజ చేసేటప్పుడు మనస్సును ఏకాగ్రతగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఇంట్లో డబ్బును భద్రపరిచే స్థలం
ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే డబ్బును ఉంచే స్థలంలో లేదా భద్రపరచిన స్థలంలో స్వస్తికను వేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది డబ్బును సురక్షితంగా ఉంచడంలో, సంపదను పెంచడంలో సహాయపడుతుంది.

వంటగది:
వంటగదిలో ఆహార ధాన్యాల నిల్వ చేస్తారు. అందువల్ల వంటగదిలో స్వస్తిక్ ను ఆహార ధాన్యాల నిల్వ పెంచడమే కాదు ఆహారం కొరత లేకుండా చేస్తుందని నమ్మకం.

స్వస్తిక వేసే సమయంలో గుర్తుంచుకోవలసిన విషయాలు:

స్వస్తిక్ ఎల్లప్పుడూ సవ్య దిశలో వేసుకోవాలి లేదా ఏర్పాటు చేసుకోవాలి. ఎరుపు, పసుపు లేదా ఆకుపచ్చ రంగులతో స్వస్తికను తయారు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. స్వస్తిక్ ను చందనం లేదా కుంకుమతో తయారు చేసుకోవచ్చు. అలాగే స్వస్తిక్ ను శుభ ముహూర్తంలో మాత్రమే వేసుకోవాలి. స్వస్తిక్ పవిత్రమైన చిహ్నం. మతపరమైన దృక్కోణంలో మాత్రమే కాదు వాస్తు శాస్త్రం ప్రకారం కూడా చాలా ముఖ్యమైనది. సరైన స్థలంలో దీన్ని నిర్మించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. సంపద, శ్రేయస్సును తెస్తుంది. కుటుంబంలో ఆనందం, శాంతి వాతావరణాన్ని నిర్వహిస్తుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు