Muchintal: సహాస్రాబ్ది ఉత్సవాలు విజయవంతం కావడంలో వారి పాత్ర గొప్పది.. త్రిదండి చినజీయర్ స్వామి.

|

Mar 04, 2022 | 11:46 PM

Muchintal: హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లో ఉన్న శ్రీరామనగరం ముచ్చింతల్‌లో (Muchintal) రామానుజాచార్యుల సహాస్రాబ్ది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మహా క్రతువుకు రాష్ట్రపతి మొదలు ప్రధాని నుంచి పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు..

Muchintal: సహాస్రాబ్ది ఉత్సవాలు విజయవంతం కావడంలో వారి పాత్ర గొప్పది.. త్రిదండి చినజీయర్ స్వామి.
Chinna Jeeyar Swamy
Follow us on

Muchintal: హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లో ఉన్న శ్రీరామనగరం ముచ్చింతల్‌లో (Muchintal) రామానుజాచార్యుల సహాస్రాబ్ది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మహా క్రతువుకు రాష్ట్రపతి మొదలు ప్రధాని నుంచి పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా కన్నుల పండువగా సాగిన ఉత్సవాలు విజయంతంగా ముగియడంపై శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి తాజాగా మాట్లాడారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘శ్రీ శ్రీ రామానుజ సహాస్రాబ్ది ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో వికాస తరంగిణి వాలింటీర్లు సమర్ధవంతంగా పని చేశారు. సమతా మూర్తి సహాస్రాబ్ది ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో వాలింటీర్లు ముఖ్య భూమిక పోషించార’ని చినజీయర్‌ ప్రశంసలు కురిపించారు.

శ్రీమన్నారాయణ అనుగ్రహంతో శ్రీ లక్ష్మీ నరసింహ క్రతువును ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకున్నామని చినజీయర్‌ అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. అందుకు వికాస తరంగిణి సంస్థ చేదోడు వాదోడుగా నిలుస్తుందని స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుమారు 10 వేల వికాస తరంగిణి వాలింటీర్లకు చినజీయర్‌ స్వామి సన్మానం చేసి, మంగళ శాసనాలు అందించారు. ఈ సన్మాన కార్యక్రమంలో చినజీయర్‌ స్వామితో పాటు అహోబిలం స్వామిజీ, తదితరులు పాల్గొన్నారు.

Also Read: Rana Daggubati : పాన్ ఇండియా యాక్టర్ క్రెడిట్ ను కాపాడుకుంటున్న దగ్గుబాటి కుర్ర హీరో..

Viral Video: పిల్లే అయినా పులిలా వేటాడింది.. వీడియో చూస్తే అవాక్ అవ్వాల్సిందే..

ఫేస్ బుక్ తో పరిచయమై.. డబ్బులున్నాయని నమ్మించి, ఆపై నట్టేట ముంచి.. సీన్ కట్ చేస్తే