Vastu Tips: ఈ మూడు వస్తువులు ఇంట్లో ఉంటే.. అప్పులు ఈజీగా తీరుతాయి.

|

Dec 05, 2022 | 11:38 AM

ప్రతీ మనిషి జీవితంపై వాస్తు ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఇంటి నిర్మాణంలో ఉండే వాస్తు నియమాలు మొదలు, ఇంట్లో ఉండే వస్తువుల వరకు అన్నీ.. మనపై ప్రభావం చూపుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే వాస్తు నియమాల్లో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంటారు...

Vastu Tips: ఈ మూడు వస్తువులు ఇంట్లో ఉంటే.. అప్పులు ఈజీగా తీరుతాయి.
Vastu Tips
Follow us on

ప్రతీ మనిషి జీవితంపై వాస్తు ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఇంటి నిర్మాణంలో ఉండే వాస్తు నియమాలు మొదలు, ఇంట్లో ఉండే వస్తువుల వరకు అన్నీ.. మనపై ప్రభావం చూపుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే వాస్తు నియమాల్లో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంటారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరమైన సమస్యలకు సైతం వాస్తు టిప్స్‌ ఉపయోగపడతాయి. ఇక కొందరు ఎంత సంపాదించిన చేతులో రూపాయి నిల్వదు. డబ్బులు ఎన్ని ఉన్నా అప్పుల కుప్ప మాత్రం తరగదు. దీంతో వచ్చే మొత్తం వడ్డీకలే పోతుంది తప్ప అసలు తీరదు. అయితే ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల అప్పుల బాధ తప్పుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటంటే..

* ఆర్థిక పరిస్థితి మెరుగయ్యి, అప్పుల భారం తగ్గాలంటే ఇంట్లో కచ్చితంగా ఉంచుకోవాల్సిన వస్తువుల్లో విండ్‌ చైమ్స్‌ (గాలికి శబ్ధం చేసేవి) ఒకటి. వీటిని ఇంట్లోని హాల్‌లో వేలాడదీయడం వల్ల ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి. వీటి గంటల శబ్ధం వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్‌ ఎనర్జీ మొత్తం తొలగిపోయి సానుకూలత ఏర్పడుతుంది.

* డబ్బు మూట పట్టుకుని ఉండే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది. దీనివల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోయి, ఆగిన పనులు ముందుకు సాగుతాయి. అయితే లాఫింగ్ బుద్దను కచ్చితంగా వాయువ్య దిశలోనే ఏర్పాటు చేయాలి. అలాగే విగ్రహం పరిమాణం మరీ పెద్దగా ఉండకూడదు.

ఇవి కూడా చదవండి

* ఆర్థిక కష్టాల్లో ఉన్న వారు ఇంట్లో కచ్చితంగా ఉంచుకోవాల్సిన వస్తువుల్లో నాట్యం చేస్తున్నట్లు ఉన్న నెమలి విగ్రహం ఒకటి. దీనిని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడంల వల్ల లక్ష్మీదేవీ అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండ ఉండడంలో, ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. అప్పుల బాధ త్వరగా తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగువతోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..