జ్యోతిష్యం ప్రకారం ప్రతి వస్తువుని నిర్దిష్ట స్థానంలో నిర్దిష్ట దిశలో ఉండాలి. వాస్తు శాస్త్రంలో ఇంట్లో ఏర్పాటు చేసే ప్రతి చిన్న, పెద్ద వస్తువు స్థానం గురించి వివరణాత్మక సమాచారాన్ని ఇచ్చారు. వాస్తుశాస్త్రంలో నీరు, గాలి, ఆకాశం, భూమి మూలకాలు వివిధ దిశల గురించి సమాచారాన్ని అందించింది. ఈ అంశాలకు సంబంధించిన విషయాలు ఇంట్లో కూడా పాటించాలి. లేకపోతే వాస్తు దోషం ఏర్పడి ఇబ్బందులు కలగవచ్చు. వాస్తుశాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం నీటి ట్యాంకులు తూర్పు, ఉత్తరం దిశలో ఉండాలి. ఇంట్లో తూర్పు, ఉత్తర దిశల్లో నీటిని ఉంచడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ నియమాన్ని పాటించడంలో వైఫల్యం చెందితే ఆర్థిక నష్టానికి దారి తీస్తుంది. ఇతర సమస్యలు కూడా తలెత్తవచ్చు.
వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉంచకూడదో వాస్తుశాస్త్రంలో పేర్కొంది. వాస్తు ప్రకారం ఆగ్నేయ దిశలో వాటర్ ట్యాంక్ పెట్టకూడదు. ఈ దిశ అగ్ని దిశగా పరిగణించబడుతుంది. అగ్ని, నీటి మధ్య వైరం ఉండడంతో వాస్తుదోషానికి కారణమని భావిస్తారు. అంతేకాదు దక్షిణ దిశలో వాటర్ ట్యాంక్ ఉండటం శుభం కలిగించదని కుటుంబంలో అశాంతిని, ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని నమ్మకం.
నైరుతి దిశలో వాటర్ ట్యాంక్ ఉంచడం కూడా అశుభం. ఈ ప్రదేశంలో నీటిని ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల్లో అనారోగ్యం కలిగే అవకాశం. ఇంటి సభ్యులు అనారోగ్యానికి గురవుతారు. డబ్బు ఖర్చు కూడా అనవసరంగా పెరుగుతుంది. అలాంటి ఇళ్లలో నివసించే వారు కూడా మానసిక ఒత్తిడికి గురవుతారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉంచడానికి ఈశాన్య దిశ సరైనదిగా పరిగణించబడుతుంది. ఈశాన్య దిశలో వాటర్ ట్యాంక్ ఉంచినట్లయితే.. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఈశాన్య దిశలో వాటర్ ట్యాంక్ లేదా తాగే నీరు ఉంచడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు కలుగుతాయి. అంతేకాదు పశ్చిమ దిశలో వాటర్ ట్యాంక్ శుభప్రదంగా భావిస్తారు. ఇంటిలో పడమర దిశలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసినట్లు అయితే.. ఆ ఇంట్లో నివసించే కుటుంబంలో సిరి సంపదలు పెరుగుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)