Best Vastu Tips: చేపట్టిన పనిలో ఆటంకాలా, డబ్బుకి కొరతా.. ఈ వాస్తు చిట్కాలను అనుసరించండి

|

Jun 26, 2023 | 1:58 PM

మీరు చేపట్టిన పని లక్ష్యానికి చేరువైన తర్వాత కూడా విఫలమవుతున్నట్లయితే.. ఇంటికి లేదా ఆఫీసుకి సంబంధించిన వాస్తు దోషం ఉందేమో ఒక్కసారి దృష్టి పెట్టండి. పనిలో ఆటంకాలు ఏర్పడకుండా ఉండేలా చూసే వాస్తు నివారణాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. 

Best Vastu Tips: చేపట్టిన పనిలో ఆటంకాలా, డబ్బుకి కొరతా.. ఈ వాస్తు చిట్కాలను అనుసరించండి
Vastu Tips For House
Follow us on

జీవితంలో మనం చేపట్టిన పనిలో కొన్ని సార్లు అడ్డంకులు ఏర్పడతాయి. అటువంటి పరిస్థితి అకస్మాత్తుగా,  పని పురోగతిలో నిలిచిపోతుంది లేదా అంతవరకూ పడిన కష్టానికి పూర్తి ఫలితం లభించదు. ఇలాంటి ఘటనలు కెరీర్‌, బిజినెస్‌లోనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు చేపట్టిన పని లక్ష్యానికి చేరువైన తర్వాత కూడా విఫలమవుతున్నట్లయితే.. ఇంటికి లేదా ఆఫీసుకి సంబంధించిన వాస్తు దోషం ఉందేమో ఒక్కసారి దృష్టి పెట్టండి. పనిలో ఆటంకాలు ఏర్పడకుండా ఉండేలా చూసే వాస్తు నివారణాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఎవరి ఇంట్లోనైనా దుఃఖం, దురదృష్టం ఉండకూడదని కోరుకుంటే.. ఇంట్లో సాలెపురుగుల గూళ్లు లేకుండా చూసుకోండి. ఇంటి ప్రధాన తలుపును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. శుభ చిహ్నంతో అలంకరించండి.

వృత్తిలో లేదా వ్యాపారంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఆఫీసు కిటికీ లేదా తలుపు వెనుకభాగంలో బీమ్ కింద కూర్చోకూడదు. ఒకవేళ కిటికీ దగ్గర వెనుకభాగంలో కూర్చోవలసి వస్తే.. ఆ కిటికీని ఎల్లప్పుడూ మూసి ఉంచాలి. కర్టెన్‌తో కప్పాలి.

ఇవి కూడా చదవండి

ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఇంట్లో డబ్బులకు ఇబ్బంది పడుతుంటే.. మీరు డబ్బులను పెట్టే  స్థలంలో ఉన్న వాస్తు దోషాలను తొలగించాలి. వాస్తు ప్రకారం, ఇంట్లో సంపద స్థానం ఎల్లప్పుడూ ఉత్తర దిశ.  ఎందుకంటే ఇది కుబేరుడి దిశ. డబ్బులను పెట్టుకునే నగదు పెట్టె లేదా అల్మారా ఎల్లప్పుడూ ఉత్తరం వైపుగా ఉండేలా ఏర్పాటు చేశారు.

ఇంటిలో శుభ కార్యాలు జరగడం లేదని మీరు భావిస్తే.. ఇంటిలో తూర్పు దిశకు సంబంధించిన వాస్తు దోషం ఉందేమో చూడండి. తూర్పు దిశ నుంచి ఇంటికి ఆనందం, అదృష్టం, సానుకూల శక్తి వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ దిశలో బరువైన వస్తువులను ఉంచవద్దు. కాంతి , గాలి వచ్చే వీలుగా తూర్పు దిశను ఖాళీగా ఉంచండి.  ప్రతిరోజూ ఉదయం కొంత సమయం పాటు ఈ దిశ కిటికీలను తెరవండి.

వాస్తు ప్రకారం లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలంటే డబ్బులు పెట్టుకునే ప్లేస్ ను అశుభ్రమైన చేతులతో తాకరాదు. ఆ ప్రాంతంలో మురికి ఉండరాదు. ఐశ్వర్యాన్ని కోరుకునే వారు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చుని అన్నం తింటే డబ్బుకి ఇబ్బందులు కలగవచ్చు. అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బుకు ఎటువంటి కొరత ఉండకూడదని మీరు కోరుకుంటే.. డబ్బులు పెట్టుకునే స్థలం ఖాళీగా ఉంచరాదు. క్యాష్‌బాక్స్‌ తలుపుని పూర్తిగా తెరవద్దు.

వాస్తు ప్రకారం ఇంటికి లేదా వ్యాపారానికి సంబంధించిన డబ్బు పాత రసీదులు, పేపర్లు లేదా ఇతర అనవసరమైన వస్తువులను ఉంచకూడదు. వాస్తు శాస్త్రంలో ఇది పెద్ద లోపంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వలన డబ్బు కొరతను ఎదుర్కోవలసి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇంకా టీవీ9 తెలుగు దీన్ని దృవీకరించడంలేదు.