TTD Hundi Collection : తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు ఆదాయం.. మూడు వారాల్లోనే రూ.100కోట్లకు పైగా..

|

Jul 23, 2022 | 8:57 PM

ఇకపోతే.. ఈ నెల 5న భక్తులు శ్రీవారికి రూ.6.18 కోట్ల కానుకల్ని హుండీలో సమర్పించుకున్నారు.  ఇలా ఒక్క రోజులో 6 కోట్ల పైచీలుకు ఆదాయం రావడం తిరుమల చరిత్రలో ఇది రెండోసారి.

TTD Hundi Collection : తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు ఆదాయం.. మూడు వారాల్లోనే రూ.100కోట్లకు పైగా..
Ttd Hundi Income
Follow us on

TTD Hundi Collection : తిరుమల శ్రీనివాసుడి పెళ్లి రోజు కుబేరుడు కాసుల వర్షం కురిపించాడని అంటారు. తాజాగా అలాంటి కాసుల వర్షమే తిరుమల శ్రీవారి హుండీలో కురుస్తోంది. తిరుమల వెంకన్న దర్శనం, మొక్కులు తీర్చుకునేందుకు ఏడుకొండలకు భారీగా క్యూ కడుతున్నారు భక్తులు. కుండపోత వర్షాలను సైతం లెక్కచేయకుండా శ్రీవారి భక్తులు తిరుమలకు బారులు తీరుతున్నారు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా బాగా పెరిగింది. ప్రతి నెలా శ్రీనివాసుడి హుండీ ఆదాయం ఏ నెలకు ఆ నెల రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ జూలై నెలలోనే తొలి 21 రోజుల్లో రూ.100 కోట్ల 75 లక్షల ఆదాయం వచ్చింది.

జూలై నెలలో టీటీడీ (ttd) చరిత్రలోనే అత్యధిక స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు గత మే నెలలో రూ.130 కోట్లే అత్యధిక హుండీ ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలో మొదటిసారి శ్రీవారికి రూ.140 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం వుందని అధికారులు భావిస్తున్నారు. ఇకపోతే.. ఈ నెల 5న భక్తులు శ్రీవారికి రూ.6.18 కోట్ల కానుకల్ని హుండీలో సమర్పించుకున్నారు.  ఇలా ఒక్క రోజులో 6 కోట్ల పైచీలుకు ఆదాయం రావడం తిరుమల చరిత్రలో ఇది రెండోసారి.

గతంలో 2018 జూలై 26న రూ.6.28 కోట్ల కానుకల్ని హుండీలో వేశారు భక్తులు. గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా తిరుమలకు రాలేని భక్తులు.. ఇప్పుడు పరిస్ధితులు కుదుటపడటంతో పోటెత్తుతున్నారు. ఈ కారణం చేతనే హుండీ ఆదాయం రికార్డులు సృష్టిస్తోందని అధికారులు అంటున్నారు. ఇకపోతే వేసవి సెలవుల కారణంగా గడిచిన నాలుగు నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటుతోన్న సంగతి తెలిసిందే. ఇదే జోరు కొనసాగితే మాత్రం ఈ ఏడాది శ్రీవారి ఆదాయం రూ.1,500 కోట్లు దాటుతుందని టీడీడీ అంచనా వేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి