Vastu Tips: ఇంట్లో వాస్తు దోషాలను తొలగించి సంపదనిచ్చె పిరమిడ్స్.. ఎలా పెట్టుకోవాలంటే..

|

Feb 06, 2022 | 4:28 PM

Vastu Tips: వాస్తు శాస్త్రంలో, ఇంట్లో సానుకూలతను పెంచడానికి , ప్రతికూలతను తొలగించడానికి అనేక నియమాలను సూచించారు. అనేక చర్యలు చెప్పారు. వాస్తు శాస్త్రం ప్రకారం,.

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషాలను తొలగించి సంపదనిచ్చె పిరమిడ్స్.. ఎలా పెట్టుకోవాలంటే..
Vastu Tips
Follow us on

Vastu Tips: వాస్తు శాస్త్రంలో, ఇంట్లో సానుకూలతను పెంచడానికి , ప్రతికూలతను తొలగించడానికి అనేక నియమాలను సూచించారు. అనేక చర్యలు చెప్పారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో పిరమిడ్లు ఉంటే మంచిదని భావిస్తారు. ఇంట్లో పిరమిడ్ ఉంచడం వల్ల ఇంటి సభ్యుల ఆదాయం పెరుగుతుందని నమ్మకం. అంతేకాదు కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయని భావిస్తారు. ఇంటి సభ్యులు ఎక్కువ సమయం గడిపే ప్రదేశంలో పిరమిడ్‌ను ఉంచడంవలన మంచి ఫలితాలు ఉంటాయని నమ్మకం.

పిరమిడ్ చాలా శక్తిని కలిగి ఉంటుంది. అందువల్ల, అలసిపోయిన వ్యక్తి పిరమిడ్ దగ్గర లేదా పిరమిడ్ ఆకారంలో ఉన్న ఆలయంలో కొంత సమయం పాటు కూర్చుంటే, అతని అలసట తొలగిపోతుంది. అంతేకాదు మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం, పిరమిడ్‌ను ఉత్తరం వైపు ఉంచడం వల్ల సంపద, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇది ఆర్థిక సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం, పిరమిడ్ శరీరానికి కొత్త శక్తిని ఇవ్వడం ద్వారా ఏకాగ్రతను పెంచుతుంది. దీనితో, మీరు శ్రద్ధగా పని చేయవచ్చు. పిల్లలు చదుకునే టేబుల్‌పై స్ఫటిక పిరమిడ్‌ను ఉంచవచ్చు. దీంతో పిల్లల్లో ఏకాగ్రత పెరిగి శ్రద్ధగా చదువుకోగలుగుతారు.

ఇంట్లో వెండి, ఇత్తడి లేదా రాగితో కూడిన పిరమిడ్‌ను ఉంచడం ఉత్తమమని భావిస్తారు, అయితే మీరు ఇంత ఖరీదైన పిరమిడ్‌ను కొనుగోలు చేయలేకపోతే, మీరు చెక్కతో చేసిన పిరమిడ్‌ను కూడా ఉంచవచ్చు. కఅయితే ఎప్పుడైనా సరే ఇనుము, అల్యూమినియం లేదా ప్లాస్టిక్‌తో కూడిన పిరమిడ్‌ని ఇంట్లో పెట్టుకోవద్దు. అంతేకాదు పిరమిడ్ ఫోటోలు కూడా ఇంట్లో ఉంచవద్దు. వీటి వలన ఎటువంటి సహాయం లభించదు.

Note: ఈ వాస్తు టిప్స్ నమ్మకం, విశ్వాసం ఆధారంగా పాఠకుల ఆసక్తిని బట్టి ఇచ్చినవి.

Also Read:

లతాజీ స్వరం దైవదత్తం.. ఆమె అస్తమయం బాధాకరమంటూ సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్