తిరుమల శ్రీవారికి భక్తులకు సేవలను సులభతరం చేసేందుకు గాను టీటీడీ ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అన్ని రకాల సేవలను పొందే అవకాశం కల్పించారు. దర్శనం టికెట్ మొదలు, రూమ్ బుకింగ్ చివరికి క్యాలెండర్లు, డైరీలను కూడా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు. దీంతో భక్తులు ఇంటి వద్దే ఉండే అన్ని సేవలను ముందుగానే బుక్ చేసుకోగలుగుతున్నారు.
అయితే ఈ సేవలను పొందే సమయంలో కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఉదాహరణకు కొన్ని సందర్భాల్లో సర్వర్ బిజీగా ఉండడమో, మరే టెక్నికల్ కారణంతో ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేసే సమయంలో ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతుంటాయి. అకౌంట్‌లో నుంచి డబ్బులు కట్ అవుతాయి కానీ టికెట్ బుక్ అవ్వదు. ఇలాంటి సమయాల్లో ఎవరినీ సంప్రదించాలి.? ఎలా డబ్బులను రిఫండ్ పొందాలనే విషయంలో సందిగ్ధత నెలకొంటుంది. ఇలాంటి వారి కోసమే టీటీడీ పలు టోల్ ఫ్రీ నెంబర్లను, ఈమెయిల్ ఐడీలను పొందిపరించింది. డబ్బులు రీఫండ్‌కు సంబంధించి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* టికెట్లు బుక్ చేసుకోవడంలో ఇబ్బంది ఉన్నా, దేవాలయానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ 1555257ను సంప్రదించాలి. ఈ నెంబర్ 24/7 అందుబాటులో ఉంటుంది.
* ఇక రిఫండ్‌కు సంబంధించి ఏదైనా ట్రాన్సాక్షన్ ఫెయిల్ జరిగితే సహజంగా ఏడు రోజుల్లో డబ్బులు రీఫండ్ అవుతాయి అలా కాని పక్షంలో refundservices@tirumala.org ఐడీకి మెయిల్ పంపొచ్చు.
* ఇక ఆన్‌లైన్‌లో రూమ్‌లు బుక్ చేసుకున్న సమయంలో ఏదైనా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయి 7 రోజుల్లో రీఫండ్ అవ్వకపోతే.. 0877-2264590 నెంబర్‌కు సంప్రదించాల్సి ఉంటుంది.
* తిరుమల శ్రీవారి దేవస్థానానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే.. 1800425333333, 18004254141, +91-877-2233333, +91-877-2277777 నెంబర్లకు సంప్రదించొచ్చు.
* ఆన్‌లైన్ సేవలు పొందడానికి టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..