Tirumala: ఈ శ్రీవారి సేవా టికెట్‌ ధర అక్షరాల కోటిన్నర రూపాయలు.. విశేషాలంటంటే..

అయితే భక్తుల కోసం కోటి రూపాయల విలువైన సేవా టికెట్ కూడా ఉందని మీకు తెలుసా.? ఇంతకీ ఏంటా సేవ.? ఇంత ధర ఎందుకు లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాస్తమానసేవ పేరుతో అందిస్తోన్న ఈ ప్రత్యేక సేవ టికెట్ ధర కోటి రూపాయలకు పైమాటే. ఈ సేవా టికెట్ బుక్‌ చేసుకుంటే జీవితాంతం శ్రీవారి సేవల్లో పాల్గొనవచ్చు...

Tirumala: ఈ శ్రీవారి సేవా టికెట్‌ ధర అక్షరాల కోటిన్నర రూపాయలు.. విశేషాలంటంటే..
TTD
Follow us

|

Updated on: Sep 29, 2024 | 10:20 AM

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవాలని భక్తజనం ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఏడాదిలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకునే వారు కోట్లాది మంది ఉంటారు. దేశనలుమూలల నుంచి ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కొన్నా సరే తిరుమలకు వస్తుంటారు. ఇక శ్రీవారికి అందించే సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భక్తులు వారి ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా కొన్ని రకాల సేవా టికెట్లను కొనుగోలు చేసి స్వామి వారి ఆశీస్సులు పొందుతుంటారు.

అయితే భక్తుల కోసం కోటి రూపాయల విలువైన సేవా టికెట్ కూడా ఉందని మీకు తెలుసా.? ఇంతకీ ఏంటా సేవ.? ఇంత ధర ఎందుకు లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాస్తమానసేవ పేరుతో అందిస్తోన్న ఈ ప్రత్యేక సేవ టికెట్ ధర కోటి రూపాయలకు పైమాటే. ఈ సేవా టికెట్ బుక్‌ చేసుకుంటే జీవితాంతం శ్రీవారి సేవల్లో పాల్గొనవచ్చు. శ్రీవారినిక ప్రతీ రోజు ఎన్నో కైంకర్యాలను నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఉదయం సుప్రభాతం నుంచి సాయంత్రం సహస్రదీపాలంకార సేవ వరకూ జరిగే పూజలను కనులారా వీక్షించాలని ఎందరో భక్తులూ కోరుకుంటారు.

ఈ ఉదాయాస్తమానసేవ టికెట్‌ను తీసుకుంటే ఏడాదిలో ఒకరోజు ఉదయం నుంచి మొదలు సాయంత్రం వరకు అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారిని కనులారా వీక్షించవచ్చు. ఉదయాస్తమాన సర్వసేవ(యూఎస్‌ఎస్‌ఈఎస్‌) పేరుతో తొలిసారి 1980లో ఈ సేవా టికెట్‌ను ప్రారంభించారు. అయితే ఆ తర్వాత పోటీ పెరిగిన నేపథ్యంలో కొన్నేళ్లపాటు ఆపేసి మళ్లీ 2021లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరు రోజులకు రూ. కోటి కాగా, శుక్రవారం మాత్రం ఈ టికెట్ విలువ రూ. కోటిన్నర. ప్రస్తుతం 347 సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. శుక్రవారానికి సంబంధించి మాత్రం అన్ని టికెట్స్‌ బుక్‌ కావడం విశేషం. ఏడాదిలో నచ్చిన రోజును టికెట్ కొనుగోలు చేసి బుక్‌ చేసుకోవచ్చు.

దీంతో ఏడాదిలో ఒకరోజంతా వెంకటేశ్వరుడి సేవలో భాగం కావొచ్చన్నమాట. ఈ టికెట్ బుక్‌ చేసుకున్న వ్యక్తితో పాటు ఆరుగురు కుటుంబసభ్యులనూ అనుమతిస్తారు. కంపెనీ పేరుతో పొందిన వారికి 20 సంవత్సరాల పాటు ఈ అవకాశాన్ని వాడుకునే వీలు ఉంది. ఈ సేవలో పాల్గొన్న వారికి స్వామికి అర్పించిన వస్త్రాలూ, ప్రసాదాలూ అందిస్తారు. కుటుంబసభ్యుల పేర్ల నమోదు, తొలగింపు, మార్పునకు ఒకేసారి అవకాశం ఉంటుంది. ఈ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే టీటీడీ అధికారిక వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..