Varalakshmi Vratam 2023: ఈ రోజు వరలక్ష్మి వ్రతం.. లక్ష్మీదేవి ఆరాధనకు శుభ సమయం.. పూజ విధానం

|

Aug 25, 2023 | 7:34 AM

ఆగస్టు 25 శుక్రవారం అంటే ఈరోజు వరలక్ష్మీ మాత పూజకు నాలుగు శుభ ముహూర్తాలు ఉన్నాయి. తొలి శుభ ముహూర్తం ఉదయం 5.55 నుంచి 7.42 వరకు. రెండవ శుభ ముహూర్తం మధ్యాహ్నం 12:17 నుండి 2:36 వరకు. తృతీయ శుభ ముహూర్తం సాయంత్రం 6.22 నుంచి 7.50 వరకు. పూజకు నాల్గవ శుభ సమయం రాత్రి 10:50 నుండి 12:45 వరకు. అయితే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి అత్యంత పవిత్రమైన సమయం ప్రదోషకాలంలో పరిగణించబడుతుంది.

Varalakshmi Vratam 2023: ఈ రోజు వరలక్ష్మి వ్రతం.. లక్ష్మీదేవి ఆరాధనకు శుభ సమయం.. పూజ విధానం
Varalakshmi Vratam 2023
Follow us on

ఈ ఏడాది శ్రావణ మాసం అనేక విధాలుగా ప్రత్యేకతను సంతరించుకుంది. అదనపు మాసం కారణంగా.. శ్రావణ మాసం 60 రోజుల పాటు ఉండనుంది. ఈ నెలలో శివయ్యని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. అంతేకాదు మహిళలు వరలక్ష్మీవ్రతం , మంగళ గౌరీ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తారు. ఈ రోజు శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మీవ్రతాన్ని మహిళలు అత్యంత భక్తిశ్రద్దలతో ఆచరిస్తున్నారు. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం అత్యంత విశిష్టమైనవే.. అయితే పూర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.

వివాహిత స్త్రీలు భర్త దీర్ఘాయుష్షు, సంతాన సౌభాగ్యంతో పాటు ఐశ్వర్యం పెరగాలనే కోరికతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఉత్తర భారతదేశంలో కంటే దక్షిణ భారతదేశంలోనే ఈ వ్రతానికి ప్రాధాన్యత ఎక్కువ. వరలక్ష్మీ వ్రతం ఎలా ఆచరిస్తారో దాని పూజా విధానాన్ని తెలుసుకుందాం..

వరలక్ష్మి వ్రతం  పూజ విధానం

శుక్రవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి.. అభ్యంగ స్నానం చేసి.. గడపకు పసుపు రాసి కుంకుమతో బొట్టుపెడతారు. గుమ్మానికి మామిడాకుల తోరణాలు కడతారు. శుభ్రమైన బట్టలు ధరించి.. తరువాత, ఉపవాసం దీక్ష చేపడతారు. పిండివంటలు రెడీ చేసి.. అనంతరం కొత్త బట్టలు ధరించి .. పూజ కోసం ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. విగ్రహం లేకపోతే లక్ష్మీదేవి చిత్రపటాన్ని కూడా పూజలో ఉంచుకోవచ్చు. అమ్మవారికి కలశాన్ని ఏర్పాటు చేసి.. పూజ చేసి.. వ్రత కథను చదివి పూజ  అనంతరం లక్ష్మీదేవికి పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. అంతరం ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి.. దీర్ఘసుమంగళీ అనే ఆశీర్వాదం తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

వరలక్ష్మీ దేవి ఆరాధనకు అనుకూలమైన సమయం

ఆగస్టు 25 శుక్రవారం అంటే ఈరోజు వరలక్ష్మీ మాత పూజకు నాలుగు శుభ ముహూర్తాలు ఉన్నాయి. తొలి శుభ ముహూర్తం ఉదయం 5.55 నుంచి 7.42 వరకు. రెండవ శుభ ముహూర్తం మధ్యాహ్నం 12:17 నుండి 2:36 వరకు. తృతీయ శుభ ముహూర్తం సాయంత్రం 6.22 నుంచి 7.50 వరకు. పూజకు నాల్గవ శుభ సమయం రాత్రి 10:50 నుండి 12:45 వరకు. అయితే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి అత్యంత పవిత్రమైన సమయం ప్రదోషకాలంలో పరిగణించబడుతుంది. అందుకే సాయంత్రం 6.22 నుండి ప్రారంభమయ్యే ముహూర్తం ఉత్తమమైనది. ఈ కాలంలో పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది..  పేదరికం తొలగిపోతుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)