Chilli Powder Bath: గ్రామస్థుల కోసం.. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 108 కేజీల కారంతో స్నానం చేసిన పూజారి ఎక్కడంటే

|

Aug 10, 2021 | 7:20 AM

Bath With Chili Powder Water: ఇప్పటి వరకూ మనం ఇష్టమైన రాజకీయనేతలకు, సినీ హీరోలకు పాలాభిషేకం చేయడం చూశాం.. ఇంకా కొంతమంది శరీరం అందంకోసం చందనం, గులాబీ రేకులతో స్నానం చేస్తారని తెలుసు.. కానీ ఆచారం పేరుతో..

Chilli Powder Bath: గ్రామస్థుల కోసం.. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 108 కేజీల కారంతో స్నానం చేసిన పూజారి ఎక్కడంటే
Bath With Cilli
Follow us on

Bath With Chili Powder Water: ఇప్పటి వరకూ మనం ఇష్టమైన రాజకీయనేతలకు, సినీ హీరోలకు పాలాభిషేకం చేయడం చూశాం.. ఇంకా కొంతమంది శరీరం అందంకోసం చందనం, గులాబీ రేకులతో స్నానం చేస్తారని తెలుసు.. కానీ ఆచారం పేరుతో ఊరికి మంచి జరుగుతుందంటూ ..పూజారికి కారం స్నానం చేయించారు.. వివరాల్లోకి వెళ్తే..

కూరల్లో కారం కొంచెం ఎక్కువైనా.. చేతికి గాయం అయితే.. దానికి కారం తగిలినా మనం అల్లాడిపోతాం.. అలాంటిది ఒక పూజారి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 108 కేజీల కారం కలిపిన నీటితో స్నామాచరించాడు.. ఈ ఘటన ఆదివారం.. అమావాస్య అంటూ తమిళనాడులో జరిగిన వినూత్న పూజా కార్యక్రమం..

ధర్మపురి జిల్లాలోని నడపనహళ్లి గ్రామంలో ప్రతి ఏటా ఆది అమావాస్య రోజున గ్రామస్థులు సామూహికంగా వేడుకలను నిర్వహిస్తారు. ఆ గ్రామ దైవం పెరియ కరుప్పసామికి పాలు, కారంపొడితో అభిషేకం చేస్తారు. నైవేద్యంగా మద్యం, సిగరెట్లను సమర్పిస్తారు. సాంప్రదాయ వేడుకల్లో గ్రామంగా గ్రామదేవతకు పూజాకార్యక్రమాలు నిర్వహించే పూజారి.. గోవిందం రెండు కొడవళ్ళపై నిలబడి.. భక్తుల సమస్యలను వింటాడు.. అనంతరం ‘కారం యజ్ఞనాన్ని నిర్వహిస్తాడు.

అప్పుడు పూజారి కోడవలిని పట్టుకుని కూర్చుంటాడు. అప్పుడు భక్తులు 108 కేజీల కారం కలిపిన నీళ్లను.. పూజారి తలపై నుంచి పోసి.. అభిషేకం చేస్తారు. ఇలా కారంతో పూజారికి అభిషేకం చేస్తే.. తమలో దుష్టశక్తులు, దురదృష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. భక్తులు కారం అభిషేకం చేస్తున్న సమయంలో పూజారి గోవిందం కదలడు మెదలడు. ఉలకడు.. పలకడు..అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులు కారం మరకలు పోయేటంత వరకూ నీటితో స్నానం చేయిస్తారు.. అయితే కారం నీటితో అభిషేకం చేసే సమయంలో అక్కడ ఉన్న భక్తులు మాత్రం ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఇదంతా.. ఆ దేవుడి మహిమ అంటారు అక్కడివారు..

Also Read: Mangala Gauri Puja: నేడు శ్రావణ మంగళవారం.. ఈనెలలో మంగళగౌరీ వ్రతం చేసే విధానం.. విశిష్టత ఏమిటంటే..