ప్రతి ఒక్కరూ సొంత ఇంటిని నిర్మించుకోవాలని కోరుకుంటారు. తాము నివసించే ఇల్లు వాస్తు ప్రకారం ఉండాలని.. తద్వారా సుఖ శాంతులు, సిరి సందంపదాలతో జీవించాలని కోరుకుంటారు. అయితే ఇల్లు వాస్తు శాస్త్ర ప్రకారం నిర్మించుకోకపోతే అనేక ఇబ్బందులు పడతాయని నమ్మకం. ఇంటిలో గదులతో పాటు.. ఇంటి ప్రవేశ ద్వారం విషయంలో కూడా వాస్తు నియమాలనున్నాయని వాస్తు శాస్త్రం పేర్కొంది. ఇంట్లో నివసించేవారు సుఖ సంతోషాలతో జీవించాలంటే ప్రధాన ద్వారం సరైన దిశలో ఉండాలి. ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారం అన్ని రకాల శక్తులు ప్రవేశించే ప్రదేశం. ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడటానికి కారణం. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ సానుకూల శక్తితో నిండి ఉండాలి. తద్వారా ఇంట్లో నివసించే వారు సుఖ సంతోషాలతో జీవిస్తారు.
ఇంటి ప్రధాన ద్వారం దక్షిణం వైపు ఉంటే.. అది ఇంటి యజమానికి శుభం కాదు. ఇంట్లో అనేక సమస్యలు తలెత్తవచ్చు. అయితే కొన్నిసార్లు ఇంటిని కొనుగోలు చేసే సమయంలో ప్రధాన ద్వారం దక్షిణం వైపు ఉండి ఉంటుంది. దక్షిణ ద్వారం ప్రతి ఒక్కరికీ అశుభం కలిగిస్తుందనే నమ్మకం లేదు. ఈ రకమైన ఇంటి కోసం కొన్ని ప్రత్యేక వాస్తు నివారణలను ప్రయత్నించమని జ్యోతిష్యులు కొన్ని నివారణ చర్యలు వివరంగా చెప్పారు. అవి ఏమిటో వాస్తు ప్రకారం మంచిదో కాదో తెలుసుకుందాం..
వాస్తు ప్రకారం ఏ ఇంటి ప్రధాన ద్వారం అయినా ఆ ఇంటి నిర్మాణం నిర్మించిన ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఇంటి ప్రధాన ద్వారం సరిగ్గా ఆగ్నేయ దిశలో ఉన్నట్లయితే.. అది ఆ ఇంటి యజమానికి శుభప్రదం కాదు. అయితే ప్రవేశ ద్వారం ఆగ్నేయ, దక్షిణ దిక్కుల మధ్య ఉన్నట్లయితే.. అది ఆ ఇంటి యజమానికి మంచిది. అదే సముంలో ఇంటి ప్రవేశ ద్వారం నైరుతి దిశలో ఉంటే..అలాంటి ఇళ్లలో నివసించవద్దని సలహా ఇస్తారు.
దక్షిణ దిక్కు యమ దిక్కు అని నమ్మకం. అందుకే ఈ దిక్కున ఉన్న ప్రధాన ద్వారం ఉన్న ఇంటిలో నివాసం శ్రేయస్కరం కాదు. మరోవైపు ఇంటి ప్రధాన ద్వారానికి సంబంధించిన ఇతర అంశం గురించి మాట్లాడినట్లయితే.. యమను ధర్మరాజు అని కూడా పిలుస్తారు. అతను న్యాయం, సమగ్రతకు చిహ్నం. అందువల్ల దక్షిణ దిశలో వాస్తు ప్రకారం నిర్మించిన ప్రవేశ ద్వారం కొందరికి కీర్తి, అదృష్టాన్ని తెస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.