TTD: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. 7 రోజుల పాటు ఈ సేవలు రద్దు..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. అలిపిరిలోని శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టిక్కెట్ల బుకింగ్ లో తాత్కాలిక మార్పులు చేసింది. కొన్ని మరమ్మత్తు పనుల కారణంగా ఈ టికెట్లను ఏడు రోజుల పాటు రద్దు చేసింది. ఈ మార్పుల పూర్తి వివరాలు, భక్తులు గమనించాల్సిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

TTD: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. 7 రోజుల పాటు ఈ సేవలు రద్దు..
Ttd Announcement

Updated on: Sep 02, 2025 | 8:12 PM

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అలిపిరిలో జరిగే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 7 నుండి సెప్టెంబర్ 13 వరకు, మొత్తం ఏడు రోజుల పాటు ఈ హోమం కోసం ఆన్‌లైన్ టికెట్లను నిలిపివేస్తున్నట్లు టీటీడీ తెలియజేసింది.

హోమం జరిగే ప్రదేశంలో కొన్ని నవనీకరణ పనులు, అలాగే అడ్డుగా ఉన్న చెట్లను తొలగించడం అవసరం. ఈ పనులు జరుగుతున్న కారణంగా భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. ఈ ఏడు రోజుల పాటు హోమం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండవు.

అయితే, హోమాన్ని పూర్తిగా నిలిపివేయడం లేదు. ఈ ఏడు రోజులు హోమంను మరోచోట ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ కారణంగా ఆన్ లైన్ లో టికెట్లు లభించవు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని టీటీడీ విజ్ఞప్తి చేసింది. సెప్టెంబర్ నెలలోని ఇతర రోజులలో, విశేష హోమం టికెట్లు ఆన్‌లైన్‌లో యథావిధిగా అందుబాటులో ఉంటాయి. భక్తుల సహకారం కోరుతున్నారు.