తిరుమల కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందినది. అయితే ఆ దేవ దేవుడికి భక్తులు నగలు, కరెన్సీ రూపంలో చెల్లించుకుంటారు. ఇలా తిరుమల శ్రీవారి హుండీలో విదేశీ కరెన్సీ నోట్లు కానుకలుగా వచ్చి చేరుతున్నాయి. భక్తులు విదేశీ కరెన్సీ నోట్లను హుండీలో కానుకలుగా సమర్పిస్తున్నారు. ప్రపంచంలోని 195 దేశాలుగాను.. శ్రీవారి హుండీలో 157 దేశాల కరెన్సీ నోట్లను భక్తులు సమర్పించారు. అత్యధికంగా మలేషియా కరేన్సి నోట్లు 46 శాతం కాగా.. తరువాత స్థానంలో యూఎస్ డాలర్ల నోట్లు 16 శాతం ఉన్నాయి. 2019-20 సంవత్సరంలో రూ.4.73 లక్షల విదేశీ కరెన్సీ నోట్లతో స్వామివారికి 27.49 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. కాగా 20-21 సంవత్సరంలో విదేశీ ఆదాయంపై కోవిడ్ ప్రభావం చూపింది. 2020-21లో 30 వేల 300 విదేశీ నోట్లతో రూ.1.92 కోట్లకు హుండీ ఆదాయం పరిమితమైంది. స్వామివారికి భక్తులు పాకిస్థాన్ నోట్లను కానుకగా సమర్పిస్తున్నారు.
అయితే వారు సమర్పించుకునే కానుకల్లో భారీగా విదేశీ నాణాలు కూడా ఉంటున్నాయి. తిరుమల శ్రీవారికి భక్తులు కానుకగా సమర్పించిన యుఎస్ఏ, మలేషియా దేశాలకు చెందిన నాణేలను మార్చి 10వ తేదీన ఈ-వేలం వేయనున్నారు. మలేషియా నాణేలకు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, యుఎస్ఏ నాణేలకు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ-వేలం జరుగనుంది. ఇతర వివరాల కోసం మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ లేదా వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించగలరు.
హుండీలో భక్తులు వేసిన డబ్బును, నగలను వేరు చేసి లెక్కించే దేవస్థానం ఖజానాకు పంపించే తంతును “పరకామణి” అంటారు. ఇది రెండు విడతలుగా జరుగుతుంది. రాత్రి హుండీని దేవస్థాన ఉద్యోగులు ఉదయం లెక్కిస్తారు. ఉదయం విప్పిన హుండీని మధ్యాహ్నం లెక్కిస్తారు. రాత్రి నిద్రించిన హుండీని “తోకముల్లె” అని అంటారు. కొప్పెరలో మనడబ్బే కాదు విదేశీ కరెన్సీ, నాణేలు కూడా భక్తులు వేస్తుంటారు. హుండీ ద్వారా వచ్చే పట్టువస్త్రాలను దేవస్థానం వారు తమ పరధిలోని ఆలయాలలో కావలసిన సేవలకు, పండుగలకు ఉపయోగించుకుంటారు.
అలా ఉపయోగించలేక పోయిన పట్టువస్త్రాలను, నగలను, బంగారు వస్తువులను, వజ్రాలు పొదిగిన ఆభరణాలను, వెండి వస్తువులను వేలం వేస్తారు లేకపోతే విలువైన, నాణ్యమైన వాటిని శ్రీవారి ఖజానాలో భద్రపరుస్తారు.
ఇవి కూడా చదవండి: History of Chicken 65: యమ్మీ..యమ్మీ.. చికెన్ 65.. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..
Telangana BJP: బండెనక బండి కట్టి.. నియోజకవర్గాలకు దూరమవుతున్న ఆ కమలం నేతలు..