Tuesday Puja: కుజ దోష నివారణకు మంగళవారం ఉపవాస దీక్ష, పూజ విధానం ఏమిటంటే?

|

Oct 03, 2023 | 8:10 AM

ఎవరైనా కుజ దోషంతో బాధపడుతున్నట్లయితే.. దోష నివారణకు మంగళవారం ఉపవాసం ఉండడం వలన  ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. హనుమంతుడిని నిష్టతో పూజిస్తే మంగళ దోషం తొలగిపోతుంది. ఎవరి ఇంట్లోనైనా ఆర్థిక సంక్షోభం తలెత్తినా.. అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్నా మంగళవారం ఉపవాసం ఉండాలి. ఉపవాసం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. మంగళవారం ఉపవాసం ఉండటం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

Tuesday Puja: కుజ దోష నివారణకు మంగళవారం ఉపవాస దీక్ష, పూజ విధానం ఏమిటంటే?
Lord Hanuman
Follow us on

మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున ఉపవాసం, పూజలు చేయడం ద్వారావ్  బజరంగబలి ఆశీర్వాదం పొందవచ్చు అని భక్తుల నమ్మకం. ప్రతిరోజూ హనుమంతుడిని పూజించినప్పటికీ, మంగళవారం రోజున చేసే హనుమంతుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శనిదోషం ఉన్నవారు మంగళవారం ఉపవాసం ఉంటే శనిదోషం తొలగిపోతుందని విశ్వాసం.

మంగళవారం ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు

ఎవరైనా కుజ దోషంతో బాధపడుతున్నట్లయితే.. దోష నివారణకు మంగళవారం ఉపవాసం ఉండడం వలన  ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. హనుమంతుడిని నిష్టతో పూజిస్తే మంగళ దోషం తొలగిపోతుంది. ఎవరి ఇంట్లోనైనా ఆర్థిక సంక్షోభం తలెత్తినా.. అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్నా మంగళవారం ఉపవాసం ఉండాలి. ఉపవాసం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. మంగళవారం ఉపవాసం ఉండటం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. హనుమంతుడిని సంకట మోచనుడు అని పిలుస్తారు. అందుకే మంగళవారం హనుమంతుడిని పూజించి ఉపవాసాన్ని పాటించడం ద్వారా అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం.

ఉపవాస దీక్ష ఎలా చేపట్టాలంటే

ఏ నెలలోనైనా శుక్ల పక్షంలోని మొదటి మంగళవారం నుండి మంగళవారం ఉపవాస దీక్ష ప్రారంభించవచ్చు,  21 రోజుల పాటు ఉపవాసం చేయడం అత్యంత ఫలవంతం. 21 రోజుల పాటు ఉపవాసం ఉండటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంతేకాదు మంగళవారం నాడు బజరంగ బాన్, సుందర కాండను పఠించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

మంగళవారం పూజ విధానం ఏమిటి?

మంగళవారం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి ఉపవాస దీక్ష మొదలు పెట్టండి. ఇంటి ఈశాన్య మూలలో ఒక పీఠాన్ని ఎర్రటి వస్త్రాన్ని పరచి, హనుమంతుడి  చిత్రాన్ని ఉంచాలి. హనుమంతునితో పాటు సీతారాములను పూజించడం ద్వారా ఎవరైనా ఉపవాస ఫలితాలు త్వరగా పొందుతారు. నైవేద్యంలో భాగంగా బూందీ లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం పెట్టె ఆహారంలో తులసి ఆకులను వేయడం అత్యంత ఫలవంతం.

బజరంగ బలికి తులసి ఆకులంటే చాలా ఇష్టమని విశ్వాసం. పూజ సమయంలో సింధూరాన్ని సమర్పించండి. అంతేకాదు పూజలో బజరంగ బలికి ఎర్రటి పువ్వులు సమర్పించండి. పూజ సమయంలో హనుమాన్ చాలీసా తప్పకుండా చదవండి. పూజ చేసి, ఆరతి ఇచ్చి అనంతరం అందరికీ ప్రసాదం పంచిపెట్టండి. సాయంత్రం కూడా మరోసారి బజరంగబలిని పూజించి, ఆరతి ఇచ్చి తర్వాత సాయంత్రం స్వీట్ తో కూడిన భోజనం చేయవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.