Vijay Devarakonda: ఫ్యామిలీతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ.. సెల్ఫీల కోసం భక్తులు ఉత్సాహం

|

Oct 10, 2021 | 3:47 PM

Vijay Devarakonda: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవర కొండ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ దర్శనంలో..

Vijay Devarakonda: ఫ్యామిలీతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ.. సెల్ఫీల కోసం భక్తులు ఉత్సాహం
Vijay Devarakonda
Follow us on

Vijay Devarakonda: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవర కొండ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ దర్శన సమయంలో తన తమ్ముడు హీరో ఆనంద్ దేవరకొండ తల్లిదండ్రులతో కలిసి . వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నాడు. ఆలయ అర్చకులు దగ్గరుండి విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు వెంకటేశ్వరస్వామి దర్శనం చేయించారు. అనంతరం అర్చకులు ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలను అందించారు. అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించారు. విజయ్ దేవరకొండను చుడాడనికి సెల్ఫీలు తీసుకోవడానికి ఆలయం వెలుపల భక్తులు ఉత్సాహం చూపించారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రీడానేపధ్యంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఒకే సారి తెలుగు,హిందీ, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. . అనన్య పాండే హీరోయిన్‌గా బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కీలక, సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బాక్సింగ్‌ చాంపియన్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించారు నటిస్తోంది. పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  ఇప్పటికే ఫస్ట్ లుక్ తో సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: Navratri 5th Day Naivedyam: రేపు నవరాత్రి ఐదోరోజు.. అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం.. ఎలా తయారు చేయాలంటే