Vastu Tips: మీరు వ్యాపారంలో సక్సెస్ సాధించాలనుకుంటున్నారా .. ఈ ఆఫీసు గదిని ఇలా అలంకరించండి..

|

Jan 26, 2022 | 10:14 AM

Vastu Tips for Business:వాస్తు శాస్త్రం(Vastu Sastra)ప్రకారం, ఇంట్లోనే కాదు ఆఫీసుని రెడీ చేసుకోవడానికి కూడా కొన్ని నియమాలు చేయబడ్డాయి. వాటిని విస్మరించడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి. జీవితంలో

Vastu Tips: మీరు వ్యాపారంలో సక్సెస్ సాధించాలనుకుంటున్నారా .. ఈ ఆఫీసు గదిని ఇలా అలంకరించండి..
Vastu Tips
Follow us on

Vastu Tips for Business:వాస్తు శాస్త్రం(Vastu Sastra)ప్రకారం, ఇంట్లోనే కాదు ఆఫీసుని రెడీ చేసుకోవడానికి కూడా కొన్ని నియమాలు చేయబడ్డాయి. వాటిని విస్మరించడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి. జీవితంలో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. కనుక కొన్ని వాస్తు నియమాలను(Vastu Tips) అనుసరించడం వల్ల వ్యాపారంలో విజయం సాధించడంతోపాటు ఆర్థిక సమస్యలు కూడా దూరంగా ఉంటాయి.

1 వెదురు మొక్క
వెదురు మొక్క ఇంటిలో ఉండడం ఎంత మంచిదో, ఆఫీసులో కూడా అంతే మేలు చేస్తోందని నమ్మకం. వాస్తు ప్రకారం ఆఫీసులోని టేబుల్‌పై వెదురు మొక్కను ఉంచడం వల్ల వ్యాపారంలో అభివృద్ధికి అవకాశం ఉంటుంది. శుభప్రదమని నమ్మకం. అంతేకాదు వెదురు మొక్కను పెంచుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.

2 తాబేలు
వాస్తు ప్రకారం.. లోహంతో చేసిన తాబేలును ఇంటితో పాటు ఆఫీసులో ఉంచడం చాలా శుభప్రదం. ఆఫీసు కోసం ప్రత్యేకమైన తాబేలు తయారు చేస్తారు. ముఖ్యంగా వ్యాపార అభివృద్ధికి పెద్ద తాబేలుపై చిన్న తాబేలు ఉన్న బొమ్మ ఉపయోగపడుతుందని నమ్మకం.

3. క్రిస్టల్ చెట్టు
క్రిస్టల్ చెట్టును ఆఫీసులో ఉంచితే ఆ వ్యాపారవేత్తకు ఆగిపోయిన పని కూడాతిరిగి మొదలవుతుందని అంటున్నారు. వ్యాపారాన్ని వేగవంతం చేయడంలో క్రిస్టల్ ట్రీ సహాయపడుతుందని నమ్ముతారు. అందువల్ల, మీరు కూడా వ్యాపారంలో నిలిచిపోయిన పనిని తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నట్లు అయితే ఈ రోజే క్రిస్టల్ టీని ఆఫీసు లో పెట్టుకోండి.

4.లాఫింగ్ బుద్ధ
లాఫింగ్ బుద్ధ ఇంటితో పాటు ఆఫీసులో కూడా సానుకూల వాతావరణాన్ని ఇస్తుంది. అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం.

5. నాణేలతో చేసిన ఓడ
ఆఫీసులో బంగారు నాణేలతో చేసిన ఓడను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది వ్యాపారానికి ఆర్థిక బలాన్ని తీసుకురాగలదు. ఇతర ఆదాయ వనరులను కూడాకల్పిస్తుందని నమ్మకం.

Note: వాస్తు అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది

Also Read:   ఒక వక్తికి ఈ ఐదు అలవాట్లు ఉంటే డబ్బుల కోసం ఇబ్బంది పడతాడు.. ఈ అలవాట్లను వదిలేయమంటున్న చాణక్య..