Ugadi 2024: రేపు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అడుగు .. ఈ ఏడాది జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్న పండితులు..
తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ఈ 60 మంది నారదుడి పిల్లల పేర్ల మీదుగా తెలుగు సంవత్సరాలు ఏర్పడ్డాయని పురాణాల కథనం. 60 ఏళ్లు పూర్తి అయితే మళ్ళీ తిరిగి మొదటి ఏడాది మొదలవుతుంది. ఇలా సంవత్సరానికి ఒక్కొక్క పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. అంతేకాదు సంవత్సరాల పేర్లకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది. మొదటి రుతువు వసంత ఋతువు. మొదటి నెల చైత్ర మాసం.. మొదటి తిథి పాడ్యమి.. ఈ రోజునుంచి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది.
తెలుగు నూతన సంవత్సరం ప్రారంభ రోజుగా భావించి ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథిన ఉగాది పర్వదినంగా జరుపుకుంటారు. ఈ పండుగను చాంద్రమానాన్ని అనుసరించి తెలుగు వాళ్ళు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. 2024 హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం రోజుని ఉగాది పండగను జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రతి తెలుగు సంవత్సరానికి ఒకొక్క పేరు ఉంటుంది. ఈ ఏడాది తెలుగు సంవత్సరాన్ని శ్రీ క్రోధి నామ సంవత్సరం అంటారు. క్రోధం అంటే అర్ధం కోపం.. కనుక ఈ ఏడాది క్రోధి నామ సంవత్సరం కనుక ప్రజలు ఎక్కువ కోపం, ఆవేశం కలిగి ఉంటారని పండితులు చెబుతున్నారు. అంతేకాదు కుటుంబ సభ్యుల మధ్య ఆగ్రహావేశాలు కలగడం, దేశంలో రాష్ట్రాల మధ్య విబేధాలు, భిన్నాభిప్రాయాలు, కోపం, ఆగ్రహం కలుగుతాయని, దేశాల యుద్ధ వాతావరణం నెలకొంటుందని, ఎక్కువగా యుద్ధాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ క్రోధి నామ సంవత్సరం తెలుగు సంవత్సరాల్లో ఎన్నోది.. అసలు తెలుగు సంవత్సరాలు ఎన్ని? ఆ పేర్ల వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం..
తెలుగు సంవత్సరాలు ఎన్ని అంటే?
తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ఈ 60 మంది నారదుడి పిల్లల పేర్ల మీదుగా తెలుగు సంవత్సరాలు ఏర్పడ్డాయని పురాణాల కథనం. 60 ఏళ్లు పూర్తి అయితే మళ్ళీ తిరిగి మొదటి ఏడాది మొదలవుతుంది. ఇలా సంవత్సరానికి ఒక్కొక్క పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. అంతేకాదు సంవత్సరాల పేర్లకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది. మొదటి రుతువు వసంత ఋతువు. మొదటి నెల చైత్ర మాసం.. మొదటి తిథి పాడ్యమి.. ఈ రోజునుంచి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది.
తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక కథ ఏమిటంటే
బ్రహ్మ తనయుడు విష్ణు మానస పుత్రుడు నారదుడి బ్రహ్మచారి అన్న సంగతి తెలిసిందే.. అయితే పురాణాల్లో నారదుడి పిల్లలే తెలుగు నెలలుగా పేర్కొన్నాయి. దీనికి కారణం.. నారదుడి గర్వం తలకేక్కినట్లు భావించిన శ్రీ మహా విష్ణువు అతడి గర్వాన్ని అణచాలని భావించాడు. దీంతోనారదుడిని మాయ అనే స్త్రీగా చేశాడు. స్త్రీ రూపంలో ఉన్న మాయను ఒక రాజు మోహించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 60 మంది పిల్లలు. వీరు ఒక యుద్ధంలో అకాల మరణం పొందుతారు. అప్పుడు విష్ణువు తన మాయను తొలగించి నారదుడిగా మార్చాడు. అంతేకాదు నీకు కలిగిన సంతానం 60 మంది గుర్తుగా సంవత్సరాలు ఏర్పడతాయని వరం ఇచ్చాడని పురాణాల కథనం.
నారదుడి 60 మంది పిల్లలు తెలుగు సంవత్సరాల పేర్లు.. అర్ధం
ప్రభవ: ప్రభవ అంటే… ప్రభవించునది… అంటే… పుట్టుక. యజ్ఞ, యాగాలు అధికంగా చేస్తారు
విభవ: వైభవంగా ఉండేది సుఖంగా జీవిస్తారు
శుక్ల : అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.సమృద్ధిగా పంటలు పండుతాయి
ప్రమోద్యుత: ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత. అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది
ప్రజోత్పత్తి: ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి. ప్రతిదానిలోనూ అభివృద్ధి
అంగీరస:అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం. భోగ భాగ్యాలు కలుగుతాయి
శ్రీముఖ: శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం. వనరులు అధికంగా ఉంటాయి
భావ : భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.ఉన్నత భావాలు కలిగి ఉంటారు
యువ : యువ అనేది బలానికి ప్రతీక. వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి
ధాత : అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు. అనారోగ్య బాధలు తగ్గుతాయి