శనివారం వరూధిని ఏకాదశి .. శ్రీ విష్ణువు ప్రసన్నం కోసం ఏం చేయాలి, ఏం చేయకూడదంటే

|

May 03, 2024 | 12:10 PM

పురాణ గ్రంథాలలో ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనది, ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశి రోజున చేసే ఉపవాసం విష్ణువు అవతారమైన వామనుడి, వరాహ అంకితం చేయబడింది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అన్ని రకాల భయాల నుండి విముక్తి పొంది శుభ ఫలితాలు పొందుతారు. ఎవరైతే వరుథిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆచారాల ప్రకారం పూజిస్తారో వారికి వైకుంఠ ధామం లభిస్తుందని విశ్వాసం. ఈ సంవత్సరం వరుథిని ఏకాదశి వ్రతం 4 మే 2024 న జరుపుకోనున్నారు.

శనివారం వరూధిని ఏకాదశి .. శ్రీ విష్ణువు ప్రసన్నం కోసం ఏం చేయాలి, ఏం చేయకూడదంటే
Varuthini Ekadashi
Follow us on

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో రెండు ఏకాదశి తేదీలు ఉంటాయి. ప్రతి మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథి ఒకటి.. శుక్ల పక్షంలో ఒకటి, ఈ చైత్ర మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని వరుథినీ ఏకాదశి అంటారు. ఈ సంవత్సరం వరుథిని ఏకాదశి వ్రతం 4 మే 2024 న జరుపుకోనున్నారు. పురాణ గ్రంథాలలో ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనది, ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశి రోజున చేసే ఉపవాసం విష్ణువు అవతారమైన వరాహ అవతారానికి అంకితం చేయబడింది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అన్ని రకాల భయాల నుండి విముక్తి పొంది శుభ ఫలితాలు పొందుతారు. ఎవరైతే వరుథిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆచారాల ప్రకారం పూజిస్తారో వారికి వైకుంఠ ధామం లభిస్తుందని విశ్వాసం. అయితే ఏకాదశి వ్రతం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ రోజు మనం పొరపాటున కూడా చేయకూడని పనులు కూడా ఉన్నాయి. ఏకాదశి రోజున ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది తెలుసుకుందాం…

వరుథిని ఏకాదశి నాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు?

  1. ఈ రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. శుభ్రమైన బట్టలు ధరించి, విష్ణువు సన్నిధిలో ఉపవాసం ఉంటానని దీక్ష చేయండి.
  2. వరుథిని ఏకాదశి వ్రతం చేసే సమయంలో పగలు నిద్రపోరాదు. ఇతరులను దూషించడం, అబద్ధాలు చెప్పడం మానుకోవాలి.
  3. ఏకాదశి రోజున మాంసాహారం, మద్యపానం, తామసిక పదార్థాలను సేవించకూడదు.
  4. ఏకాదశి రోజున కోపం తెచ్చుకోరాదు అలాగే ఎవరినీ దుర్భాషలాడకండి.
  5. ఇవి కూడా చదవండి
  6. ఏకాదశి రోజు పొరపాటున కూడా తులసి ఆకులను తెంపకండి. ఏకాదశి రోజున తులసి ఆకులను కట్ చేయడం అశుభంగా భావిస్తారు. అందుకే ఒకరోజు ముందు తులసి ఆకులను తీసి ఉంచండి.
  7. ఏకాదశి తిథి నాడు ఆవు దేశీ నెయ్యి వాడటం మంచిది. ఈ రోజున జుట్టుకు షాంప్ చేసుకోవద్దు. దశమి తిథి నాడు మాత్రమే తలంటుకోవాలి.
  8. ఏకాదశి ఉపవాసం చేసే భక్తులు తప్పనిసరిగా శ్రీమద్ భాగవతం లేదా శ్రీమద్ భగవత్ గీతాన్ని పఠించాలి. విష్ణు మంత్రాలను కూడా పఠించాలి.
  9. ఏకాదశి రోజున అన్నం తినడం నిషిద్ధమని భావిస్తారు. కనుక ఈ రోజు ఉపవాసం ఉండకపోయినా అన్నం తినవద్దు.

వరుథిని ఏకాదశి నాడు ఏం చేయాలి?

ఏకాదశి రోజున విష్ణువును పూజించేటప్పుడు తులసిని సమర్పించండి. విష్ణువుకి తులసి అంటే చాలా ఇష్టం. ఏకాదశి వ్రతం పాటించకపోయినా ఈ రోజున సాత్విక పదార్థాలను మాత్రమే తినండి.

ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి. అంతేకాదు ఏకాదశి రోజున దానధర్మాలు చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. కనుక ఏకాదశి రోజున దానం చేయడం మర్చిపోవద్దు.

వరూథిని ఏకాదశి రోజున లోకానికి ఆధారమైన విష్ణువును, అలాగే సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీ దేవిని పూజించి, రోజంతా భగవంతుని ధ్యానిస్తూ ఉపవాసం పాటించండి. ద్వాదశి తిథి వరకు అంటే ఏకాదశి మరుసటి రోజు వరకు ఏకాదశి ఉపవాసం పాటిస్తారు.

వరుథిని ఏకాదశి నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి
వరుథిని ఏకాదశ ప్రత్యేక రోజున, మాంసం, చేపలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, గుడ్లు, మద్యం మొదలైన వాటికి దూరంగా ఉండండి. వాటిని తీసుకోకుండా ఉండండి. దీనితో పాటు ఈ రోజున ఉపవాసం ఉంటే, ధాన్యాలు, చిక్కుళ్ళు తినవద్దు. ఈ రోజు నూనెలో వండిన ఆహారానికి దూరంగా ఉండండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు