Tirumala Laddu: తిరుమల లడ్డూలో కూడా రకాలుంటాయని మీకు తెల్సా..? ఏయే సందర్బాల్లో ఇస్తారంటే

|

Aug 28, 2022 | 7:26 PM

తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో లడ్డు ప్రధానమైంది. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దొరికే అన్ని లడ్డుల కంటే తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముక్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు.

Tirumala Laddu: తిరుమల లడ్డూలో కూడా రకాలుంటాయని మీకు తెల్సా..? ఏయే సందర్బాల్లో ఇస్తారంటే
Tirumala Laddu
Follow us on

Tirumala Laddu: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. వెంకన్నను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కొండకు చేరుకుంటారు. దివ్యమంగళుడి రూపం శ్రీవారిని దర్శించుకుని జన్మ ధన్యమైనట్లు భావిస్తారు. అయితే తిరుమల ఎంత ఫేమస్సో..  తిరుపతి లడ్డులు కూడా అంతే ఫేమస్. తిరుమలకు వెళ్లే భక్తులకే కాదు.. భక్తులు తీసుకొచ్చే లడ్డుల కోసం ఎంతో ఇష్టంగా అందరూ ఎదురుచూస్తూ ఉంటారు.

అవును తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో లడ్డు ప్రధానమైంది. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దొరికే అన్ని లడ్డుల కంటే తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముక్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇక్కడ దొరికే లడ్డు రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. అందుకే ఈ లడ్డుకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు (Geographical Patent) లభించింది. కనుక తిరుపతి లడ్డు తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడాదు.

తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రతిరోజూ ఇంచుమించు మూడు లక్షల లడ్లు తయారు చేస్తారు. గతంలో కట్టెలపొయ్యి మీద తయారు చేసేవారు. నేడు ఆవిరి పొయ్యిలను (సుమారుగా 48 పొయ్యిలు) వాడుతున్నారు. దాదాపు 700 మంది పోటు కార్మికులు లడ్డు తయారీలో పని చేస్తున్నారు. ప్రస్తుతం మూడు రకాల లడ్డూలను తయారు చేస్తున్నారు అవి ఏమిటో తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ఆస్థాన లడ్డు: వీటిని ప్రత్యేక సందర్భాల్లో తయారు చేసి అత్యంత ప్రముఖులకు, ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. సాధారణంగా ఈ లడ్డూల విక్రయం జరగదు. దీని బరువు 750 గ్రాములు. వీటి తయారీలో  అధిక మొత్తంలో నెయ్యి, సారపప్పు, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వు వంటి ప్రత్యేక దినుసుల్ని ఉపయోగిస్తారు. దీని రుచి మాత్రం అమోఘం. మాటల్లో చెప్పలేం. అంత అద్భుతంగా ఉంటుంది.

కళ్యాణోత్సవ లడ్డు: కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొన్న గృహస్తులకు, భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. సుమారుగా 700 గ్రాముల బరువుంటుంది. కళ్యాణోత్సవం మరికొన్ని ఇతరసేవల్లో పాల్గొన్న భక్తులు. ఈ లడ్డూలను దర్శనానంతరం సంపంగి ప్రాకారంలో గల “వగపడి”లో లభిస్తాయి. ఇప్పుడు కౌంటర్ లో కల్యాణోత్సవ లడ్డులు అమ్ముతున్నారు దీని ధర ఒకటి రూ. 200/-

సాధారణ లడ్డు: వీటిని ప్రోక్తం లడ్డూ అని కూడా అంటారు.వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు. ఈ లడ్డూలను, లెక్కగా, ఆలయం వెనుక భాగాన ఉన్న లడ్డూ కౌంటర్లలో విక్రయిస్తారు. కొన్ని రకాల ఆర్జితసేవల్లో పాల్గొన్న భక్తులకు ఉచితంగా కూడా ఇస్తారు. దీని బరువు సుమారు గ్రా. 175. ఈ లడ్డూనే అందరికీ తెలిసినదే..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి