Jirahi Mata Temple: 700ఏళ్లుగా మత సామరస్యానికి చిహ్నం ఈ అమ్మవారి ఆలయం.. హిందూ, ముస్లింలు పూజలు..

మనదేశంలో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు అనేకం ఉన్నాయి. అయితే ఒక అమ్మవారి ఆలయంలో హిందువులు మాత్రమే కాదు ముస్లింలు కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇలా హిందువులు, ముస్లింలు అమ్మవారికీ పూజలు చేయడం వెనుక 700 సంవత్సరాల నాటి సంఘటనతో ముడిపడి ఉంది. మత సామరస్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న ఆలయం ఉత్తర్ ప్రదేశ్ లో ఉంది. ఈ ఆలయం వెనుక ఒక మర్మమైన కథ ఉంది.

Jirahi Mata Temple: 700ఏళ్లుగా మత సామరస్యానికి చిహ్నం ఈ అమ్మవారి ఆలయం.. హిందూ, ముస్లింలు పూజలు..
Jirahi Mata Temple In Sonbhadra

Updated on: Oct 07, 2025 | 10:01 AM

ఉత్తరప్రదేశ్‌లోని చివరి జిల్లా అయిన సోన్‌భద్ర మతపరమైన, సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లా సరిహద్దులో ఉన్న జుగైల్‌లోని జిర్హి మాతా ఆలయం హిందూ, ముస్లిం మతాల విశ్వాసాల అద్భుతమైన సంగమం. రెండు వర్గాల ప్రజలు అత్యంత భక్తితో మాతృ దేవతకు పూజలు చేస్తారు. శతాబ్దాలుగా, ఈ ఆలయం మత సామరస్యం , ఐక్యతకు చిహ్నంగా ఉంది.

స్థానికులు జిర్హి తల్లి నిర్మలమైన హృదయంతో చేసే పూజ ఎటువంటి కోరికనైనా నెరవేరుస్తుందని నమ్ముతారు. అందుకే మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాలతో సహా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడ పూజలు చేయడానికి వస్తారు. ఈ ఆలయం ప్రత్యేక లక్షణం ఏమిటంటే మతం కంటే మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన ఇద్దరూ అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి వస్తారు.

700 సంవత్సరాల పురాతన ఆలయం.. మర్మమైన కథ
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం సుమారు 700 సంవత్సరాల పురాతనమైనది. ఈ ప్రాంతం ఖార్వార్ రాజవంశం పాలనలో ఉన్నప్పుడు.. ఒక వివాహ ఊరేగింపు ఈ ప్రాంతం గుండా వెళ్ళిందని నమ్ముతారు. ఈ ప్రయాణంలో వివాహ బృందంలోని కొందరు నదిలోని నీరు త్రాగడానికి వెళ్ళారు. అప్పుడు ఆ నదిని సియారి నదిగా గుర్తించారు. ఈ పేరు విన్న వివాహ బృందంలోని ఇద్దరు ముస్లిం సభ్యులు అది తమ మతానికి విరుద్ధమని భావించారు. అయితే వారు అక్కడిక్కడే మరణించారు.

ఇవి కూడా చదవండి

ఇది చూసి వివాహ ఊరేగింపులో భాగమైన జిర్హి దేవి తీవ్ర విచారానికి గురై తన ప్రాణాలను త్యాగం చేసింది. ఆ క్షణంలోనే మొత్తం ఊరేగింపులో ఉన్నవారు అందరూ రాయిగా మారారని చెబుతారు. కాలక్రమేణా, ఈ ప్రదేశంలో జిర్హి మాతకు అంకితం చేయబడిన ఆలయం నిర్మాణం జరుపుకుంది. అప్పటి నుంచి నేటికీ ఇది భక్తులకు అద్భుతమైన ప్రదేశంగా పరిగనిస్తారు.

తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం
ఈ ఆలయంలో ఇప్పటికీ ఖర్వార్ సమాజానికి చెందిన పూజారులు సేవలు అందిస్తున్నారు. వారు తరతరాలుగా పూజా విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ ఆలయం మధ్యప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉంది. ప్రతి సంవత్సరం నవరాత్రి, చైత్ర నవరాత్రి , ఇతర పండుగల సమయంలో వేలాది మంది భక్తులు సందర్శిస్తారు.

మతానికి అతీతమైన భావోద్వేగం
నేటికీ గుప్త కాశీ అని కూడా పిలువబడే సోన్‌భద్రలోని ఈ ఆలయంలో హిందువులు, ముస్లింలు కలిసి పూజలు చేస్తారు. విశ్వాసానికి సరిహద్దులు లేవని నిజమైన భక్తి ఎల్లప్పుడూ హృదయాలను ఏకం చేస్తుందని, విభజించదని జిర్హి మాత ఆలయం ఒక సజీవ ఉదాహరణగా నిలుస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.